(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)
ఆత్మవిశ్వాసం
రచయిత:జాధవ్ ముకుంద్ రావు (కవిరత్న )
ప్రతి మనిషికి తమపై తమకు నమ్మకం ఉండటం,
చాలా అవసరం దీనినే ఆత్మవిశ్వాసం అని అర్థం,
“నేను చేయగలను” అని అనుకునేదే ఆత్మవిశ్వాసం
ఆత్మవిశ్వాసమే మానవ జీవితానికి మంచి బలం !!
ప్రతిభ ఉండి ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ రంగంలోనైనా
సరిగ్గా రాణించలేరు ఆత్మవిశ్వాసమే మనిషికి ఒక
మంచి విజయపథంలో అనుకున్నట్లు సాధించడానికి
ఓదార్పు సౌశీల్యం అనే గుణం విశ్వాసాన్ని అంకితం !!
మానసికంగా చెప్పాలంటే ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వ లక్షణం
ఒకరి సొంత నైపుణ్యాల సామర్థ్యాల యొక్క అంచన,
తమ దగ్గర లేని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు
కానీ జీవితం నుంచి ఏ అశించాలి దృష్టి పెట్టలేరు !!
మన వాళ్ళ విశ్వాసాన్ని మనం చూరగొనడమే
మనం లో ఉన్న ఆత్మవిశ్వాసానికి విజయానికి ప్రతీక,
కాస్త తొందరగా నడవాలి ఇతరులను గౌరవించాలి
మంచి ఉపన్యాసాన్ని విని, మంచి మాటలు చెప్పాలి!!
ఎంత బాగా ఆత్మవిశ్వాసం ఉంటే
అంత బాగా మనం జీవితంలో పైకి రావచ్చు.
మనం లో ఉన్న ఆత్మవిశ్వాసం మనం తో సహా
మిత్రులతో కూడా ఆత్మ విశ్వాసం నింపగలదు !!