ఎవరే నువ్వు ?

ఎవరే నువ్వు ?

రచన : క్రాంతి కుమార్

పసిపిల్లలలో ఉన్న స్వచ్చమైన చిరునవ్వువా !
చిన్నారుల పలుకులలో దాగిన అమాయకత్వానివా !
అమ్మ పాడే లాలి పాటలోని లాలిత్యానివా !
నాన్న బాధ్యతలో కనుమరుగైన ప్రేమవా !
సైనికుడి మనసంతా నిండిన దేశభక్తి గేయానివా !
నిరుద్యోగి ప్రయత్నంలో శ్రమిస్తున్న శ్రామికవా !
సామాన్యుడిలో దాగి యున్న అసాధారణ శక్తివా !
కవుల ఆలోచనల్లో దోబూచులాడుతున్న భావుకతవా !
కళాకారుడి మదిని మీటుతున్న ప్రేరణవా !
యువకుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్న ఉత్తేజానివా !
నిస్సహాయకులకు చేయూతనిచ్చే వరానివా !
పేదవాళ్ళ తలరాతలు మార్చే అదృష్టానివా !
ఎవరే నువ్వు నా మనసంతా నిండిపోయావు !!?

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!