మనసు విప్పి మాట్లాడు

మనసు విప్పి మాట్లాడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సుజాత కోకిల

ఓ బంధమా నాపై ఎందుకంత అలుసు
ఒక్కసారి చెప్పవే నేనేమి ద్రోహం చేశానని
నాపై అంత చులకన భావం ఎందుకు
నేను నేనుగా ఎదిగాను నా కష్టాన్ని నేను నమ్ముకున్న
నా ఆత్మాభిమానం నన్ను ముందుకు నడిపించింది
ఒకరిని చూసి ఈర్ష్యపడే స్వభావం మంచిది కాదు
ఓ మనిషిగా పుట్టడమే తప్ప మనిషిగా ఎదగడం తప్ప నాకేం అర్థం కాకుండా ఉంది ఓ బంధమా
ఏంటి ఈ సమాజం ఏడుస్తుంటే నవ్వుతుంది
బాగుంటే కుళ్లు కుంటుంది సమాజం
ప్రతి మనిషిలోను కొన్ని కలలు ఉంటాయి
కొందరికి కలలు నిజమవుతాయి కొందరికి
కలలుగానే మిగిలిపోతాయి నా కల నిజమైంది
నా సంతోషం అందరితో పంచుకున్నాను
ఆ ధైర్యమే నన్ను ముందుకు నడిపించింది
సంకల్పబలం తోడై ఆశలు చిగురిస్తాయి
ఎదగడం నేర్చుకున్నాను  నలుగురితో ఉండాలనుకున్నాను
ఆ నలుగురే నన్ను ఎదిగేలా చేసారు ఇంతకన్నా మనిషికి ఇంకేం కావాలి
ఓ బంధమా ఎదగడం నేర్చుకో ఎదిగేవారిని ప్రోత్సహించు ఇంత కన్నా ఎవరు ఏమి కోరుకోరు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!