చిన్న నాటి ఆటలు

చిన్న నాటి ఆటలు

రచన :: Sj.చామర్తి

చిన్న నాటి ఆటలే మిగిలే చిరు జీవితంగా,
చందమామ పాట అత్యాశల చాటు మాటుగా,
అంటరానితనపు బాధ ముట్టుకోలేకపోగా,
దోబూచులాట దమయంతి తోడుగా,
వీరి వీరి గుమ్మడి పండు విచక్షణగా,
పట్టుబడే లోపే గట్టెక్కెయ్యమనే చెరువు గట్టు సాక్షిగా,
నక్కి నక్కి దాక్కోమనే దాగుడు మూతల దండాకోరుగా,
అమ్మానాన్నల ఆట నిజమాయె పిల్లలు పుట్టగా,
అన్ని అనుభవాల సాక్షిగా ఓ అంత్యాక్షరిగా,
జీవితపు పంట లో పండరా అష్టా చెమ్మలు గా,
పరమ పాద సోపానం చుపెరా వైకుంఠపాళీగా,
మిగిలేరా జీవితం ఓ అక్షర మాలగా,
మూర్తీ భావించెరా నీ నామధేయంగా…
చిన్న నాటి ఆటలే మిగిలే చిరు జీవితంగా‌.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!