నువ్వే నా ప్రాణం

నువ్వే నా ప్రాణం

అంశం : నిన్ను దాటి పోగలనా

నిన్ను కన్న తల్లిదండ్రులను
నీ తోబుట్టువులను
నీతో బలపడిన బంధాలను
నీతో సాగిన స్నేహాలను

నీలో కలిగిన ఆశలన్నీ
మదిలో నింపుకుని
నీ చిన్ననాటి కలలను
కనులలో దాచుకుని

పెళ్ళి అనే పవిత్ర బంధంతో
ఏడడుగులు నడిచి
నా జీవిత ప్రయాణానికి
తోడుగా వచ్చి

నీ సర్వస్వాన్ని నాకే అర్పించిన
నిన్ను దాటి పోగలనా
నీ ప్రేమనంతా నాకే అందించిన
నిన్ను విడిచి ఉండగలనా

నా ప్రేమ మందిరంలో కొలువైన
నిన్ను దాటి పోగలనా
నా ప్రాణానికి ప్రాణం అయిన
నిన్ను విడిచి ఉండగలనా

రచయిత :: క్రాంతి కుమార్ ( ఇత్నార్క్ )

You May Also Like

8 thoughts on “నువ్వే నా ప్రాణం

  1. జీవితం మొత్తాన్ని మీ కవితలో చెప్పేసారండీ 👏👏👏👏

    1. థ్యాంక్స్ 🤗 అనురాధ గారు

      1. థ్యాంక్స్ 🤗 దీపు గారు

    1. థ్యాంక్స్ 🤗 బుజ్జమ్మ

    2. థ్యాంక్స్ 🤗 ఫ్రెండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!