విలువలు, భాద్యతలు

(అంశం :: మనసులు దాటని ప్రేమ)

విలువలు, భాద్యతలు

రచయిత:: పావని చిలువేరు

కొన్ని సంవత్సరాల కిందట అది ఒక మంచి స్నేహ బంధం ఉన్న బృందావన వీధి అప్పట్లో కొన్ని కుటుంబాలు మాత్రమే ఉండేవి.సాయంకాలం కాగానే ఆరు బయట ఆడుకోవడం , నవ్వుకోవడంలాంటి యెన్నో మధురానుభవాలతో అల్లుకొన్న జీవితాలు అవి.రాను రాను మనుషులు పెరగడంతో పాటు ఈర్ష్య ద్వేషాలు కూడా పెరిగాయి. మనుషుల మధ్య దూరం బాగా పెరిగింది. ఆ వీధిలో యెన్నో బాద్యతలతో, విలువలతో  పెరిగిన ఒక కుర్రాడు వినయ్, అలకలు, ప్రేమలు,ఆప్యాయతలు అన్నీ కలిసిన  ఆనందనిలయమే వినయ్ కుటుంబము. ఆ వీధి మూల మీద ఉన్న యింటి లో  ఉన్న అమ్మాయి పేరు దివ్య, తనతో చిన్నప్పుడు నుంచి ఆడుకుంటూ  పెరిగాడు వినయ్, మెల్లెగా తనకి తెలియకుండానే ఆమెను యిష్టపడడం మొదలుపెట్టాడు .

తన వాలు జడ, సంపెంగ లాంటి కళ్ళు , చిలక ముక్కు అంటే  వినయ్ కి చాలా యిష్టo,  తన చెల్లిని కూడా వాలు జడ పెంచుకోమని యెప్పుడూ చెప్తునే ఉండేవాడు.అలా చిన్నప్పటి తన బాల్య స్నేహితురాలికి  మదిలో గుడికట్టాడు వినయ్. మెల్లి గా వాళ్ళకి వయసు పెరగడం ,కుటుంబాల మధ్య  ఆర్ధికస్థోమత లో వ్యత్యాసం ఉండడం ,తన మనుసు లోని మాట చెప్పలేక, చేసేది యేమీలేక మనసులోనే  మౌనంగా ఆరాదించేవాడు. ముందు రెండు కుటుంబాలు బాగానే ఉండేవి.

యెప్పుడయితే  ఆ వీధి లో కొంతమంది ఆడవాళ్లు యింట్లోనే చీరలు అమ్మడం మొదలు పెట్టారో, అలాగే సరదా కోసం పెట్టుకున్న కిట్టి పార్టీలతో మొదలైంది మనుషుల మధ్య బేధాభిప్రాయాలు . ప్రతి రోజూ వీధి లోని కొంతమంది ఆడవాళ్లు యింట్లో పని  అవ్వగానే చీరలు అమ్మో వాళ్ల యింటికి వెళ్లి , చీరలు కొనని  వాల్లని, కొనడానికి రాని వాళ్ళని విమర్శించడమే పనిగా పెట్టుకునేవారు.
మరి కొన్న చీరలు అందరికీ చూపించాలి కదా అనే ఆలోచన నుంచి వచ్చిందే ఈ కిట్టి పార్టీ . కాలక్షేపం కోసం కొంత మంది ఆడవాళ్లు  అంత కలిసి నెలకి కొన్ని  డబ్బులు వేసుకొని  నెల మొదటి వారంలో ఒక్క రోజు కిట్టి పార్టీ పెట్టుకునే వారు. ఆ రోజూ పార్టీ కోసం  వచ్చిన వాళ్ళకి గొప్పలు  చూపించాలని నెల అంతా యేదో ఒకటి కొంటూ, డబ్బులు ఖర్చు చేస్తు ఉండేవాల్లు .
అయితే వినయ్ అమ్మ సరోజ వాళ్లతో కలిసేది కాదు . అందువల్ల వీధిలో కొంతమంది సరోజ బాగా పిసినారి అని, డబ్బులు ఖర్చు పెట్టదని అనుకునే వాళ్లు.

కాని భాద్యతలతో  కూరుకుపోయినా వినయ్ అమ్మ  సరోజకి సమయం ఉండేది కాదు  పైగా యిలాంటివి నచ్చేది కాదు, డబ్బులు ఉంటే పిల్లలకి కావాల్సినవి తీసుకోవచ్చు అని
భర్త కి చేదోడు వాదోడు గా మిషన్ కూడుతూ వచ్చిన డబ్బులతో సంతోషంగా ఉండేవారు .

అలాంటి  భాద్యత కలిగిన కుటుంబంలో పెరిగిన వినయ్ రోజు రోజుకి దివ్యని  మనసు లోనే అమితంగా ఆరాదించేవాడు .సమయం దొరికితే చాలు దివ్య కనిపిస్తోందేమొ అని యింటి బయటకు పరుగున వెళ్లి చూసే వాడు వినయ్.

తన కలల రాజకుమారి దివ్య లో కూడా అమ్మలో ఉన్న  ఆప్యాయత కనిపించేది . తన చెల్లికి, తమ్ముడికి  రక్షణ కవచం అవుతుంది అనిపించేది. కాని యేల చెప్పలో  అర్దం అయ్యేది కాదు. యేళ్ళు గడిచి పోతున్నాయి, చదువులు పూర్తి అయ్యాయి.
ఒకరోజు దివ్య కి యింట్లో వాళ్లు సంబందాలు చూస్తున్నారని సరోజ దగ్గర బ్లౌజ్ కుట్టించుకునే రూప అనే ఆవిడ చెప్పింది.

అయితే వినయ్ అమ్మ  మాత్రం చాలా సంతోషపడింది , ఓ అలాగా ఆ అమ్మాయి చాలా మంచిది నేను యెప్పుడూ కనిపించిన, యేల ఉన్నారు ఆంటీ అని పలకరింస్తుoది అంది సరోజ.
పెళ్లి చేసుకుని గంపెడు పిల్ల పాపలతో చల్లగా ఉండాలని దీవెన కూడా పెట్టింది .
అది చూసి, విని తట్టుకోలేక పరుగున వెళ్లి  తన మనుసులోని ప్రేమని చెప్పాలనుకున్నాడు వినయ్. కాని అక్కడ వారి స్థోమత, తన భాద్యత అడ్డుపడుతోంది,
వినయ్ కి పెళ్ళి చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. చాలా బాధ్యతలు ఉన్నాయి చెల్లి పెళ్ళి నాన్నకి చేదోడువాదోడు ఉండాలని ,తమ్ముడికి మంచి చదువు అందించాలని వినయ్ కోరిక  అలాగే తల్లిదండ్రులకి అండగా ఉండాలన్న తపన వినయ్ ది. అవును ప్రేమ గొప్పదే కాని కుటుంబం అంటే సంతోషం కదా.

కొసిరి కొసిరి వడ్డించే అమ్మ ప్రేమ ముందు బయట పడని వినయ్ ప్రేమ వెలవెల పోయింది. ఆ మధుర జ్ఞాపకాలని మదిలోనే  యెంత కాలం అయినా భద్రంగా దాచుకొంట అనుకున్నాడు వినయ్.

కాని అతని వల్ల కావడం లేదు,
నాకూ నీతో  బతకాలని  ఉంది  దివ్య, నా మూగ ప్రేమ గురించి కొద్దిగా నీకు తెలుసు కదా  కాని యేమీ చేయలేక పోతున్నా అని తనలో తానే కుమిలి పోయాడు.

బాధ్యతలు మోస్తు భుజాలు వంగిన నాన్న కి తన భుజం ఆసరా యిచ్చి అండగా నిలబడతా అనుకున్న  వినయ్
తన మది దాటని ప్రేమ కి మనసు లోనే  గుడి కట్టాడు .

యెప్పుడూ ప్రేమించడమే తెలిసిన అమ్మ కి చెప్తే  ఒప్పుకుంటూదేమొ అని చిన్న ఆశ ఉండేది వినయ్ కి ,కాని  తన బాధ్యత ఆపుతుంది . పరి పరి విధాలుగా తపిస్తున్న మదిలోని  ఆలోచనలతో అతలాకుతలం అవుతున్నాడు.

భగ్న ప్రేమికులు ఒకే వీధిలో ఉండడం అంటే యెంత  కష్టం, పెళ్లి అయిన తరువాత దివ్య కి యేల యెదురు పడాలి,  నా మొహం యేల చూపించాలి, మరి నా బాద్యతలు  తీరాక  దివ్య ని వొదులుకున్నాను  అనిపిస్తుందా అని యెన్నో ప్రశ్నలు.  మరి దివ్య కి కూడా తెలుసు కదా నేను మౌనం గా ప్రేమింస్తున్నాను అని తను యెందుకు చెప్పలేదు అని యెన్నో ఆలోచనలతో
ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు వినయ్.

కాని కుటుంబ సంతోషం, భాద్యత  యొక్క విలువలు తెలిసిన మనిషి కనుక మనసులు దాటని ప్రేమ ని మనసులోనే శిధిలపరిచి , భాద్యత ని చేతపట్టి  చెల్లి కి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు,  తమ్ముడుకి కూడా జీవితం లో స్థిర  పడడానికి వ్యాపారం లో డబ్బు సాయం చేశాడు.
తరువాత తల్లిదండ్రులు చూసిన మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు .

అప్పుడు అర్ధమైoది వినయ్ కి  తన జీవితాన్ని పంచుకున్న అమ్మాయి లో కూడా అమ్మలో ఉన్న  ఆప్యాయత ఉంది అలాగే తన చెల్లికి, తమ్ముడికి  రక్షణ కవచం అయ్యింది అని.
తన మది దాటని ప్రేమని అంతటితో సమాధి చేసి,  తన భార్య కి మనసు లోనే  గుడి  కట్టి  ఆరాదించడం మొదలుపెట్టాడు వినయ్.

***

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!