ఓ మంచి మనసా

ఓ మంచి మనసా

రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

ఓ మంచి మనసా నా వెంట వుంటావా;
ఆర్తుల కన్నీరు తుడవ నాతో వస్తావా:
సంఘ విద్రోహుల తరుమ ఆదిశక్తివవుతావా;

ఓ మంచి మనసా నా వెంట వుంటావా;
యువతకు పూబాట వేయ నాతో వస్తావా;
మానవతకు ప్రాణం పోయ సిద్దార్థుడవుతావా;

ఓ మంచి మనసా నా వెంట వుంటావా;
చిన్నారుల భవిత తీర్చిదిద్ద నాతో వస్తావా;
ఆడబిడ్డలపై అరాచకాలకు అణ్వస్త్రమవుతావా;

ఓ మంచి మనసా నా వెంట వుంటావా;
మరో ప్రపంచం సృష్టి చేయ నాతో వస్తావా;
మంచి కలలు కంటూ నీకోసం వేచిచూసేదా
….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!