వృధ్ధాప్యం!

వృధ్ధాప్యం!

రచన: ఎం.వి.చంద్రశేఖరరావు

వృధ్ధాప్యం మనిషిలో
చిత్రవిచిత్ర ప్రవృత్తిని తెచ్చి, అందరికీ దూరం చేస్తుంది!
అదిగో చూడండి ఆయన
కడిగిన చెయ్యినే, మళ్ళీమళ్ళీ కడుగుతున్నాడు,
వేసిన తాళ్ళాన్నే లాగి, లాగి వదులుతున్నాడు!
అదిగో ఆవిడను చూడండి, పెళ్ళై,
ఇన్నేళ్ళయినా పుచ్చు వంకాయలేనా,
కళ్ళులేవా,తెలివిలేదా,
అని భర్తను దులుపుతోంది,
పెళ్ళికి పుచ్చువంకాయలకీ
ఉన్న సంబంధము, ఆవిడకే తెలియాలి!
అన్నింటికన్నా హైలెట్, ఈయన!
ఆకాశంలో, విమానంలో,
ముఖ్యమంత్రి వెళ్తుంటే,
ఎవ్వరినీ మాట్లాడవద్దని,
కిందనుంచి సెల్యూట్ చేస్తున్నాడీయన!
పొద్థున్న లేచిన దగ్గరనుంచి, విసిగించి
చంపేస్తున్నడని భార్యలు,
వేధించి, సాధిస్తున్నారని
భర్తలు, ఇలా ఒకళ్ళమీద
ఇంకొకళ్ళు, రాజకీయ
నాయకులవలే, దుమ్మెత్తి
పోసుకోవటంతో కాలం గడిచిపోయే!
చుట్టాలు, పక్కాలు హడల్!
పరుగో, పరుగు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!