గమ్యం

అంశం:సస్సెన్/హస్యం

గమ్యం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పుష్పాంజలి

హే వస్తున్నావా లేదా రాత్రికి చెప్పు ఆనీల అయ్యో నీకు ఏమైనా పిచ్చి అంతా రాత్రిలోనా అయితే నన్ను మరిచిపోయి నీవు మీ ఇంటిలోని నీ గదిలో ఆ పుస్తకాలు పెన్ను పట్టుకుని రాస్తుంటావు రచనలను  మొత్తానికి ఆ పుస్తకాలు పట్టుకుని  రాస్తూ కూర్చొని ఉండు నేను ఎవరైనా వెదుక్కుంటూ తోడు తీసుకుని వెళ్ళతాను. అంతా గట్టిగా మాట్లాడవద్దు సూర్య ఇంట్లో అందరు లేస్తారు. అయితే విడియో కాల్ చేయ్యి చెబుతాను. అయ్యో విడియో కాల్ అంత వద్దలే ఏమి విడియో కాల్ చేయడానికి ఏమైంది. ఇప్పుడు హేయ్ నేను నైట్ డ్రస్ వేసుకున్నా పిచ్చిగా ఉన్న , పైగా నీవ్వు నీ పెండ్ర్స్ తో ఉంటావు వాళ్ళు అందరు నన్ను చూడాలా ఏమిటి.
వాళ్ళు ఎందుకు చూస్తారు నేను ఎందుకు చూపెడతాను. మీ మగవాళ్ళాన్ని ఎవరు నమ్మతారు లే పైగా అదో ఒ గొప్ప కదా నేను ఒక అమ్మాయిని పడేసాను అని చెప్పుకోవడానికి. నేను అలాంటివాడినా ఎలా ఆలోచన చేసావు
నా గురించి. జస్ట్ ఎదో అలా చెప్పాను లే.
ఇంతకు ఇప్పుడు ఏమంటావు రాత్రికి నీవ్వు వస్తున్నావు లేదా వస్తాను లేకుంటే నీవ్వు అస్తమానం కాల్ చేస్తుంటావు కదా. అయితే నీకు అవసరం లేదా ఏమిటి. అ అవసరం లేకుండా ఎలా ఉంటుంది. అందరు పడుకున్నారు అనీల నిశ్శబ్దంగా బయలుదేరింది ఎవరు చూడడం లేదు నిర్థారణ చేసుకుని స్కార్ఫ్ చేతికి గ్లౌస్ వేసుకుని ఇంకా భద్రత కోసం ముసుగు వేసుకుంది ఎవరైనా గుర్తు పడితే కష్టం అని, అసలే అమవాస్యరోజులు చిమ్మా చీకటి గాఢాంధకారంగా ఉంది. ఆ  చీకట్లో ఓ ఆకారం వస్తుంది ఎవరు ఇక్కడ అనుకుంటూ ధైర్యంగా ముందుకు వెడతుంది అనీల ముందుకు వచ్చి నిలిచింది  ఆ ఆకారం, ఆ ఆకారంని చూసి నోరు ఎలాగో పెగల్చుకుని సూర్య అంది. హ అన్నాడు మెల్లగా. ఆ నేనే అని చెప్ప చావచ్చు కదా రా అంది.
అవును ఆ గట్టిగా అరిచి మరి చెబుతాను సూర్య అనీలతో కలిసి అని చెబుతుంటే నోరు గట్టిగా మూసింది. అనీల సరే అది తెచ్చావా హ  తెచ్చాను  అది లేకపోతే ఎలా. ఇద్దరు తిన్నగా చీకట్లో వెడుతున్నారు ఊరికి దూరంగా  ఉన్న బంగ్లా వైపు అక్కడ అందరు నిద్రలో ఉన్నారు. వాచ్మెన్ కి లడ్డులు మత్తుమందు కలిపి పంపాడు ముందుగానే సూర్య అది తిని శుభ్రంగా నిద్ర పోతున్నాడు వాచ్మాన్. అనీల సూర్య వైపు చూసింది ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు వీళ్ళు తీసుకుని వచ్చిన  డబ్బాల మూత తీసారు అక్కడా పడి ఉన్న  పైపు తీసుకున్నారు. బండిలోని కారులోని ప్రెటోల్ ని డబ్బాలకు నింపుకున్నారు. రెండు డబ్బాలు తీసుకుని తమని ఎవరు గమనించలేదు అని ధైర్యంగా వడీవడిగా అడగులు వేస్తున్నారు తమ గమ్యం వైపు. ఇంతలో ఒక పోలీసు పట్టుకుని హేయ్ ఎవరు మీరు ఇంతరాత్రి పెట్రోలు  క్యాన్ పట్టుకుని ఎవరిని చంపడానికి తిరుగుతున్నారు. కొంపతీసి మా మినిస్టర్ లేపేస్తారా ఏమిటి….నక్సలైట్లు మీరు లేక ఏ ముఠాకి సంబంధించిన వారు మీరు ? సార్ మాకు అంతా సిన్ లేదు మేము కాలేజ్ స్టూండట్స్ పెట్రోలు కోసం మా తిప్పలు. తమిళనాడు నుండి మా ప్రెండ్ పెట్రోల్ పట్టుకుని వచ్చాడు. అతని దగ్గర నుండి తీసుకుని వెళ్ళతున్నం. పగలు వస్తే అందరికీ తెలిసిపోతుంది అని. కాలేజ్ కి బైక్ మీదా వెళ్ళాలంటే ప్రెటోలతో నడవాలి బండి నీటితో కాదు కదా! సార్, అవును కనీసం ఒక  లీటర్ ఎక్కువగా వచ్చిన ఇంకొకా ఒకరోజు దర్జాగా తిరగవచ్చు ..
మా అమ్మాయి కూడా మీలా  ఆలోచన చేస్తే నాకు కూడా కనీసం ఒక లీటర్ అయిన అదా అవుతుంది. మిమ్మల్ని ఎంతైనా మెచ్చుకోవాలి. అవును అవును మమ్మల్ని మెచ్చుకోవాలి. దేవుడా అనుకుంది అనీల.
ఇదే మొదటి దొంగతనం చివరి దొంగతనం. నీతో కలిసి తిరగడానికి పెట్రోల్ కోసమే ఈ తిప్పలు అనీల ఇంట్లో అడిగితే తంతారు మరి, ఇప్పుడు ధరలు అలా ఉన్నాయి మరి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!