మనసు విహార విహంగము

(అంశం:: మనసులు దాటని ప్రేమ)

మనసు విహార విహంగము

రచయిత:: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయాన్ని చూస్తూ చిత్రం వేస్తున్న హారిక ఒకసారి ప్రక్కకు చూసింది. ప్రక్క డాబా మీద తననే తదేకంగా చూస్తున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపడింది .

ప్రక్క ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకుంటాను. వాళ్ళు ఈ ప్రాంతం వారిలా లేరు ఆవిడకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు కుటుంబపుపోషణ అంతా అమెచూసుకుంటుంది

భర్త ఎక్కడో సౌదీ లో ఉన్నాడు జీవితం అంటే చదువుకుని ఉద్యోగం చేస్తూ పెళ్లి పిల్లలు . వాళ్ల ను పోషించి దానికి తండ్రి తల్లి పాటుపడి వారిని ఒక తరహా జీవితం ఇవ్వడము ఇది మనిషి చరిత్ర ఎవరిదైనా ఇంతే కదా.

హారిక కాస్సేపు అటు చూసి తన చిత్ర లేఖనంలో మునిగి పోయింది అది ఒక పోటీకి వేసే చిత్రం. అందులో పల్లె ప్రకృతి చిత్రించింది.బొమ్మలకు చీరలు నగలు ఎంతో బాగా అలంకరించి ఉన్నది.
శ్రీ రామ్ ఆ యింటి పెద్ద కొడుకు.తల్లిని చెల్లెళ్ళ ను పని చెయ్యనియ్యకుండా తల్లికి పచ్చడి తొక్కి పప్పులు కడిగి ఇంటి పనులు చేసేవాడు.

హరికను చూసి మురిసే పోయెవాడు.ఎంత అందంగా పుట్టించాడు దేముడు.ఆస్తి అంతస్తు అందం విద్య మంచి గుణం అన్ని ఉన్నాయి అని అమ్మ భారతి చెప్పగా విన్నాడు.

వాళ్ళు ఇంట్లో బొమ్మల కొలువు పేరంటం అయింది. అప్పుడు బొమ్మలు కూడా చాలా వరకు హారిక అలంకరించి తయారు చేసినవే అందులో పెద్ద తిరుపతి చిన్న తిరుపతి శ్రీశైలం
శ్రీకాళహస్తి ,అన్నవరం, విజయవాడ పుణ్య క్షేత్రాలు లో కొన్నబొమ్మలు ఎక్కువ ఉన్నాయి అందంగా అలంకరించి పెట్టారు.

హారిక అమ్మమ్మ ఎంతో చక్కగా మాట్లా డింధి ఊరికి కొత్తగా వచ్చారు ఏమైనా కావాలంటే అడగండి తెలిసినదే అయితే సహాయం చేస్తాము అని చెప్పింది.
ఆమాట చాలండి ముగ్గురు మగపిల్లలు బయటి పనులు చేస్తారు అని చెప్పింది .అయినా అవసరం ఉంటే అడుగుతాను అన్నది. ధన్యవాదాలు చెప్పి వచ్చేసింది .ఆ విషయం కొడుకులకి చెప్పింది .
హారికకు వాళ్ళ స్టేటస్ కి తగిన సంబంధం కెనడాలో ఇంజనీర్ కి చేశారు అతను పెద్ద చదువు చదివి యూనివర్సిటీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు హారిక విదేశాలలో తన కళను మరింత పెంచుకున్నది. ఆ తరువాత మీడియాలో అమె చాలా ఛానెల్స్ ద్వారా తన పురోగతి గురించి చెప్పింది అవార్డ్స్ అమె సొంతం ఈ మధ్య కళాప్రపూర్ణ కూడా వచ్చింది

తను హారిక ను ప్రేమిమచాడా..? ఇష్ట పడ్డాడా..? ఆకర్షింప బడ్డాడా..? ఏది ఏమైనా విధి రాత వేరే ఉంది తన తండ్రి ఆర్థిక స్థితి వల్ల తాను చిన్న తనంలో ఇంటి బాధ్యత వల్ల ఎక్కువ చదవలేక పోయాడు కానీ బ్యాంక్ టెస్ట్ లు రాసి మంచి ఉద్యోగం సంపాదించి మేనేజర్ అయ్యాడు. అలా అది ఒక్కటే కాదు ఆర్థిక పరిస్థితి వల్ల తన అభిమానము కానీ ప్రేమ గాని ఆరాధనగా మిగిలి పోయింది. మనిషికి ఉన్నతి ఒక్క మంచితనం వల్ల కాదు తగిన ఆర్థిక పరిస్థితి కూడా కావాలి.
సౌదీ నుంచి డబ్బు తెచ్చి ఆడపిల్లల పెళ్లిళ్లు చేశారు. శ్రీ రామ్ కి కూడా మంచి డబ్బున్న పిల్ల వచ్చింది కాని ఆమె హారిక అంతా చలాకి కాదు కళాకారిణి కాదు .డబ్బు హోదా దర్పం ఉంది. రమ్య డిగ్రీ చదివిన గొప్ప కబుర్లు చెబుతూ ఉంటుంది అది శ్రీ రామ్ కి నచ్చదు. మధ్యలో ఎంత ఎదిగితే ఏమిటి ? హారిక పెళ్లి నాటికి స్తోమత లేదు అడిగి లేదనిపించుకోవడం మంచిది కాదు.

ఆతరువాత తండ్రి డబ్బు ఘనంగా తెచ్చి ఇల్లు కొని చెల్లెళ్ళ పెళ్లిళ్లు చేశాడు ఈ రోజుల్లో ఎవరూ భాద్యతలున్న కుటుంబాల్లో పెళ్లిల్లు చెయ్యరు. సరి కదా ఇంట్లో ఇద్దరు పెళ్లి కానీ పిల్లలుంటే అసలు చెయ్యరు.
హారిక లక్ష్మి పుత్రురాలు సామాన్యుల కెందుకు ఇస్తారు .మంచితనం పై కి కనిపించదు. స్థితి మాత్రం కనిపిస్తుంది అందుకే హారిక పెళ్లి వాళ్ళ కన్న స్థితి మంతులతో అయింది.
వాళ్ళు మొదటి నుంచి బాగా విద్యావంతుడిక చేస్తాము మా పిల్ల నాలుగు పిజి లు చేసింది అని చెప్పేవారు .ఆ ప్రకారం పెళ్లి చేశారు మనసు కి ఇవి పట్టవు మనసు విహార విహంగము చేస్తుంది

మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళలేడు.వెళ్ళకూడదు కూడా అందుకే శ్రీ రామ్ తన ప్రేమ అభిమానము ఆకర్షణ ఎది అయినా మనసులో పదిలంగా పొందుపరచిన ఘనుడు ఆదర్శమూర్తి హారిక ను మంచి మిత్రురాలిగా జ్ఞాపకం” పెట్టుకున్నాడు.

ప్రపంచం ఎంత మారినా మల్లె పందిరిల మనిషి చుట్టూ అల్లుకు పోయింది.సంస్కృతి సంప్రదాయం ఆర్థిక బంధాలు పెద్దల అనుమతులు ,ఎన్ని కాలాలు మారినా కొన్ని కుటుంబాల్లో పెద్దల ఇష్టం పైనే ఉన్నది అందుకే శ్రీ రామ్ మనసులో తన ప్రేమ కంటే కుటుంబ ఎదుగుదలకు ముఖ్యముగా విలువనిచ్చాడు.
ఎన్ని తరాలు మారినా యుగాలు మారినా కుటుంబ ఉన్నతి కోరే వ్యక్తి గా శ్రీ రామ్ కుటుంబ మును ఆదుకున్నాడు. మనిషి విహార విహంగము ప్రతి మనిషికి తప్పదు కానీ తేనెటీగలు మాదిరి ఆలోచనలు తప్పవు “హారిక ఎక్కడ ఉన్నా బాగుండాలి”. ఇది శ్రీ రామ్ కుటుంబ దీవెనలు మా కుటుంబ స్నేహితురాలు అని గర్వంగా చెప్పుకుంటారు.
సర్వేజనా సుఖినోభవంతు శాంతి శుభం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!