పేగుబంధం

పేగుబంధం

రచన: విజయమలవతు

మనసున బాధ కలచి వేస్తున్నా
ఆ లోటు చూపలేదేనాడు
చీకటి నిండిన బతుకులో
ఆశాదీపం నువ్వే అనుకునేంతలా
మారిన జీవనగమనం..

ప్రేమబంధం కలిగించిన
ఎడబాటు తట్టుకుని సాగుతున్నా
పేగుబంధం తెంచుకుని వెళ్లిన
నీ తిరోగమనం మనసుని మెలిపెడుతోందే

నీ సైగలే అర్థవంతం అనిపించేలా
ప్రాణమే నీవుగా మారిన జీవితాన
ఇంత దూరం కలిగించడం
సబబేనా..

కన్నరుణం తీర్చుకునే అవకాశం ఉన్నా
రిక్త హస్తాలతో నిలిపి
కలలన్నీ కన్నీళ్లుగా మార్చి
ఆపక సాగిన నీ పయనం..

బాధాకరమైన గతపు సుడిలో వదలి సాగినా
ప్రతి స్మృతి సజీవంగా కనుల ముందు
తిరుగాడుతున్నదే ఇంకా..
ఆ క్షణాలు అలాగే నిలచి ఉన్నా
శూన్యంగా మారేది కాదేమో అమ్మ ప్రేమ

***

You May Also Like

2 thoughts on “పేగుబంధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!