“నలుగురిలో నగుబాటు ఇక  నగవే నాకు లోటు”

నలుగురిలో నగుబాటు ఇక  నగవే నాకు లోటు”

రచయిత:శ్రీదేవి శ్రీనివాస్ (శ్రీ శ్రీ)

ఒకప్పుడు నిత్యమూ చిరునవ్వులు చిందే నా మోము
ఇప్పుడు నవ్వనేదే కానరాకుండా ఆవేదనయనే మబ్బు కమ్మి మసకబారిపోయింది

దీనికి కారణం
ప్రేమ పేరుతో మోసపోయిన నా అమాయకత్వం
అపనమ్మకానికి బలైపోయిన నా ఆడతనం

ఇది నిన్ను నమ్మి నాకై నేను నీకు అర్పించుకున్న అర్పణ అనుకోనా
దానికి నీవు ప్రేమ అనే అందమైన పేరు పెట్టావని మురిసిపోనా
ప్రేమించిన మైకంలో ఒక అడుగు ముందుకు వేసానని సరిపెట్టుకోనా
లేకపోతే  నాకు జరిగింది అత్యాచారమని కలవరపడనా
లేక అత్యాచారం చేసాక కూడా నన్ను చంపకుండా వదిలినందుకు ఆనందపడనా

ఏది ఏమైనా దానికి ఫలితంగా  నా కడుపున పెరుగుతున్నది నీవు చేసిన “పాప”o

అది కామంతో నిండిన కాళనాగు కాటు
నమ్మకంపైన అపనమ్మకపు వేటు

ఆనాటి నుండి నువ్వు కానరాక
ఏమైనావో అర్ధం కాక
ఏంచెయ్యాలో ఎటూ దారి తోచక

మోసగాడివని మరిచిపోలేక
మరలా వస్తానని ఎదురు చూడాలో లేదో తెలియక సతమతమవుతున్నా

నాలో పెరుగుతున్న నీ పాపపు రూపాన్ని  చిదిమేయాలనుకున్నా
కానీ నువ్వు చేసిన తప్పుకి శిక్ష తనకు వేయలేక మానుకున్నా
ఎందుకంటే  నేను  కాబోతున్న “అమ్మను” గనుక

నేను నిన్ను ప్రేమిస్తే నాకు నువ్వు ఇస్తావనుకున్న బహుమతి
నా మెడలో తాళి కట్టి భార్య స్థానాన్ని కల్పిస్తావని
కానీ నువ్వు ఇచ్చిన బహుమతి
“”నలుగురిలో  నగుబాటు
ఇక  నగవే  నాకు  లోటు “”
***

You May Also Like

One thought on ““నలుగురిలో నగుబాటు ఇక  నగవే నాకు లోటు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!