చిలిపి అంతరంగము

చిలిపి అంతరంగము
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభా కరి

సూర్యునితో నేస్తం, పనిలో నైపుణ్యాలు, స్నేహంలో ఆత్మీయత అనురాగం సహాయంతో శక్తి సామర్థ్యం అన్ని చక్కగా ఉన్న నేర్పరి, అయితే ఆమెకు నచ్చాలి ఆమె మెచ్చాలి అప్పుడే ఆమెతో చెలిమి అమే ఎవరో కాదు  అదేనండి అమె మయూఖ సరే ఇంకా కథలోకి వెడదామా, మయూఖ ఈ తరం తెలివి అయిన అమ్మాయి. ప్రతి పని ఎంతో ఆలోచించి చేస్తుంది. అయితే కొంత పాలు చిలిపి తనం ఉన్నది దానితో ఆమెను అంతా హాస్య మంజరి అంటారు. మయూఖ ఇద్దరు ఆడపిల్లలు లో రెండవది  జర్నలిస్ట్ అవ్వాలని కోరిక పత్రికలు ఎక్కువ పుస్తకాలు ఎక్కువ చదువుతుంది
ఇంటి పనులు ఇతర వ్యవహారాలు తండ్రి వెనుక చూస్తుంది. తమ్ముడు యశోధర నీ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేస్తున్నాడు, ఇప్పుడు ఎవరూ భూమి మీద ఉండటానికి ఇష్ట పడటం లేదు అందరూ విహంగ విక్షణమే ముఖ్యము అదే జీవిత పరమా వధి కూడా పెద్ద పిల్ల సురేఖ ఇంజినీర్ చదివింది డిగ్రీ కాగానే పెళ్లి చెయ్యాలి ఒక్క పిల్ల కైన అన్నారు ఇంటి పెద్దలు. సరేంటు సంభందాలు చూశారు ఏ వక్కరు సరి అయిన వాళ్ళు దొర కటల్లేదు. మంచి వాళ్ళు అని ముఖం మీద రాసి ఉండదు కదా ఒక పెళ్లి కొడుకు వచ్చాడు. అతన్ని ఒక సినిమా కమెడియన్లు తో పోలి చారు. అతను దానికి తోడు ఇంకో ఇద్దరు పట్టేలా చొక్కా తోడుగు కోని వచ్చాడు. కూడా అక్క అమ్మ వచ్చారు, బావ గారికి ఖాళీ లేదు మానన్నకి క్యాంపులు సరి, పెళ్లి కూతురు నచ్చా వల్సినది
ఆడవాళ్ళకి మగ వాళ్ళకి కాదు, ఇల్లాలి లక్షణాలు మా అమ్మకి అక్కకి ఎక్కవ ఉన్నాయి హి హిహి అందుకే వాళ్ళు వచ్చారు హిః హి అన్నాడు
ఒకే హి హి హి హి అని మయూఖ అన్నది
ఏమిటి మరదలు పిల్ల అప్పుడే వేళాకోళం మొదలు పెట్టింది బావ గారిని అన్నాడు హి హి అంటూ.
పార పళ్ళు పెట్టుకున్న ఒక పెద్ద సినిమా స్టార్ జ్ఞాపకం వచ్చాడు, నాకు అన్ని మా అక్క చూస్తుంది రెఢీ మెడ్ షర్టు కొంచెం పెద్దది తెచ్చింది. ఎందుకంటే రెండు మూడు నెలల్లో మీ అక్క వంట తింటాను. కదా నేను లావు ఎక్కు తానని వినయంగా చెప్పాడు
అతి వినయం దూర్త లక్షణం కదా అనుకున్నారు
తీరా అన్ని కుదిరాక పిల్లాడు అక్క స్నేహితులు వస్తారు వారికి అతి మర్యాద చెయ్యాలి ఏసీ లాడ్జి లు పట్టు చీరలు వాళ్ళ పిల్లలకి మంచి ఆధునిక
గౌనులు కావాలి  పక్కింటి వారు ఎదురింటి వారు వస్తారు. వాళ్ళకి తొమ్మిది గజాల చీర కొనండి అని చెప్పారు. ఇదేమిటి అత్తింటి వారికి తప్పవు కానీ ఆ విధి అంతా చక్కగా  బట్టలు పెట్టమంటారా అని అనుకున్నారు. సరే పెళ్లి ఖాయం చెయ్యి మంటా ా అంటు మధ్య వర్తి ఫోన్ వారికి ఇంకో సంబంధించిన వాళ్ళు పిల్లని చేస్తారు వాడికే మీ బ్యాంక్ మేనేజ్ ర్  అంటూ మూతి తిప్పింది వాళ్ళ అమ్మ. సరే మేము ఆలోచిస్తాను అని నాన్న ఆ సంబంధం గురించి వాకబు చేశాడు. ఏమిటండీ అల అంటారు అని మధ్య వర్తి అన్నాడు. పిల్ల రేపు పొద్దున్న అత్తింటికి వెళ్ళాలి కదా  రోజు అత్త అడబ డుచు వంకలు పెడుతుంటే ఎలా? పిల్ల చదువు కొన్నది. పిల్లాడు ఉద్యోగం వద్దు అన్నాడు సరే  స్తోమత ఉంది పిల్లని బాగా చూస్తాడు అనుకున్నాము కానీ పిల్లాడు
ఆడవారు వద్దికలో ఉంటాడు. మామగారు పెత్తనం లేదు ఆయన అత్తగారు మాటకు అంతేగా అంతేగా అంటారు. సరే ఇంకా భయ పడి ఆ సంబంధం వద్దు అన్నారు మళ్లీ పెళ్ళిచూపులు టిఫిన్ తిని వెళ్ళడం మొదలు. చేతికి అంట నీ జీడి పప్పు పకోడీ కారం మైసూర్ పాక్ పాల కోవా పూత రేకు బాదం బర్ఫీ వంటివి తిన వచ్చును. దీనిని బట్టి అతి ఖరీదు స్వీట్ హాట్ తిన వచ్చును అని చెప్పారు. ఇది బాగానే ఉన్నది అన్నది మయూఖ ఖరీదు స్వీట్ అయితే తిన వచ్చును: మరో పెళ్ళికొడుకు పొట్టిగా ఉన్నాడు సురేఖ చూస్తే ఐదున్నర అడుగుల తెల్లగా బొద్దుగా అందంగా ఉంటుంది. ఒక్కడికి రూపం లేదు సరి కదా గుణం లేదు అని అర్థం అవుతోంది
గుణం తెలియవు కనుక రూపం డబ్బు చూసి చేస్తారు. పెళ్ళికొడుకు బామ్మ తాత గారు ఉన్నారు
వాళ్ళకి నిప్పులు కడిగి ఆరబెట్టి అన్నం వండాలి అన్నారు. ఇంకా మీ మనుమడు కి పెళ్లి ఆశా వదిలెయ్యండి ఇంకో పెళ్ళికొడుకు చెవుల్లో ఎయిర్ ఫోన్ పెట్టుకుని ఎదో పాటలు వింటూ వచ్చాడు
బామ్మ ఇదేమిటి చెవిటి మిషన్ పెట్టుకున్నాడు చెవిటి వాడా వీడు అన్నది బిగ్గరగా అనకు వాళ్ళు వింటే బాగుండదు  అధి ఇప్పటి ఫోన్ ఫ్యాషన్ అన్నది అయితే ఆ అబ్బాయి కీ ఇంట్లో వాళ్ళకే కాక వాళ్ళ స్నేహితుల్ని తీసుకు వచ్చి చూపిస్తాను
రెండో సారి హోటల్ లో పెళ్లి చూపులు చూపాలి అన్నాడు. దానికి ఇంట్లో వాళ్ళకి భయం కోపం వచ్చాయి. మాకు వద్దు అని మధ్య వర్తికి చెప్పారు మాకు పిల్ల నచ్చింది. ఏమి మాకు కట్నం వద్దు అన్నారు. కానీ మేము వద్దు అనుకున్నాము అన్నారు. అలా ఎన్నో సంభందాలు కుదర లేదు
అసలు ఈ రోజుల్లో మగ పిల్లాడికి ఎదురు కట్నం ఇస్తే గాని పెళ్లి కాదు అని చెపుతున్నారు ఆబ్బా యి పుట్టాడు అంటే భయ పడుతున్నారు వాడిని ఎంతో నీతి మంతుడు గా పెంచాలి ఐదు అరు డిగ్రీలు ఉండాలి. బ్యాంక్ బేలన్స్ దండిగా ఉండాలి అప్పుడే పెళ్లి అలోచన లేకపోతే ఎవరూ చేసుకోరు. అమ్మాయిలు సామాజిక పరంగా విద్య పరంగా ఎధి గాక అబ్బాయి పెళ్ళిళ్ళు కష్టం ఆయ్యాయి.
మొత్తనికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు విదేశీ జీవితము. రెండవ కొడుకు తల్లితండ్రుల దగ్గర ఉంటాడు. కోడలు ఉద్యోగం చెయ్యాలి వంట వార్పు చెయ్యాలి చెప్పి నట్లు వినాలి నెల జీతం అత్త చేతిలో పొయ్యాలి ఇది రూల్స్  ఇది తప్పితే ఇంకా సంభందాలు ఉన్నాయి. కానీ అవి మరి చెత్త లా ప్రశ్నలు వేశారు, బాగా డబ్బు చదువు అన్ని ఉన్నా ఆడపిల్ల జీవితము లో పెళ్లి కస్టం అని తెలిసింది.
సరే డబ్బై యోగాల పెళ్ళి అన్నారు. అంటే ఖరీదైన బట్టలు వంట మనిషి, పనిమనిషి కి పట్టు బట్టలు పెళ్లి కొడుక్కి డజను సూట్ లు సఫారీ లు కోట్లు పెళ్లి సల్వార్ కమిజ్ లు ఇలా చెప్పారు. ఇంత వరకు వచ్చిన సంబంధాలు పిల్ల ఉద్యోగం వద్దు అన్నారు కానీ ఈ సంబంధం వారు మాత్రం పిల్ల ఉద్యోగం చెయ్యాలి అన్నారు. అందుకు ఒప్పు కొన్నారు
సరే ఇంకా అడపిల్ల లు లేరు కనుక అన్ని లాంఛనాలు అత్తగారు కే అంటూ పెళ్లిళ్ల పేరయ్య చెప్పాడు. పెళ్లి అయింది పిల్లకి ఉద్యోగం వచ్చింది వేరు కాపురం మద్రాస్ లో పెట్టాలి. అత్తగారు దగ్గర ఉండి పాలు పొంగించి పూజ చేసి మంగళ హారతి పాడు అన్నది. కూడా మయూఖ మాత్రం అత్తయ్యా గారు ఇంజినీర్ కోడలికి మంగళ హారతులు రావు వంట కూడా సరిగ్గా రాధు డబ్బు మాత్రం సంపాదించి ఇస్తుంది అన్ని కావాలంటే ఎలా? అవునా అక్క హి హి హి హి మనిషి ఏదో ఒక కోరికతో పెళ్లి కి అంగీకరించాలి అన్ని ఆడపిల్లకి ఉండాలి మగ వాడికి ఎది ఉందక్కర లేదు ఉద్యోగం చేసి డబ్బు ఇస్తుంది అంతే. మీరు వంట మనిషిని పని పనిమనిషిని పెట్టుకుని ఇల్లు చుసు కొండి అని మయూఖ చెప్పింది. బాబోయ్ నిన్ను ఎవరూ కట్టు కుంటా రో వాళ్ళ పని సరి మరదలా అన్నాడు బావ
మయూఖ అక్క పరిస్తిని బట్టి ఎన్ని చదువులు చదివిన ఆడపిల్లకి వంట వార్పు ఇంటి పని తప్పదు కదా పెద్ద మనుమరాలు పెళ్లి  అయింది ఇల్లు అంతా వెల వెల పోయింది ఇంకా రెండవది వెడితే అసలు కాలం గడవదు. పిల్లాడికి పెళ్లి చేస్తే ఎలాంటిది వస్తుందో అని బాధ పడ్డారు ఓ వంట మనిషిని పెట్టారు దానికి వంట రాదు కాని డబ్బు కోసం వచ్చింది నెలకు ఇరవై వేలు ఇవ్వాలి వేడి వేడిగా అధి క్యారేజ్ సర్దుకుని వెళ్లిపోతుంది. వీళ్ళే పెట్టుకోవాలి తాత గారికి అబ్బాయికి పెట్టీ వెళ్ళ అన్నది సరే యజ మాని కి తప్పు తుంధా తప్పదు కదా, వచ్చిన రెండో రోజు పీఠ వేసి కంచం పెట్టు అని చెపితే పీఠ అడుక్కీ కంచం పెట్టింది. కాలి ఫ్లవర్ కూర వాండాలీ అంటే పువ్వును కుక్కర్ లో పెట్టీ మూత పెట్టుకొని ఉంచింది. విజిల్ వచ్చాక దింపింది గిన్నెలో పువ్వు లా పెట్టు ఉప్పు కారం నెయ్యి చల్లింది.
భోజనానికీ వచ్చి చూస్తే గిన్నెలో ఫ్లవర్ ఉన్నది ఎలా తినాలి అంటే ఫోర్క్ తో గుచ్చి ముక్కలు వేసుకోండి.
అంటూ క్యారేజ్ సర్దుకుని అవ కాయ పప్పు వేసి నెయ్యి గిన్నె వంచేసి పట్టుకు వెళ్ళింది. మయూఖ ఆలోచించి చెప్పింది. ఎక్కడ జీతము లైన ప్రైవేట్ స్కూల్స్ కంపెనీలో పది వేలు మించి లేవు అంతా కన్న బామ్మ అమ్మ చెప్పి నట్లు వంట నేర్చుకుంటే రుచి గా తినవచ్చును అని నిర్ణయించుకుని ఇంటర్వ్యూస్ అప్లికేషన్స్ మానేసి వంట క్లాసులకి వెళ్ళింది ఒక నెల వెళ్లి వచ్చాక ఆలోచించింది.
ఒక స్టాల్ పెడితే నయం బిర్యాని స్టాల్  పెళ్లికి కావలసిన సారే పిండివంటలు మొదలు పెట్టింది. ఇదేమి బుద్ది చక్కగా చదువుకుని ఉద్యోగం చెయ్యక ఇలా మొదలు పెట్టావ్ అంటూ కొందరు కసురు కొన్నారు. ఆహా అన్ని ఉద్యోగాల లోకి ఎదే బాగుంది పెళ్లి వారికి వంటకాలు తప్ప్పవు ఎంత ఖరీదు అయిన కొంటారు అన్నది అన్ని చిపి చేష్టలు అల్లరి చేసే అమ్మాయి ఇంత బుద్దిగా బిజినెస్ ఆలోచించి పెట్టడమే కాక పది మందికి ఉపాధి ఇచ్చింది
ఒక ప్రక్క ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ఎన్నో సామాజిక సమస్యలకు పరిహారం చెప్పే కథలు వ్యాసాలు రాస్తూ సమాజంలో ఒక చేతన్యం తెచ్చింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!