(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)
కానరాని విలువలు
రచయిత :: బోర భారతీదేవి
కాలే కడుపులు
తీరని వ్యతలు
అనాథులు అభాగ్యులు
నూతనవ్యాపారపు పెట్టుబడులు
మానవత్వపు ముసుగులు
పుట్టుకొచ్చిన పుట్టగొడుగులు
ఊరువాడా చందాలు
గొప్ప కోసం విరాళాలు
సేవా సంస్థ బోర్డులు
అంతర్జాల ప్రకటనలు
ఆకలికేకలమాటున
అసాంఘిక కార్యకలాపాలు.
కాసుల మూటలు కట్టే నాయకులు
అందించే సహాయ సహకారాలు
ఎదుగుతున్న బడా బాబులు
వినిపించని ఆర్తనాదాలు
సాగుతున్న నయాదందాలు
కానరాని మానవత్వ విలువలు
శవాలను పీక్కుతినే రాబందులు.
Superb ga rasaaru