అనుబంధాలా అవి ఎక్కడ?

కథ అంశం: బంధాలు అనుబంధాలు-2080

అనుబంధాలా అవి ఎక్కడ?
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

ఒరే చేనులు ఇలారారా అంటు పూజగదిలోంచి బామ్మ సీతమ్మ పౌత్రుణ్ణి పిలిచి ఎల్లుండి సీతత్త, కూతురు పాపాయి తో రైలు లో పిఠాపురం నుంచి వస్తోందిరా ఇప్పుడే పోస్టుమాన్ ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు అని స్కూలు నుంచి అప్పుడే వచ్చిన మనుమడితో చెప్పింది. బండి ఐదు గంటకే పొద్దున్నే వస్తున్నాది అనగానే సంతోషంతో అలాగే బామ్మ అన్నాడు. సీతమ్మ గారికి పద్మ,భూషణం ఇద్దరు పిల్లలు. భర్త సుబ్బయ్య విశాఖపట్నం లో కలెక్టర్ ఆఫిస్ లో గుమస్తాగా పనిచేసినా దొండపర్తి లో నాలుగు ఇళ్ళ వాకిలి లంకంత కొంప ఉండేది. గాంధీ భావాలు కలిగిన వ్యక్తి .తెన్నేటి విశ్వనాధం పంతులు గారి శిష్యులు. వచ్చీపోయే ఇల్లు. పిల్లలికి పెళ్ళిళ్ళు చేసి రిటైర్ అయిన వెంటనే స్వర్గస్థులయ్యారు. తరువాత కొడుకు భూషణం, కోడలు నెలతేడాలో కలరా జబ్బుతో దివంగతులయ్యారు. పౌత్రుడు చేనులు ని పెట్టుకుని సీతమ్మ విశాఖలోనే డిగ్రీ చదువు మరియు టీచర్ ట్రైనింగ్ చెప్పించారు. మున్సిపాలిటీ పాఠశాల లో టీచర్ గా పనిచేస్తున్న అతని పెళ్ళికి పద్మత్త ముత్తైదువు గా నెలరోజులు ముందే కూతుర్ని తీసుకుని వస్తోంది. కొడుకులు ఇద్దరు ఇంజనీర్లు గా పెళ్ళిలై హైదరాబాద్ లో ఉన్నారు. భర్త రెండున్నర నెలలోనే హెడ్మాస్టర్ గా రిటైర్ అవుతారు అందువలన పెళ్ళికే, భర్త ,పిల్లలు, కోడళ్ళు వస్తారు నేను తమ్ముడి కొడుకు పెళ్ళి కి ఉంటాను భయపడకమ్మ అని కొడుకుల తరువాత పదిహేనేళ్ళ కి పుట్టిన కూతురు పాపాయి తో వస్తోంది, ఇంట్లోనే పెళ్ళి నలభై సంవత్సరాల క్రితం అంగరంగ వైభవంగా సరదాగా జరిగింది. ఆప్యాయతలతో, అనురాగలతో బంధు వర్గం వచ్చి, వేదమంత్రాలతో జరిగింది.
ఆ రోజులే వేరు. విధిబలీయం కాలగర్భంలో  బామ్మ, అత్త, మామయ్యలు శ్రీరామచంద్రుని దరి చేరారు. చేనులు, భార్య సుధలకు ఒక్కడే కొడుకు
సుధీర్. వాడిని ఉన్నత చదువులకు కెనడా పంపించారు. పాత ఇంటిని డవలెప్ మెంట్ కిచ్చి మూడు అపార్టుమెంట్లు తీసుకుని చేనులు హెడ్మాస్టర్గా ఉండగా ఒక రోజు కెనెడా నుంచి కొడుకు నాన్నగారు నేను ఇక్కడే చదువుకున్న పిల్లని ప్రేమించాను మీరు అనుమతి ఇస్తే విశాఖలో నోవాటల్ లో పెళ్ళి మీ సమక్షంలో చేసుకుంటాను అనగానే బాధవేసింది. భార్య సుధ బాధ పడకండి మీ బావలు పిల్లలు అందరిని పిలచి చేద్దాం అన్న వెంటనే భార్యలో ఝాన్సీ రాణి కనిపించింది.  హైదరాబాద్ లో ఉన్న బావలకు, మద్రాస్ లో ఉన్న అత్త కూతురు పాపాయి కి ఫోన్ చేస్తే  రెండు రోజుల తరువాత వాళ్ళ దగ్గర్నుంచి వచ్చిన సమాధానం విని ఆశ్చర్యం పోయాను. బావా తప్పక వస్తాము. కానీ మా పిల్లలు మీరు వెళ్ళండి పెళ్లికి అందరూ పెళ్ళికి వెళ్ళాలా మాకు అక్కడ ఎవరు తెలుసు అని, మాతో  కూడా వారానికి ఒకసారి అపరిమిత కాల్స్ సెల్ ఉన్న ముక్తసరిగా బాగున్నారా, ఆరోగ్యం జాగ్రత్త మాత్రలు వేసుకోండి అంటారు రా చేనులు మేము తప్పక వస్తాము పెళ్లికి చిన్నప్పటి సంగతులు ఆ అనుబంధాలు వేరు. రోబో లను సృష్టించిన మనుషులు రోబోలు లాగే యాంత్రికంగా ఉన్నారు. అని వారు చెప్పిన విషయం భార్యతో చేనులు చెప్పగా బాధ పడకండి అన్ని బంధాలకన్నా పవిత్రబంధం వివాహబంధం ఆ విషయంలో నేను అదృష్టవంతురాలినే  అని  భర్త భుజాన్ని ఆప్యాయంగా తట్టింది. ఇది జీవితాన  మరచిపోలేని అనుబంధం అనుకుంటు చేనులు నిద్రకుపక్రమించాడు .

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!