ఈ మరణానికి కారణం ఎవరు

ఈ మరణానికి కారణం ఎవరు

రచయిత: అయితగాని జనార్దన్

నా సంతోషానికి…
నా బాధకు…
నా మరణానికి…
ఎవరూ బాధ్యులు కారు…
నాకు నేనే బాధ్యున్ని…
అవును…!
జాబిలిని చూసి జడుసుకొని
చీకటిని చూసి గెంతులేయాల్సింది…
తప్పు నాదే…
ఇప్పుడు చీకటికి చివాట్లు ఎందుకు…

అవును తీపిని తిట్టుకొని
చేదును చప్పరించాల్సింది..
తప్పు నాదే..
చేదును చీదరించుకున్న చేతగాని తనం…

నవ్వును రువ్వి…
దుఃఖాన్ని ప్రేమించాల్సింది..
కన్నీళ్ల కావళ్లు మొయ్యాల్సింది
తప్పు నాదే…
చిరునవ్వులు చిటారు కొమ్మన ఊహించా…

ఎందుకో ..!
మరణాన్ని ప్రేమిస్తే…
ఈరోజు ఇంత దుఃఖం ఉండేదా..
తప్పు నాదే…
నాది కాని జీవితాన్ని ప్రేమించా..
నాకు సంబందించని మనుషులను ఇష్టపడ్డా..
అసలు నాకు సంబంధం లేని లోకంలో జీవించా..
తప్పు నాదే…
నీతులనే బూతులు వల్లించి..
నిజాయితీకి అద్దం కట్టించి
నేనెంత తప్పు చేశానో…
స్వార్థమే అర్థమైన లోకంలో
కన్నీటి చెలిమెను తోడి…
కరువైన కరుణకి ఏడ్చి
నేనెంత తప్పు చేశాను..
చేసిన తప్పే చేసి చేసి
నేనెంత తప్పు చేశాను..
అందుకే…!
ఇంకిపోయిన నా కన్నీటికి
ఎవరూ కారణం కాదు…
ఆగిపోతున్న శ్వాసలకు..
ఎవరూ కారణం కాదు..
ఉదయాస్తామయాలే శాశ్వతం కాదు…
ఏదోరోజు బ్లాక్ హోల్ బాధితులే..
మీరు మేలుకోండి…
నేను నిద్రిస్తాను…
శుభరాత్రి….

You May Also Like

One thought on “ఈ మరణానికి కారణం ఎవరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!