కలిసిన బంధం

కలిసిన బంధం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల

పెళ్లి పందిరి వచ్చే అతిథులతో కళకళలాడుతుంది. ఎవ్వరి హడావుడి వారిదే ఒక పెద్దావిడ స్టేజీపైకి వస్తూ కల్యాణి? తలంబ్రాల బియ్యం కలిపావ పంతులు గారు అడిగినప్పుడు ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా ఇవ్వాలి అంది. అన్నీ ఉన్నాయి కదా మిగితావన్నీ జాగ్రత్తగా చూసుకోండి, అన్ని తెచ్చారో లేదోనని ఎంత కంగారు పడ్డానెే సరెలెే. అన్ని తెచ్చారు కదా మీరేం కంగారు పడకండి వదినగారు. మరి పుస్తెలు మట్టెలు ఎక్కడ ఉన్నాయి. అన్నీ నా దగ్గరే జాగ్రత్తగా ఉన్నాయి. ఇంతకీ వాడెక్కడ రాఘవ ఇప్పుడే కిందికి వెళ్ళారు, వదినగారు. మళ్లీ కిందికి ఎందుకు వెళ్లాడు పైన్నే ఉండమని చెప్పాను కదా పంతులుగారు. పిలుస్తారు. అన్నీ మేం చూసుకుంటామని చెప్పాను కదా! రాఘవ ఎక్కడున్నావ్ పంతులుగారు పిలుస్తున్నారు. అంటూ చెప్పింది. సరె అక్క వెళుతున్నాను. నేను అమ్మాయి ముస్తాబు అయిందో లేదో చూసి వస్తాను. ఇంక నువ్వెళ్ళు అంటూ అమ్మాయి గదికి వెళ్లింది. అక్కడ చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు ఇక్కడ హిమబిందు కూడా లేదు. ఇది హిమబిందు గదియే కదా! ఇక్కడ లేదే ఇంత హడావుడిలో ముహూర్తం టైమ్ దగ్గర పడుతుంది. కంగారుగా బాత్రూం వైపు వెళ్ళింది. అక్కడ లేదు అంత చూసింది. లేదేంటి భయంతో బయటకొచ్చింది. రాఘవ రాఘవ ఎక్కడున్నావురా కొంప మునిగింది అంటూ లబోదిబోమంటూ అరుస్తూ వచ్చింది. ఆమె అరుపులకు రమణ ఏమైంది ఏమైందంటూ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. కొంప మునిగిందిరా ఏమయిందక్క? అది గదిలో లేదురా! అంది ఏడుస్తూ ఇప్పుడు ఎక్కడికి పోతుంది. అక్కయ్య రూములో సరిగ్గా చూశావా చూశానురా హిమబిందు ఉన్న గదిలోకి వెళ్లారు. నిజంగానే లేదు, అక్కడ టేబుల్ పై ఒక లెటర్ కనిపించింది అది తీసి చూశారు. అందులో నాన్న నా క్లాస్మేట్ అరుణ్ అనే అతన్ని ప్రేమించాను  అతడితో వెళ్ళిపోతున్నాను అతన్నెే పెళ్లి చేసుకుంటాను. నా కోసం వెతికే ప్రయత్నం చేయకండని అని రాసిపెట్టి ఉంది. అక్కడ ఎవ్వరా అందరు రండి వాళ్లు ఎక్కడ ఉన్న వెతికిపట్టుకు రండి అంటూ రౌడీలకు కత్తులు కర్రలు పట్టుకు వెళ్లమని పురమాయించాడు అట్లాగే దొరా అంటూ పదండిరా మల్లన్న ఎల్లన్న వెళ్దాం పదండి అంటూ రామదండుల వెళ్లారు. అప్పటిదాకా పెళ్లిపందిరి కోలాహలంగా సంతోషంగా ఉన్న పెళ్ళి పందిరంతా నిశ్శబ్దంగా మారింది. పెళ్లి వాళ్లకు ఏదో చెప్పి పంపించారు. అందరూ ముక్కుమీద వేలేసుకుని గుసగుసలాడుతున్నారు. హిమబిందు వెళ్లిపోవడంతో కల్యాణి బాధపడుతుంది. రాఘవ కల్యాణి దగ్గరికి వస్తు నీకేమీ తెలియదా! అంటూ గట్టిగా అరిచాడు నాకేం తెలియదండి. ఏడుస్తూ చెప్పింది. పెళ్లికి వచ్చిన వాళ్లంతా ఎక్కడి వాళ్ళక్కడ వెళ్లిపోయారు. ఆడపడుచు కూడా  కల్యాణిపై బాగా అరిచింది. ఇప్పుడు పరువంతా పోయింది. ఏం చేస్తావు కల్యాణి సరిగ్గా చూడటం చాతకాక పోతే ఎట్లా? నువ్వేం చేస్తున్నావ్ ఆడపిల్లలను కనగానే సరిపోదు సక్రమంగా పెంచటం నేర్చుకోవాలి. ఏంటి వదిన మీరు కూడా అలాగే అంటారు నాకు మాత్రం ఏం తెలుస్తుంది. నాకేమైనా చెప్పి చేసిందా మీకు లాగే నాక్కూడా తెలియదు. కదా ఏడుస్తూ రూమ్ లోకి వెళ్లింది. నలుగురు నాలుగు వైపుల వెళ్లారు ఎక్కడా కనిపించ లేదు తిరిగి తిరిగి ఇంటికి వచ్చారు అయ్యగారు. అమ్మాయిగారు దొరకలేదండి అన్నారు. వెధవల్లారా చేతులూపుకుంటూ వస్తారా! సిగ్గులేదూ, దున్నపోతుల్లా ఉన్నారు. దేనికి పనికిరారు వెళ్లండి అంటూ కోప్పడ్డాడు తలలు వంచుకుని వెళ్లారు. కల్యాణి అలా రోదిస్తూనే ఉంది. అలా వారాలు నెలలు సంవత్సరాలు గడిచాయి. వాళ్ళు ఎక్కడున్నారన్న జాడ తెలియలేదు. హిమబిందు మేనత్త బెంగపెట్టుకొని చనిపోవడంతో తను కూడా వ్యాపార వ్యవహారాల్ని మానుకున్నాడు. రాఘవ కొడుకు చదువు పూర్తి చేసుకొని అమెరికా నుండి ఇండియాకు వచ్చాడు. తన అక్క అలా చేయడంతో చాలా కుమిలిపోయాడు. తల్లిదండ్రులను ఓదార్చాడు ఈ టైములో తను చెప్పడం మంచిది కాదనుకున్నాడు కాని తప్పలేదు విజయ్ ఎలాగైనా చెప్పాలనుకున్నాడు. తన ఫ్రెండ్ రమ్య ఇద్దరూ ఇప్పుడు ఇండియాకు వచ్చారు. ఇక్కడే ఉండాలనుకుంటున్నారు. నాన్నగారు మీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు. ఏంటిరా చెప్పు అన్నాడు నేను నేను అంటూ చెప్పబోయాడు. నేను నేను అంటూ నసుగుతావు ఏంటిరా! చెప్పేదేదో చెప్పి తగలడు నువ్వు కూడా మీ అక్కలాఎవరినైనా ప్రేమించావా అనుమానంతో అన్నాడు. అవును అన్నాడు మెల్లిగా నేను రమ్యను ప్రేమించాను నాన్న నాతోపాటే చదువుకుంది. తను నన్ను చాలా ఇష్టపడుతుంది. ఇద్దరి అభిప్రాయాలు చదువు ఒకటే కావడంతో ఇద్దరం ఇష్టపడ్డాం అంటూ చెప్పుకొచ్చాడు. మీ అక్కలా నువ్వు కూడా అదే పని చేసి తగలబడ్డావు కదా! ఇంక మా పిల్లలే అక్కర్లేదు నువ్వు కూడా మా కంటికి కనిపించకుండా వెళ్ళిపో అన్నాడు. గట్టిగా అరుస్తూ పిల్లలు పుట్టలేదు అనుకుంటాం. లోపలి నుండి కల్యాణి వస్తు ఏంటండి అంతా గట్టిగా అరుస్తున్నారు. అమ్మాయి వెళ్లిపోయి తన బ్రతుకేదో తను బ్రతుకుతుంది. ఇప్పుడు అబ్బాయిని కూడా మనం దూరం చేసుకుంటామా! ఒక్కసారి ఆలోచించండి. నా మాట వినండి, అది కడుపుకోత మిగిలించి వెళ్లింది. బాబును కూడా దూరం చేసుకుంటే మనం బ్రతికి ఉండి ఏం ప్రయోజనమండి అనే అంతలో ఎవరైనా ఉన్నారా అంటూ తలుపు కొట్టిన శబ్దం అయింది ఎవరు అంటూ రాఘవ బయట కొచ్చాడు.
చూడముచ్చటైన సాంప్రదాయ దుస్తుల్లో హాఫ్ శారీలో అందంగా నా బిడ్డ బిందు లానే ఉంది. ఎవరు ఈ అమ్మాయి ఎందుకొచ్చింది. మనసులో అనుకొని ఎవరు కావాలమ్మా అంటూ అడిగాడు నమస్తే అండి నా పేరు రమ్య విజయ్ క్లాస్మెంట్ను విజయ్ ఉన్నాడా అంటూ అడిగింది.
ఓహో ఈ అమ్మాయే కాబోలు అనుకున్నాడు. మనసులో ఉన్నాడు. రామ్మా అన్నాడు తన వెనకాలే వెళ్లింది. హాయ్ రమ్య నాన్నను పరిచయం చేసి, తల్లిని కూడా పిలిచాడు లోపల్నుండి కల్యాణి వచ్చింది. ఈమె మా అమ్మ అంటూ రిచయం చేశాడు. హాయ్ ఆంటీ అంటూ ఇద్దరి కాళ్లకు నమస్కరించింది. పరిచయాలయ్యాక విజయ్ మా నాన్నగారు మీకు ఎప్పుడు వీళ్లు ఉంటుందో కనుక్కోమన్నారు. మన పెళ్లి విషయమై మాట్లాడటానికి వస్తారట అని చెప్పింది గలగలా మాట్లాడుతుంటే టైమే తెలియలేదు. కొత్తగా అనిపించలేదు చాలా పరిచయమున్నట్టుగా ఉంది. ఎన్నో రోజుల తరువాత తన బిందునెే చూసినట్టుగా ఉంది. తన మనసు మార్చుకున్నాడు. హిమబిందు వెళ్లిపోయాక చాలా మానసికంగా కృంగిపోయారు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత తన మొహంలో ఆనందం కనబడుతుంది. అమ్మాయిని చూడంగానే ఎంతో సంతోషంగా ఉంది అంకుల్ అనగానే ఇటు వైపు చూసి చెప్పమ్మ అన్నాడు. మీకు ఎప్పుడు వీలుగా ఎలా ఉంటారో చెప్పనేలేదు. మా అమ్మా నాన్న వస్తారు. అంది సరే మీరే వీలు చూసుకుని కబురు పంపండి ఎప్పుడైనా రండి అన్నాడు. సంతోషంగా కళ్యాణికి ఎన్నో రోజుల తర్వాత తన భర్త మొహంలో ఆనందం సంతోషం చూసింది. అమ్మయ్య అనుకుంది. ఇంత పట్టాన ఒప్పుకుంటాడు అనుకోలేదు. వస్తానన్న రోజు రానే వచ్చింది రమ్య తల్లిదండ్రులతో ఇంటికి బయల్దేరారు. విజయ్ అమ్మా, నాన్నా ముగ్గురు గుమ్మంలో ఎదురుచూస్తున్నారు. కల్యాణి రాఘవ ఇంత కాలానికి వాడి పెళ్ళి తోటైనా ఇల్లు సంతోషంగా ఉంటుందని ముచ్చట పడుతున్నారు. కారు హారన్ వినరావడంతో ముగ్గురు గుమ్మంలో నిలబడ్డారు రండి అంటూ లోనికి ఆహ్వానించాడు. లోపల అడుగుపెట్టగానే ఎదురుగా తన తల్లిదండ్రులను చూడగానే హిమబిందు షాక్ అయింది. నోట మాట రాలేదు. రాఘవ కూడా చాలా ఆశ్చర్యం వేసింది. కళ్యాణికి మాటేరాలెేదు అమ్మ బిందు అంటూ దగ్గరగా వచ్చి వాటేసుకుంది. కల్యాణి,”అరుణ్ “మావయ్య నన్ను క్షమించండి. అంటూ ఇద్దరు తల్లిదండ్రుల కాళ్లకు  నమస్కరించారు. మీకు దూరమై మేం చాలా తప్పు చేశాం అంటూ బాధపడ్డారు. అలా జరగాలనుంది.  అలా జరిగిపోయింది. గతం గతహా! విజయ్ కూడా చాలా ఆశ్చర్యపోయాడు. తన అక్క కూతురని ఇప్పటివరకు తెలియదు. శత్రుత్వాలు పెట్టుకుని సాధించేది ఏముంది అనుకున్నారు. దూరమైన ప్రేమలు మళ్లి రమ్య ద్వారా కలుసుకున్నాయి. పేగు బంధం అంటే ఇలానే ఉంటుంది. రమ్యకు కూడా చాలా సంతోషంగా ఉంది. తన మేనమామనే తనకు భర్త కాబోతున్నాడని సంతోషంగా ఉంది. ఇద్దరి కుటుంబాల్లో శత్రుత్వాలు పోయి సంతోషాలు నిండుకున్నాయి. అమ్మమ్మ, తాతయ్య నాకు చిన్నప్పుడు చెప్పని కబుర్లన్నీ నాకిప్పుడు చెప్పాలి. అంది నవ్వుతూ దానికేం భాగ్యం అంటూ నవ్వేశారు. రాఘవ ఎన్నో రోజుల తరవాత, నిండుగా నవ్వాడు. నాలుగు రోజులు ఇక్కడే ఉండండి అంది అమ్మా రేపు పెళ్లి చేసుకున్నాక ఇక్కడే వుండాలి కదా! ఇప్పుడు మాతోటి వస్తుందిలే నవ్వుతూ అంది కల్యాణి. మీ నాన్నగారి మొహంలో సంతోషం చూశావా బిందు అవునమ్మా, నాక్కూడా చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు దూరంగా ఉన్నానని బాధ కూడా ఉంది. మీ అత్తయ్యకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసు కదా! నువ్వు వెళ్లిన తర్వాత బాధతో మానసికంగా కుంగిపోయింది. డాక్టర్లు ఇలాగే ఉంటే ఎక్కువ కాలం బతకదన్నారు ఎంత చెప్పినా వినేది కాదు బిందు. బిందు అంటూ కలవరిస్తూనే చనిపోయింది. అయ్యో అత్తయ్య నీకు నమ్మకద్రోహం చేశాను. నన్ను క్షమించు అత్తయ్య  అంటూ ఫొటోకు నమస్కరించింది. భోజనాలు చేసి వెళ్లిపోయారు. రమ్య రెండ్రోజులు ఉండని అన్న వినలేదు. మీ ఇష్టం తల్లి వారంలో వస్తాము పెళ్లి ముహూర్తాలు పెట్టుకోడానికి అంది. విజయ్, రమ్యల పెళ్లి  ఘనంగా చేశారు. రాఘవయ్య సంతోషం ఇంతా అంతా చెప్పలేం రమ్య సంవత్సరం తిరగకుండానే పండంటి బాబు కని అమ్మమ్మ చేతిలో పెట్టింది. అమ్మమ్మ, తాతయ్య సంతోషానికి అవధుల్లేవు. ఎక్కువ మనవడితోనెే కాలక్షేపం చేసేవారు. బిందు మధ్యమధ్యలో వచ్చి తల్లిదండ్రులను మనవడిని చూసుకుంటూ వెళ్లిపోయేది. రాఘవయ్యలొ కొత్త మార్పు వచ్చింది. చిన్న పిల్లాడిలా మారిపోయారు. ఈ జీవితానికి ఈ సంతోషం చాలనుకున్నాడు. రమ్య అమ్మమ్మ, తాతను బాగా చూసుకుంటుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!