తెలంగాణ పండగ

తెలంగాణ పండగ

రచన: సంజన కృతజ్ఞత

బతుకుతున్న పూలు తీసుకొచ్చి బతుకమ్మ బతుకమ్మ అంటే ఎలా బతుకుతాయి.
అవి చదువురాని, చదువుకున్న నిరక్షరాస్యులు
బతుకమ్మ పండుగ గురించి వ్యంగంగా
మాట్లాడుతున్నారు..
పూలు బతకడానికి కాదు మనం బ్రతకడానికి..
ఎన్నోరకాల పూలను తీసుకొచ్చి బతుకమ్మ పేర్చి
ఆడి,పాడి ఆ పూలను నీళ్ళలో నిమజ్జనం చేస్తారు.
ప్రతి ఒక్క పువ్వులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి.
ఆ ఔషధ గుణాలు నీటిని శుభ్రపరుస్తాయి.
ఆ నీటిని మనం
తాగడానికి, వ్యవసాయానికి, పశువులకు
వినియోగించడం వల్ల మనం బ్రతుకుతాం.
మన పెద్దలు మనకు ఇచ్చిన ప్రతి ఒక పండుగ
వెనుక ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా ఏదో ఒక
గొప్పతనం ఉండి ఉంటుంది.
అది తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
అంతే కానీ మన దేశ సంస్కృతి , సాంప్రదాయాలను తక్కువ చేసి మాట్లాడకండి.
బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులు తొమ్మిది తీరులు చేస్తారు.
ఈ బతుకమ్మ పండుగ అందరూ ఆడవాళ్ళు
కలిసి ఒకే దగ్గర కలిసిమెలిసి పూలను పేర్చి బతుకమ్మ
తయారు చేస్తారు.

మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ ,రెండో రోజు అటుకుల బతుకమ్మ ,

మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ ,

ఐదో రోజు అట్ల బతుకమ్మ ,ఆరో రోజు అలిగిన బతుకమ్మ ,

ఏడో రోజు వేపకాయ బతుకమ్మ ,ఎనిమిదో రోజు వెన్న ముద్ద బతుకమ్మ ,

తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ.

తెలంగాణ నది తోటలో తారాడె ఎన్నో
పూల ధారలు
అన్ని రంగుల రంగవల్లికలవోలె
అన్ని తలుకుల రాగమాలికలవోలె
అన్ని చమక్కుల చంద్రవంకలవోలె
ఎన్ని అందాలో… మన కంటి అందుబాటులో
అన్ని అందాలి మన ఇంటి గౌరమ్మ వడినిండా…
పోయిరా… బతుకమ్మ
మళ్ళొచ్చే ఏడు మళ్లీ రావమ్మా…
మా ఇంటి గౌరమ్మ
**************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!