కుటుంబానికి ఒక ప్రేమ లేఖ

కుటుంబానికి ఒక ప్రేమ లేఖ

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు.

కుటుంబానికి ఒక ప్రేమ లేఖ!

“హాయ్! హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను ఇక్కడికి వచ్చి వారం రోజులు అయింది, మిమ్మల్నందరినీ మర్చిపోలేక పోతున్నాను, కొంచెం చిన్న వయసులోనే మిమ్మల్ని వదిలి రావలసి వచ్చింది, అయినా పర్వాలేదు,! ఇక్కడకు వచ్చాక ‘దేవేంద్రుల ‘ వారు నన్ను ఎంతగానో గౌరవించి, ఆతిథ్యం ఇచ్చారు! ఇక్కడ ‘స్వర్గసుఖాలకు ‘ అంతు లేదు, రోజు సభలో విందు, వినోదాలు ‘రసామృత భరమైన నాట్యాలతో, నాకు బాగానే గడుస్తున్నది! మీరు బెంగ పెట్టుకోవద్దు, ముఖ్యంగా “నాన్నగారు, అమ్మ, అన్నయ్యలు, అక్కలు, బావలు నా ప్రాణ స్నేహితులు,” బాగా గుర్తుకు వస్తున్నారు, అసలు మిమ్మల్ని వదిలి, ఎన్ని స్వర్గసుఖాలు అనుభవించిన అవి నాకు ‘తృణప్రాయం! ‘నాన్నగారి అభిమానం, అమ్మ ఆప్యాయత, అన్నల సహకారం, అక్క బావల సరదాలు, ముఖ్యంగా నా కోసం తన పుట్టింటి ని వదిలి నాతో’ ‘జీవిత సాఫల్యం ‘కొరకు వచ్చిన నా భార్య రేవతి, మా ఇద్దరి అనురాగం కలబోసుకుని భూమి మీదికి వచ్చిన, నా కొడుకు ‘వంశి ‘అనుక్షణము గుర్తుకు వస్తున్నారు! పోనీలెండి ! నేను దూరమయ్యానని బాధపడకండి, మీ వయసు తీరినాక ఎలాగో మనము ఇక్కడ కలుస్తాం, ఒక్క చిన్న అజాగ్రత్త వల్ల ‘హెలికాప్టర్ యాక్సిడెంట్ ‘లో నా ప్రాణాలు క్షణాల్లో పోయాయే తప్ప,
నా భార్యా బిడ్డల మీద, మన కుటుంబం మీద, మన దేశం మీద నా “పంచ ప్రాణాలు” ఊగిసలాడు తునే ఉంటాయి. ఇక్కడ స్వర్గంలో దేవతులందరు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు, మీరు నా గురించి దుఃఖించ వద్దు, ప్రియాతి ప్రియమైన మన కుటుంబానికి, నా భారత దేశానికి వందనములు,

ఇట్లు
మీ కుటుంబ సభ్యుడు,
“భరతమాత, ముద్దుబిడ్డ”,
🇳🇪 సైనికుడు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!