నా పెదవులపై…

అంశం:- హాస్యకథలు

నా పెదవులపై…
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన:మహేష్ వూటుకూరి

మాటకు ముందు నవ్వు, మాటతో నవ్వు మాట తరువాత నవ్వు అదీ  ఈ కథ కథానాయిక లలిత  సరితల గురించిన మొదటి మాట.. స్వచ్ఛమైన మనసు అంతా బాగుండాలనే సహజసిద్ధమైన గుణం..  ఎవరైనా కష్టంగా వుంది అంటు కన్నీళ్ళు పెడితే ఓస్ ఇంతేనా ఇంతదానికే ఏడుపా నీకంటే పలానా వాడి కష్టం ఇది అంటు వారి కష్టం గురించి చెప్పి, నీ కష్టం చాలా చిన్నది కదా అని వారి చేత అవును నా కష్టం చాలా చిన్నదే అని చెప్పించి నవ్వించి మరి పంపించేస్తారు నా చిరు నవ్వుల లలిత సరితలు..ఇంతకు ఈ లలిత  సరిత ఎవ్వరో చెప్పలేదు కదా! మీకు నా ముద్దుల బంగారు కూతుర్లు. వయసుకు మించిన ఆలోచనలు  సమయస్పూర్తి గల మాట  సమన్వయంతో కూడిన స్ప్రహ కలిగి  ఎంత బాధనైనా  ఎంతటి విషాదాన్నైనా తగ్గించే ఔషదాల వంటి మాటలతో ఓదార్చ  గల  అనునయత్వ హృదయం వారిది..
పీడకల లాంటి నా గతాన్ని మరచిపోయి, కోలుకొని మనిషిగా మనుగడ సాగించ గలుగుతున్నానంటే నా ఇద్దరి ఆడపిల్లల గొప్పతనమనే చెప్పాలి. మగ పిల్లల కంటే ఎక్కడా తక్కువని చెప్పను. అసలు ఒక మాటలో చెప్పాలంటే మగ పిల్లలు నాకు లేరు కదా అనే భావనే ఏనాడు నాకు రాలేదు..బయట పనుల ఒత్తిడిలో అలసిన నాకు ఇంటికెలితే నా శ్రీమతి  వాసంతి, మా పెద్దమ్మాయి   లలిత  చిన్నమ్మాయి సరిత  వీరి మద్యలో వీరి మాటలతో నాలోని ఒత్తిడి చిత్తుగా ఓడిపోయి పారి పోతుంది..  ఎన్నడు ఎప్పుడు వినని కొత్త కొత్త హాస్యభరిత ముచ్చట్లతో సమస్తం సమకూరుస్తు  మేముండగా మీకెందుకు శ్రమ అంటు పరిశ్రమిస్తు  నను లాలిస్తు పరిపాలిస్తు అనునయించే ఆ ముగ్గురిని నా అమ్మలు అనవచ్చు వాళ్ళను..ఎప్పుడూ సుఖంగా వుండటం కాకుండా అప్పడప్పుడు  కష్టం రుచి కూడా చూడాలంటు మరోసారి కష్టం మా తలుపు తట్టింది…మొదటి కష్టం వచ్చినప్పుడు నా పిల్లలకు ఊహ లేదు ఇప్పుడు వచ్చిన కష్టం మరలా నన్ను ఒక్క ఆటాడలనుకుంది పాపం తనకేం తెలుసు, కష్టాన్ని కబాడి ఆడించేయగల  ఝాన్సీ లక్ష్మీ బాయ్, రాణి రుద్రమదేవిల వంటి నా పిల్లలు వున్నారని. కష్టం ఉషోదయం లా ఉదయాన్నే వచ్చింది రాహుకాలం వర్జ్యం లాంటివి ఏవి చూడకుండానే.. చూసుకొని వద్దామని అనుకొని వుండదులే, ఎందుకంటే తనకు ఏడిపించడమే తెలుసు, నవ్వించడం దానికి తెలియదు కదా…  కాని దానికి  అది వచ్చిన ముహూర్తం బాగాలేదు.. నా పిల్లల చేతిలో ఓడిపోయి ఘోరపరాజయం పాలై పారి పోయింది..
ఇంతకు కష్టమేదో చెప్పలేదు కదా..అందరిని నమ్మే నా గుణం  ఈ మద్యనే ఓ ఇద్దరితో కలిసి ఓ వ్యాపారం  ప్రారంభించాను..వాళ్ళు  పైకి కనిపించే మేడిపండులా  వుంటు లోపలంతా కించిత్ పురుగుల బుద్ది కలవారు, ఈ విషయం తెలుసుకునే సరికే ఆలస్యం జరిగి పోయింది..  భాగస్వామ్యం సొమ్మును స్వాహా చేసి, తప్పుడు లెక్కలు సృష్టించి తప్పులు చేసి ఆ తప్పులను నాపై నెట్టి తప్పించు కోవాలని చూశారు.. విషయం అంతా విన్న నా పిల్లలు  ఓస్ ఇంతే కదా నాన్న, అంటు మేం పరిష్కారం చేస్తామంటు ఒక్కరోజులో సమస్యను సంధితో పరిష్కరించారు.. చాలా సులభంగా.
నా  తోటి  భాగస్థుల పిల్లలను కలిశారు విపులంగా వివరంగా జరిగిన విషయాన్ని లెక్కలతో సహా పక్కాగా  పూసగిచ్చినట్లు వివరించి వాళ్ళచేత వాళ్ళ నాన్న వాల్లది తప్పు అనే విషయాన్ని గ్రహించేలా చేసి, ఇది బయటకు వెళితే మన కుటుంబం పరువు ప్రతిష్టలకు ఎంత అగౌరవమో తెలియ చెప్పి వారి నాన్నలతో వారే మాట్లాడేలా చేసీ మహాభారతం లో సుయోధనుడితో  రాయబారానికి పోయిన కృష్ణుడిలా జరిగినవి జరుగబోయేవి అన్ని వివరించి, మీరు చేసింది తప్పు మాకు ఇది నచ్చలేదు. మీరు మా కోసమే కదా ఇది చేసింది.. మాకు ఈ తప్పడు మార్గం సొమ్ము వద్దనేలా చెప్పించి వారిలో కనువిప్పు కలిగించి నేను మరోసారి మోసపోకుండా చేసిన నా బంగారు తల్లులను చూస్తే నాలో ఓ కొత్త శక్తి , నాలో చెప్పలేని ధైర్యం, నేను ఈ సమాజానికి ఓ మంచి ఇద్దరు పౌరురాళ్ళను అందించాననే తృప్తి నాలో…
కాలం మారుతున్నా కట్టుబాట్లు మారుతున్న ఏవి మారినా అవి మానవ సంబంధాలను బలోపేతం చేయాలి, చేసేలా వుండాలి . ఒకరికి చేయూతను ఇచ్చేలా, దిశానిర్దేశం చేసేలా మనిషి తన ప్రస్థానాన్ని సాగించాలి. సాగించాలంటే  పిల్లలతోనే రావాలి..  నేను అది చేశాననిపించింది  సమస్యకు భయపడని నైజం ఉంటే చాలు చక్కగా మల్లెతీగలా అల్లుకు పోతారు. సుగంధ పరిమళాల వంటి  మంచిని పంచుతారు కదా..నా బంగారు తల్లులు లలిత సరిత లలో  అన్ని వున్నయ్ కాలానికి అనుగుణంగా  రోజును మూడు భాగాలుగా విభజించుకొని  వేకువనే లేచి  యోగా ద్యానం పుస్తక పఠనం ఇంటిపని  వంటపని  ఇలా అన్ని పనులు చేస్తు  ఆరోగ్యకర మైన నిద్ర తో నిత్య నూతనంగా చిరనవ్వుల  పువ్వులై  అందరిని నవ్విస్తు సమస్యలకు భయపడని వ్యక్తిత్వంతో  అడుగులు వేస్తుంటే నాలో ఏదో చెప్పలేని తృప్తి చిరునవ్వై వికశించింది నా పదవులపై.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!