పెళ్ళనాటి సంబరం

పెళ్ళనాటి సంబరం

రచన :: మక్కువ. అరుణకుమారి

బహుధాన్యనామ సంవత్సరం
(1998,Aug13)
శ్రావణ బహుళ సప్తమి గురువారం
శ్రీరస్తు ,శుభమస్తు అంటూ శ్రీకారం చుట్టుకుంది మా పెళ్ళి పుస్తకం.

భాసికం కట్టుకుని బతుకు చిత్రం
వెతుకుతు మొదలైంది పయనం
గ్రామసరిహద్దుల్లో,అమ్మవారి సన్నిధిలో
అప్యాయతానురాగాల ఆహ్వాన వీణియలు
ప్రేమాభిమానాల పానాకాల తేనీయలు
అట్టహాసపు విందులు, ఆనందాల ఊరేగింపుల చిందులు
పందిళ్ళు, సందళ్ళు విడిది వినోదాలు

స్వాతిముత్యపు చిరుజల్లులతో సాయంత్రపు కాలిగోళ్శ సంబరాలు
సరిగంగ తానాలు ,మురియంగ పాణాలు
సప్తపదులు,సన్నికల్లు సకల సంప్రదాయాలు

వేకువజాము ముహూర్తాలు
నిదుర మరిచిన ఆత్రాలు
పన్నీటి స్నానాలు,పట్టుచీరల రెపరెపలు
మధుపర్కాల తళతళలు,కర్పూరహారాల మిలమిలలు
పూలజడల ఘుమ,ఘుమలు,అత్తరుల గుభాళింపులు

గౌరీ పూజలు,అడ్డుతెరల పరదాలు
కన్యాదానాలు,జీలకర్ర బెల్లాలు
మాంగల్యం తంతునానేనా”అంటూ మాంగల్యధారణలు
ముత్యాల తలంబ్రాలు,మురిపాల సంబరాలు
అయినవారి అప్పగింతలు,కనుకొలుకుల చెమరింతలు
ఆన్యోన్య దాంపత్యానికై అరుంధతి దర్శనాలు
ఆనాటి ఆ పులకింతలు,నేటికీ మది మీటే గిలిగింతలు.

***

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!