స్వేచ్చ కావాలి

స్వేచ్చ కావాలి

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

పంజరంలో ఉన్న చిలుకకు
గదిలో భంధించిన పిల్లలకు
ప్రేమ పేరుతో బందీ అయ్యే మనసుకు
స్వేచ్చ కావాలి…. స్వేచ్చ ఇవ్వాలి

ఎదిగే మొక్కకు, స్వేచ్చ కావాలి
కంటికి పట్టే కునుకుకు కావాలి
మది నిండే ఆలోచనల సాగరానికి
స్వేచ్చ కావాలి..విశాల ప్రపంచంలో

వినీల ఆకాశంలో మేఘం కదలికలకు
పక్షులకు విహారిస్తున్న ఆ సుదూర పరిసరాలలో
నిన్ను నువ్వు మరచుటకు అనువుగా
ఆ అందాలలో విహారంలోనే స్వేచ్చ వెతికాను

గుండెల్లో భాదను బయల్పరచటానికి
పెదవులపై నవ్వును చిండించటానికి
కోపతాపాల అలజడిని విశదపరుచుటకు
నాకు ఎనలేని స్వేచ్చ కావాలి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!