ఓ మానవుడా ఇకనైనా మేలుకో

(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)

 ఓ మానవుడా ఇకనైనా మేలుకో

రచయిత :: నాగ మయూరి

మానవత్వం,మానవత్వం
తరచి తరచి చూడు
కానరాదు అది నేడు

బడిలో
గుడిలో
వైద్యశాలలో
వృద్దాశ్రమాలలో
అనాథాశ్రమాలలో
అచ్చట, ఇచ్చట, ఎచ్చట చూసిన మోసాలే
సామాన్యులు అశ్రుధారలే

పైకి ఏమో సేవాసంస్థలు
లోపలేమో నల్లధన మార్పిడి సంస్థలు

పరిమళించిన మానవత్వంతో
ఉచిత సహాయాలు
ఆ మానవత్వం మాటున దాగివున్నదిలే కుంచిత మనస్కుల దగా

సాయమందిస్తాము అంటూ
ఫోటోలకు ఫోజులిచ్చు వారిని చూడు
స్వలాభాపేక్షయే గానీ,
పరోపకారం లేనేలేదచట

ముందు, వెనుక
పైన, కింద
ఏ దిక్కున చూసినా ఉచితాలే
మంచితనం మాటున దాగి,
మానవ శక్తిని నిర్వీర్యం చేసే ముటాలే

ఓ మానవుడా ఇకనైనా మేలుకో

మానవత్వపు ముసుగేసుకున్న
వ్యాపార జలగల బారినపడకుండా

మంచి – చెడుల తారతమ్యమునెరిగి

నీవే ఓ శక్తివై నీ ఉనికిని కాపాడుకో

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!