“చిట్టి కొంగ” 2nd,.క్లాస్

“చిట్టి కొంగ” 2nd,.క్లాస్.
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన : యాంబాకం

        అనగా అనగా ఒక అందమైన సరస్సు. ఆ..సరస్సు ను నమ్ముకొని, కొంగ జాతులు, మూడు తరాలుగా జీవిస్తూన్నాయి. అవి ఈ మూడు తరాలుగా! ఆ సరస్సు లోని చేపలను వేటాడి తిని హాయిగా జీవిస్తూ ఉండగా ఒక కొంగకు ఇలా ఆలోచన తట్టింది. మనం చదువు, సంధ్య, లేకుండా పోవడం వల్ల బతకటం, తెలియక చాలా సార్లు చాలా దగ్గర మోసపోయాము. ఇక రాబోయే తరానికి ఇలా జరగాడనికి వీలులేదని ఈ రోజుల్లో అందరూ పిల్లలను చదివిస్తున్నారు. నా పిల్లలకు కూడా చదివించాలని అనుకుంది. అనుకొనేతడువుగా తన పిల్ల ఐన చిట్టి కొంగ కి  ఏమి తక్కువని తలచి తన పిల్ల ఐన చిట్టి కొంగను బడికి పంపి చదువు చెప్పించింది. స్కూల్ ల్లో గొంతు బాగున్నావాళ్ళూ, బాగాలేని వాళ్ళూ సంగీతం నేర్చుకొంటున్నారని తెలిసి నా చిట్టికొంగ కీ ఏం తక్కువ అని చిట్టికొంగ కి కూడా సంగీతం నేర్పించింది. ఇంకా కొంతమంది నాట్యం నేర్చుకొంటున్నారని తెలిసి నా చిట్టికొంగ కీ ఏమి కొరవ అందంవున్నవాళ్ళూ, లేనివాళ్ళూ నాట్యం నేర్చుకోంటున్నారు! నా పిల్ల మాత్రం వాళ్లకు తీసిపోయింది ఏమిటి, అని చిట్టి కొంగ కు నాట్యం కూడ నేర్పించింది. ఇలా మూడు విద్యల్లో, తల్లి కొంగ, చిట్టి కొంగ ను తయారు చేసింది. ఏలాగైతే నేమి, ఎవరి పిల్లలు వారికి ముద్దు కదా! ఇలా వుంటుండగా చిట్టి “కొంగ రెండవ తరగతి చదువుకొంటుంది. చిట్టి కొంగ “ఒక రోజు న తల్లి తో సరస్సు కు పోయి ఒక మంచి తాజా గండిచేప ను వేటాడి తన నోటితో తన్నుకొని తెచ్చుకొని చెట్టు కొమ్మమీద కూచుని చేపను చిన్నగా నోరూరగా!తినడానికి పోతుండగా, అది ఒక నక్క చూసి దానికి నోరు ఊరింది. ఏమైన నక్క బుద్దులు గదా! చిట్టి కొంగను మోసం చేసి ఎలాగైనా ఆ తాజా చేపను కాజేదామను కుంది. చిట్టి కొంగ కూచుని ఉన్న చెట్టు దగ్గరికి చేరి చిట్టికొంగ ను చూసి “ఏం, పిల్లా నా చెల్లెల ముద్దుల కూతురా! బాగా చదువు కుంటున్నావా”?అని పలకరించింది. చిట్టి కొంగ చదవు లు నేర్చింది. కదా!అందుకే నక్క జిత్తులు దానికి తెలుసు పైగా పూర్వం ఒక నక్క ఒక కాకిని మోసం చేసి దాని నోట్లో వున్న మాంసం ముక్కను కాజేయడం. అనే కథని మొన్ను నే చిట్టికొంగకు రెండవ తరగతి లో వాళ్ళు మాస్టర్ చెప్పడం ఇంకా మర్చిపోలేదు, చిట్టికొంగ. అందుకే నక్క మోసం చిట్టి కొంగ కి తెలుసు నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చేస్తే తననోరు తెరవాలసి వస్తుంది కదా! అప్పుడు తాజాచేప జారి కింద పడిపోతుంది. దాన్ని కాస్త నక్క తాజా చేపను నోట్లో వేసుకుని పోతుంది. ఆ సంగతంతా చిట్టి కొంగ చదువు కొన్నది‌. కనుక ఆలోచించుకొని. నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఊ.. అని తల ఊపింది. నక్క తన ఎత్తు సాగలేదని. ఇంకా కొంచెం పెద్ద ఎత్తు వేదిమనుకుంది. “ఇదిగో! చిట్టి మరదలు, నువ్వు సంగీతంనేర్చుకున్నా వట,బాగా పాడగలవట నాకు సంగీతం అంటే చాలా ఇష్టం.ఒక్కపాట పాడు. చిట్టి మరదలా”అంది నక్క. పొగడ్త అంటే ఎవరికై నా చెవి కోసుకుంటారు కదా! నక్క పొగడ్త కు చిట్టి కొంగ కొంచెం ఉబ్బి పోయి ఇలా.. పాటపాడటం మొదలెటింది. సా.. రీ.. గమ..గమ.. అంటూ!
ఐయితే చదువు కున్న చిట్టి కొంగ చదువు నేర్చింది కదా! అందుకే తెలివిగా నోట్లో ఉన్న తాజాచేపను ముందుగానే తన కాళ్ళతో తొక్కి పట్టుకుని పాట పాడింది. నక్కకోరిక  పాపం ఈ సారీ కూడా నెరవేరలేదు. పై గా ఆపాట కు చిన్న గా చెవులు లను గట్టిగా మూసి పట్టుకుంది. తాజా చేపకొసం ఈ బాధంతా. చిట్టికొంగ ను మోసం చెయ్యడం ఎలాగా అని నక్క ఆలొచించి ఇంకాస్త పెద్ద యెత్తు వేదామని ఇలా అంది. “మరదలా, ఎంత బాగా పాటపాడేవే, ఆహా.. హో.. నా చెవుల తుప్పు వదిలిపోయిందే. కానీ ఇంక్కొక్క కోరిక కూడ తీర్చవా, ఆంటూ!నీకు నాట్యం కూడా వచ్చుగా చాలా బాగా నాట్యం చేస్తావట ఒక్కసారి నాట్యం చేయవు చూసి ఆనందిస్తాను. అని అడిగింది నక్క., ఈ మాటలు వినేటప్పటికి చిట్టి కొంగ ఉబ్బి , తబ్బిబ్బులై పోయింది. తన సంగీతాన్ని, నాట్యాన్ని మెచ్చుకొనే వాళ్ళు ఎవరూ లేరనుకుంటుంది. నక్కమామయ్య యింతగా మెచ్చు కుంటున్నాడు. నక్క మామయ్య సంతృప్తి పరచాలకున్నది. అయితే మరి తాజా చేపమాటో చదువు కున్న కొంగ కదా!  అందుకే ఆహారం విషయంలో అజాగ్రత్త పనికిరాదని తెలుసు. అందుకని బాగా ఆలోచించి కాళ్ల తో పట్టకున్న తాజాచేపను మళ్లీ నోట్లోపెట్టుకొని, నాట్యం చేసింది. తోమ్.. తోమ్..తడిగిథ … అంటూ! చిట్టి కొంగ నాట్యం చేస్తూవునంత సేపు నక్కకు ఒకటే ఆలోచన ఆ తాజా చేప ఏలా కాజేయాలా అని ఇంతకు దాని ఎత్తు పారనే  లేదు. చిట్టి కొంగ నాట్యం అయిన తరువాత నక్క ఆఖరి  ఎత్తు కూడా పారలేదని ఇలా అంది. “.మరదలా! ఆహా.. హో.. హో.. ఎంత మంచి పాటపాడావు. ఎంత బాగా నాట్యం చేశావు. నిజంగా ఇవ్వాళ నాకు శుభదినం అయితే ఇంక్కొక్క చిన్న కొరిక వుంది. ఆకాస్త తీర్చావంటే ఆపారమైన ఆనందంతో ఇంటికి వెళ్లి పోతాను. ఇవ్వాళ నేను పొందే తృప్తి కి ఇహ నాకు ఈ రోజు కి అన్నం కూడా అక్కర లేదు. అంత బాగా ఉంది. అయితే మరదపిల్లా నా కోరిక ఏమిటంటే, నీ ఆటా పాటా కలసి చూడాలని వుంది. పాటపాడుతూ నాట్యం చేయవు మరదలా! హాయిగా ఆనందిస్తాను.అని కొరింది జిత్తులమారి నక్క చిట్టి కొంగను. చిట్టి కొంగ నక్క మామయ్య పొగడ్త కు చెప్పలేనంత పొంగి పోయింది. కానీ పాట పాడుతూ నాట్యం చేస్తే తాజా చేపను ఏలా!ఎం చెయ్యాలి? అని కాసేపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. చదువు కొన్న కొంగపిల్ల కదా!మరీ.. వెంటనే ఓ నక్క మామయ్య అని ప్రేమగా ఇలా అంది.. చూడు మామ  పాడి, పాడి, నాట్యం చేసి, చేసి ఇప్పటికే అలసి పోయాను. ఇంకా పాట పాడుతూ నాట్యం చేయాలంటే వంట్లో బలం వుండాలి కదా మామా.. అందుచేత యీ తాజా చేపను కాస్త ప్రశాంతంగా తిని నీకోరిక తీరుస్తాలే నక్క మామయ్య వుండు. అంది చిట్టి కొంగ తెలివిగా! ఈ మాటలు వినేటప్పటీకి నక్క ఇక లాభం లేదనిపించింది. ఆ తాజాచేప కోసమే కదా ఇందాక నుండి కర్ణకఠోరమైన ఆ కొంగపిల్ల సంగీతము, నాట్యం విన్నది, చూసింది. ఇతసేపు భరించినది. అనుకొని. “పరవాలేదు లే చిట్టి మరదలు మళ్ళీ ఒకరోజు ఇంటికి వచ్చి భోజనం చేస్తూ చూస్తాలే. నీవు నిదానంగా తృప్తి గా తాజాచేపను మనసారా తినడం కానీ మనసులో కుళ్ళుకుంటూ.. నాలుక ఊరగా..దాచుకుంటూ మనకు ప్రాప్తిం లేదులే ఇది మనకన్నా జితులమారి లా ఉంది, చదువు కొంటే ఇన్ని తెలితేటలా, అని చిట్టి మరదలకు టాటా, బై,బై లు, చెప్పి బయలు దేరింది. కానీ చిట్టి కొంగ అంతటి తో వదులు తుంది? తాజా చేపనుగుటుక్కు, గుటుక్కున ముక్కు తో నోట్లో వేసుకుని మింగి వెళ్ళి పోతున్న నక్క మామయ్య ను పిలిచి సంగీతం పాడుతూ నాట్యం చేయసాగింది. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అని నక్క నిట్టూర్పులు విడిచింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!