ఏదో గడిచింది 

 కథ అంశం: బంధాల మధ్య ప్రేమ-2080

ఏదో గడిచింది 
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల

పెందలాడే ఇంటిముందు పెడనీళ్లతో కళ్ళాపుచల్లి ముగ్గులు పెట్టింది. లచ్చవ్వ వాకిలంతా కళకళలాడుతోంది. సోమిదేవమ్మ పూజచేస్తున్నట్టుగా గంట వినపడుతోంది. పెందలాడే సూర్యోదయం కాకముందే లిెేచి తన పూజా కార్యక్రమానికి అన్నీ సిద్ధం చేసుకుని రోజూ ఇదే టైంలో చేస్తుంది. ఈ బ్రహ్మ ముహూర్తంలో పూజా కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది ఆచార వ్యవహారాలు చాలా  ఎక్కువ పాటిస్తారు. తన భర్త సోమయాజులవారికి పూజకు కావలసిన అన్ని రెడీ చేసి పిలుస్తుంది.
భర్త అంటే చాలా గౌరవం ప్రేమ దేవి పూజకు అన్నీ సిద్ధం చెేశావా అంటూ లోనీకి వచ్చారు. సోమయాజుల వారు రెడీ చేస్తున్నానoడీ ? అప్పుడే  ఎందుకొచ్చారు నేను పిలుస్తాను గా ఎంతసేపు అలా నిలబడతారు అంది సోమిదేవమ్మ  ఏం ఫరవాలేదులే హాసనo వేసుకుని  కూర్చుంటానులెే హైరానా పడకు అన్నారు. నవ్వుతూ అదేం లేదండి ఈరోజు  లచ్చవ్వ  దేవుని పాత్రలు త్వరగా కడగలేదండీ అందుకే ఆలస్యమైంది. అంటూ నొచ్చుకుంటూ అoది. ఎoదుకే అoత వివరణ ఇప్పుడు నేనేమన్నానని తొందరేం లేదు కానీవ్వు అన్నాడు. కడిగి తుడిచి బోర్లిఇస్తే కానీ తను నీళ్లుజల్లి తీసుకోదాయే తనకు మడీ ఆచారం ఎక్కువ తడితో ఉంటే ముట్టదు. దావోలి కట్టుకొని ఆసనము మీద కూర్చుని  రెడీగా ఉన్నారు.
సోమయాజులవారు, సంధ్యావందనం పారాయణo  చెయ్యనిదెే మంచి నీళ్ళయినా ముట్టరు. పూజా కార్యక్రమం అయ్యాక గానీ కాఫీ తాగరు. ఇంక చేసుకోండంటూ తనముందు బోర్లించిoది పూజా బోల్లు సోమయాజుల వారు సోమిదేవమ్మతో తప్ప ఎవరితోను భోజనం చెయ్యరు మడి కట్టుకుని కట్టెల పొయ్యి మీద వండిన వoటనే  సోమయాజులవారు  మడి పంచకట్టుకునెే భోజనం చేస్తారు.ఇవెే వారి నిత్యకృత్యాలు.
అమ్మ గారు అంటూ  లచ్చవ్వ పిలిచింది. ఆ వస్తున్నాను అంటూ బయటకొచ్చింది. ఏంటి లచ్చవ్వ చెప్పు లోపల చాలా పని ఉంది  అమ్మ గారు పనిఅయిపోయిందమ్మ చలిబువ్వ ఉoటే పెడతారని పిలిచాను మడీతో ఉన్నానెే ఎలా పెట్టేది చిన్న అమ్మగార్ని పిలవండి అమ్మ “గౌరీ దూరం ఉందెే  కొద్దిగా ఆగు నేనే వచ్చిస్తాను. అoది అట్టాగే అమ్మ మయిల పడి అన్నంపెట్టి పంపించింది. మళ్ళా మడి కట్టుకొని నిత్యాగ్నిహోత్రం ముట్టిచ్చింది. అగ్నిహోత్ర పూజ లేనిదే పనికిరాదు. పీరియడ్ వస్తే మూడు రోజులు బయటికి రారు మడీతో ఉంటే వాళ్లని చూడకుడా చూడరు వాళ్లకు అంత ఆచారం. సోమయాజుల వారు అనుష్టానం చేసుకొని బయటకు వచ్చి హాల్లో ఈజీ చైర్లో కూర్చున్నారు. సోమిదేవమ్మ పిల్చేదాకా అలాగే మడితో కూర్చుంటారు.ఇంటి ముందు ఎవరైనా వస్తే వాళ్లతో మాట్లాడుతుంటారు సోమిదేవమ్మకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఒక అబ్బాయి ఘనాపాటి ఇంకో అబ్బాయ్ ఇంగ్లీషు చదివే చదువుతున్నాడు అమ్మాయి. గ్రాడ్యుయేషన్ చదివాక చదువు మానిపించారు. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని వాళ్ల ఆలోచనా పూజా కార్యక్రమం ముగించుకుని పిచ్చయ్య శాస్త్రిగారు వచ్చారు పూజా కార్యక్రమం అయిందంటూ పలకరించారు తండ్రి ! అయిపోయింది నాన్నగారు పెరటి వైపు వెళ్ళి స్నానంచేసి లోనికిరా అన్నారు అలాగే నాన్నగారు.
అంతలో సోమిదేవమ్మ  వంట కామించి భోజనానికి రండి అంటూ పిలిచింది. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. భోజనం చేస్తుండగానే పరంధామయ్యగారు వచ్చారు సోమిదేవమ్మ తమ్ముడు పరంధామయ్య బావగారు అంత కుశలమేనా అంటూ పలకరించారు. ఆ బావున్నాం  పరంధామ్ మడికట్టుకో భోజనం చేద్దూగానీ టైమ్ కు వచ్చావు  అలాగే బావగారు అంటూ మడి కట్టుకుని కూర్చున్నారు. ముగ్గురికి వడ్డన చేసింది.
పిచ్చాపాటీ మాట్లాడుతూ నీ మేనకోడలికి సంబంధాలు చూడవా  అన్నారు ఎందుకు చూడను బావగారు. అన్ని శాస్త్రాలు ఆపోసనo పట్టిన ఘనాపాటి  ఉన్నారు మరి అమ్మాయి ఏమంటుందో బావగారు? ఇంకేంటి  మంచి సంబంధమే గా  భేషుగ్గా ఉంటుంది బావగారు. గౌరి ఎమో ఇంగ్లీష్ చదువు చదువుకుంది.  ఈ సంబంధం ఇష్టపడుతోందో లేదో బావగారు అన్నాడు. ఏమంటావ్ దేవి  నేనేమంటనండీ గౌరీని ఓ  మాట అడుగుదాం సరె నీ మాట నేనెందుకు కాదంటాను. అట్లాగే కానీ గౌరి ఇంట్లోకి వచ్చిన తరవాత అడిగింది సోమిదేవమ్మ   నీకు సంబంధం చూశాం తల్లి ఏమంటావు. ఈ సంబంధం నీకిష్టమేనా అంటూ తల్లి సోమిదేవమ్మా అడిగింది. అమ్మ మీకిష్టమైతే నాకిష్టమే నాకేం అభ్యంతరం లేదని చెప్పింది. ఆ రోజులలో తల్లిదండ్రుల మీద చాలా నమ్మకం ఎదురు చెప్పేవారు కాదు ఎవర్ని తెచ్చి చూపించినా వారినే చేసుకునేవారు తల్లిదండ్రుల మాట కాదనే వారు కాదు. తల్లిదండ్రులు చూసిన సంబంధాన్నెే చేసుకునేవారు. వాళ్లకు ఒక అభిప్రాయమంటూ ఉండేది కాదు. తల్లిదండ్రులు ఏం చెప్తే అదే వినేవారు. పిల్లవాణ్ణి కూడా పెళ్ళిలోనే చూసేవారు పెళ్లిచూపులంటూ ఉండేవి కావు ఆ రోజులు అలా గడిచాయి.
పెద్దల మాట విని రంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది గౌరమ్మ వాళ్ల దాంపత్యం మూడుపువ్వులు ఆరుకాయలుగా ఆనందంగా ఉన్నారు. ఈ రోజులలో పిల్లలు అలా కాదు  తల్లిదండ్రుల మాట వినరు వాళ్లకు నచ్చాలి  ఒకర్నొకరు చూసుకుని ఒకర్నొకరు మాట్లాడుకొని ఇద్దరికి కిష్టమైతేనే ముందుకు వస్తారు. అయినా సరిగ్గా ఉoటున్నారు అనుకుంటే అది కూడా లేదు ఏవేవో గొడవలు పడుతూ విడాకుల దాకా వస్తున్నారు. అప్పటి వాళ్లందరూ సుఖంగా లెేరా   ఉన్నారు. ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. ఎవ్వరి అభిప్రాయం వాళ్లకు తగ్గట్టుగా అభిప్రాయాలను మార్చుకుంటూ పెళ్లి చేసుకుని ఒక్క పిల్లనొ ఒక పిల్లవాడినొ కనీ ఎవరికి వారే విడిపోతున్నారు. నిజమే సుమా అప్పటి రోజుల్లోనే  చాలా బావుండేదండీ అప్పటి పిల్లలకి  తల్లిదండ్రులపై. భరోసా ఉండేది. భయభక్తులతో వారి దారిలోనే  నడుచుకునేవారు. అందుకే అంటారండీ పెద్దలు! గడిచిన కాలమంతా మంచిదేనని ఇంకా ముందు ముందు ఇంకెలా ఉంటుందో చూడాలండి ఇప్పుడు బంధాలు లెేవు బంధుత్వాలు లేవు. ఇప్పుడు ఇలా ఉందంటే రెండువేలఎనభై లో ఇంకా  ఎలా ఉంటుందోనని అని ఊహిస్తేనే చాలా భయంగా ఉంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!