విజయ దారిలో

(అంశం::”ఆకాశానికి నిచ్చెన”)

విజయ దారిలో

రచయిత :: బొప్పెన వెంకటేశ్

అందుకోవాలి ఆ తారాలోకాన్ని
నిలవాలి అందులో ఓ ధ్రువతారగా
మేఘాల మధ్య మెరుపు పుట్టినట్లుగా
పట్టుదల పరిశ్రమలతో జయమ్మ వచ్చును
గాలి లో మేడలు నిర్మించకు ఆకాశానికి నిచ్చెనలు వేయకు స్వయం వికాసానికి కృషి చేయవోయ్
ఎవరో వచ్చి ఏదో చేస్తారు
అని వృధా ప్రయాస మాని చేతి
కష్టం చేయవోయ్
అద్దాల అందలాలు ఎన్ని ఎక్కిననూ ఆత్మవిశ్వాసం లేనిచో కూలిపోయేదవు
సంభ్రమాంశలకు స్వస్తి చెప్పి
సత్ఫలిత సాధనకై సాగిపో
అంచెలంచెలుగా ఆత్మ
సంయమనంతో ఎదుగు ఆకాశమంత ఎదిగినా ఒదిగి ఉండు
ఆకాశమే హద్దుగా అవకాశాలను అందుకో
మొక్కవోని దీక్షతో నీ క్షామాన్ని
చేధించు
ఆకాశపుటంచులకు నీ విజయ పతాకము చేర్చు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!