దేవుడి లీల

దేవుడి లీల

రచయిత :: పి. వి. యన్. కృష్ణవేణి

ప్రియమైన దైవమా,

నువ్వు నాకు ఎదురు పడితే, నిన్ను అడగాలనుకునే కొన్ని ప్రశ్నలు

ఎవరిని అడగాలో తెలియదు,

సమాధానం ఉందో లేదో తెలియదు

కానీ అవే ప్రశ్నలు నన్ను పదే పదే వేడిష్తుంటే,

నా మనసుకు సర్ది చెప్పుకుని జీవితం సాగిస్తున్నాను.

మనలో మన మాట, నా ఈ మాటలు మనసులో పెట్టుకొని నన్ను బాధించకు… సరెనా !!!!

నువ్వు మా మంచి దేవుడివి నన్ను ఏమి చెయ్యవులే.

ఒకవేళ ఎమైనా ఆపద తలపెట్టినా నేను నిన్నే తిరిగి వేడుకుంటాను.

సరే, ఈ నా సుధీర్ఘమైన లేఖ విషయానికి వస్తే, నా మనసు నీ ముందు పరుస్తున్నాను.

ఎన్నో వేలసార్లు, ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో నిండినది నా చిన్నతనం

ఆ మధురమైన అనుభూతి ఇప్పుడు లేదేమిటి!!!

చదువే ద్యేయంగా, ఏదో సాధించాలనే తపన

పట్టు వీడని విక్రమార్కుడికుండే లాంటి పట్టుదలతో ఉన్నా

కానీ, చివరకు మిగిలింది అందరిలాంటి సామాన్య జీవితం

ఏమైంది నేను చదువుకై పడిన ఆనాటి నా కష్టం.

ఎన్నో కలలు కన్న రాత్రులు, ఏవో మధురానుభూతి కోరుకునే జ్ఞాపకాలు

మనసు కోరుకునే ఆ కొత్త బంగారు లోకం,

ఓ దేవా!!ప్రేమ పూరితమైన ఈ జగత్తులో  అదే ఓ ప్రేమకావ్యం

ప్రతి మనిషి జీవితంలో ఉన్న అపురూపమైన భావం పెళ్లి

ఆ పెళ్లి కోసం కన్న కలలు, పెళ్లి తర్వాత పెరిగిన భాద్యతల మద్య మరుగున పడిపోయాయి

ప్రతి ఆడపిల్ల జీవితంలో ఇది ఒక విషాదం అదే మరుగున పడిపోయిన జీవిత కల

పేగు చీల్చుకు పుట్టిన బంధం, రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది ఓ పక్షిలా

ప్రపంచం అనే వినీలాకాసంలో కలసిపోయింది నా పేగు బంధం

ఎప్పుడూ లేనంత వేదన, గుండెను పిండెసే బాధ

నాకే సొంతమే అనుకున్న నా పిల్లలు, వారి జీవితాలు వారివిగా ఎదిగిపోయారు.

మళ్లీ బాల్యాన్ని తలచుకుంటూ, ఆటలు, పాటలు లేకపోయినా… ఆనందంగా

మిగిలిన నా శేష జీవితాన్ని గడపాలి అదే ద్యేయం ఇప్పుడు నాకు

ఒకరికి ఒకరుగా ఉన్న మేము, ఎవరు ముందో… ఎవరు ఎప్పుడో తెలియక బతుకు బండి నడుపుతున్నాము

నేను నిన్ను అడిగే ప్రశ్న ఒక్కటే.

ఎందుకు మాకు ఈ తామరాకు జీవితం మీద ఆశ పుట్టిస్తావు?

ఎందుకు మమతానురాగాల చట్రంలో మమ్మల్ని  సుడులు తిప్పుతావు?

ఎందుకు ప్రేమమయ ఈ జగత్తులో మాకు ప్రేమ ఆశ చూపి, అదే ప్రేమను దూరం చేస్తావు?

ఎందుకు భందాల పేరుతో మమ్ము బంధీని చేస్తావు?

మాకు ఈ జీవితం మీద ఆశను పెంచి, ప్రేమను, ఆ ప్రేమతో కూడిన  ఈ భందాలను మాకు చేరువచెయ్యి.

మనుష్యుల్లో స్వార్థం తగ్గించు,

మనసుల్లో ప్రేమను కురిపించు,

సంపాదన కాదు ముఖ్యం,

మనసుకు ఆనందం ముఖ్యం అని తెలియచెప్పు.

బతికి ఉండగానే భవభందాలను దూరం చెయ్యకు.

ఇవన్నీ చేయలేక పోయినా,

నా మనసుకు ఒడిదుడుకులను ఎదుర్కొనే

మానసిక ధైర్యాన్ని నాకు ప్రసాదించు ఓ దేవా!!!!!

నీ భక్తురాలు, అతి సున్నిత మనస్కురాలు అయిన నేను నీకు వ్రాయు ఈ లేఖ…

తప్పక చదవండి…ఈ బాధతో కూడిన కవిత దేవుడికే అంకితం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!