హాస్య బ్రహ్మ

హాస్య బ్రహ్మ

రచన: జక్క.నాగమణి

నవరసాలలో హాస్యరసం ప్రాధాన్యము
హాస్య రసానికి స్థాయి భావము హాసము
నవ్వును పుట్టించేది హాస్యం
సృష్టిలో భాగము హాస్యము
హాస్యము అనగా నవ్వు

జీవనయానంలో….
శ్రమ ఒత్తిడి లో జీవించే మానవునికి…
అప్పుడప్పుడు హాస్యం అవసరం
లేకపోతే జీవితములో…..
నిరాశా నిస్పృహలు ఆవరించడముతో….
జీవితము అంధకార బంధము

సహృదయుడు….
ఆరోగ్యవంతుడు…..
సంస్కారం గలవాడు…
నాగరికత కలవాడు… గల
వ్యక్తిని నవ్వించేది హాస్యము

హఠాత్తుగా పుట్టిన ఊహ…
తలవని తలంపుగా జరిగే సంఘటనలు
కథలో భిన్నమైన ముగింపులు….
సంభాషణలలో…
సందర్భ శుద్ధి లేకపోవడం…
అతిశయోక్తి గా చెప్పేది హాస్యము

నవ్వించడం ఒక మహా యోగం
నవ్వలేక పోవడం మహా రోగం
ఆరోగ్యానికి పరమౌషధం
ఆనందబహిర రూపమే హాస్యము
నవ్వుకు కారణమైనది హాస్యము
ఆనందమే పరబ్రహ్మ స్వరూపం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!