కలియుగ రాముడు

కలియుగ రాముడు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

కరోనా కరాళ నృత్యానికి
కకావికలై, కడగండ్ల పాలై
కనిపించని లోకానికి వెళ్ళి
కనుమరుగైన మనుషుల కోసం
కన్నీరు మున్నీరు గా పరితపిస్తున్న
పరిస్థితులు చూసి కూడా కరుణ,
దయలేని కఠినాత్ముడిలా ప్రవర్తిస్తు
కామపు పొరల్లో చిక్కి నేను, నాది అనే భావనతో
కన్ను మిన్ను గానక సంచరిస్తున్న మనిషీ
కాలానికి నీవు అతీతుడవు కావు
కాలమనే సుడిగుండంలో నీవు కూడా
కనిపించకుండా పోతావు
కనుక మానవత్వమున్న మనిషిగా
కలకాలం జీవించి
కలియుగంలో రాముడవై
కారుణ్యతో ఆదర్శ జీవితం
సమాజాభివృద్ధికి ప్రతీక అని వసుదైక కుటుంబానికి తెలియచెయ్యి.!!

You May Also Like

One thought on “కలియుగ రాముడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!