నిశ్శబ్దం
రచయిత :: నెల్లుట్ల సునీత
నీకు నాకు మధ్య
నిశ్శబ్దం ఎంత
భయంకరంగా ఉంది
నిట్టూర్పుల సెగల
మంటలు కరిగించలేని
హిమ పర్వతంలా
మండుతూ
కారుమేఘాలు అయి
వర్షించే కన్నుల దారలు
నమ్మకాలు కరిగిపోయి
నెర్రెలు బారిన మనసులు
స్నేహ స్పర్శ మళ్లీ రాదేమో
కాలంలా చేజారి
సాగరఘోష కన్నా
భీకరంగా ఉంది
నిశ్శబ్దం తెలుసా
నిట్టూర్పుల
మమతల కాంక్షలు
నిజాల్ని నిర్ధారించలేవా
రోధిస్తున్న మనసు
శబ్దం వినిపించట్లేదా!!
***