నీవే…! నీవే…! నాకన్నీ నీవే…!!!
రచన: నాగ రమేష్ మట్టపర్తి
భాషను నేనయితే…
పలికించే భావానివి నీవే…..
పదాలు నేనైతే…
పాడే పాటవి నీవే…..
కలం నేనయితే…
రాసే కవితవి నీవే…..
కుంచెను నేనైతే…
గీసే చిత్రానివి నీవే…..
హృదయాన్ని నేనైతే…
దాని స్పందనవి నీవే…..
కనులు నేనైతే…
కనిపించే దృశ్యానివి నీవే…..
వీనులు నేనైతే…
వినిపించే గానానివి నీవే…..
కొలనును నేనైతే…
విరిసిన కలువవు నీవే…..
పువ్వును నేనైతే…
దాని పరిమళానివి నీవే…..
బాధను నేనైతే…
ఓదార్పువి నీవే…..
ఆటను నేనయితే…
సాధించే గెలుపువి నీవే…..
నావను నేనైతే…
నడిపించే చుక్కానివి నీవే…..
గమనాన్ని నేనైతే…
చేరుకునే గమ్యానివి నీవే…..
Wow beautiful 🥰🥰