నా ప్రాణమా
రచన :: క్రాంతి కుమార్(ఇత్నార్క్)
ఎదలో చిరు ఆశలు రేపి
ఊహల ప్రపంచంలో విహారింప చేశావే
సంతోష సాగరంలో ఓలలాడించి
ఉల్లాస తీరంలో నడిపించావే
అనుబంధాల ఒడిలో లాలి పాడి
ప్రేమ వెన్నెలలో హాయినిచ్చావే
మనశ్శాంతి మల్లెల పరిమళాలను వెదజల్లి
ఆత్మీయతల తన్మయత్వన్ని అందించావే
మది నిండా ధైర్యాల స్పూర్తిని నింపి
భయాల ఆందోళనలను దూరం చేశావే
కష్టాలు కడలిలో తోడుగా నిలిచి
నష్టాల ప్రయాణంలో భరోసా ఇచ్చావే
విడిపోలేని బంధమై అల్లుకుపోయి
నా జీవిత అర్థాంగివి అయ్యావే
***
Awesome