పెళ్ళంటే?

అంశం: కొసమెరుపు కథలు

పెళ్ళంటే?
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: జయ

మేఘ …మేఘ …
ఏమిటే.. అప్పుడే ఊహల్లో తెలిపోతున్నావ్..
నీ పేరు మేఘ అయ్యినంత మాత్రాన మాటి మాటికి మేఘల్లో తేలిపోతే ఎలా.. అంటూ సరదగా ఆటపట్టిస్తున్న స్నేహితులు, వరసైన వాళ్ళ మాటలు కూడా పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంది మేఘ.  మౌనమై  ఏదో ధ్యానంలో ఉన్న ఈ కోయిలమ్మ కు ఈ రోజు పెళ్ళి, కానీ పెళ్ళి కళ, సంతోషం కానీ లేదు, మేఘ ఏంటే ఆ పరాధ్యానం ఎంత సేపటి నుంచి పిలవాలి అనే అమ్మ మాటలకు తన వైపు చూసి అమ్మ.! అని కౌగిలించుకొని ఏడుస్తూ నాకు వద్దు అమ్మ ఈ పెళ్ళి  దయచేసి నన్ను అర్థం చేసుకో, నాన్న కి నువ్వైనా చెప్పు, నా మాట వినడం లేదు. ” ఏమి చెప్పమంటావే నీ కూతురు ఈ పెళ్ళి చేసుకోదంట అని చెప్పనా”. చెప్పు చెప్పమంటవా. ఇద్దరిని ఒకే సారి  చంపేస్తాడు. అప్పుడు గాని ఉండదు మనకు. మొదట లవ్ అన్నావ్, సరే అని పెళ్ళికి ఒప్పుకుంటే, మళ్ళీ లవ్ చేసినవాడు వద్దు, మీరు చూపించిన వాడినే చేసుకుంటానన్నావ్. సరే అని మంచి సంబంధం చూసి ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నకా ఇప్పుడు వద్దు అంటే పరువు ఏమైనా ఉంటుందా, నీకు ఏమైనా పిచ్చా, ఒక నిర్ణయం మీద ఉండవా, ఎందుకే అంత అయోమయంలో వుంటావ్ ఎప్పుడూ. చూడు మేఘ  పెళ్ళి అంటే ఆట  అనుకున్నవా నీ ఇష్టం వచ్చినట్లు  నిర్ణయాలు మార్చుకోడానికి, అమ్మ నేను చెప్పేది కూడా అదే, పెళ్ళి అంటే “ఓ వేడుక కాదు”, “నా నిండు నూరేళ్ల జీవితం.”ఈ పెళ్ళి తో నా జీవితం అంతా  ముడిపడి ఉంది. అందుకే అంతలా ఆలోచిస్తున్నా. నాకు ఆ మనిషి ప్రవర్తన నచ్చలేదు. ఇప్పుడే ఇలా ఉంటే పెళ్ళి అయ్యాక నా పరిస్థితి ఏమిటి.? మేము ఉన్నాం కదా అలా ఏమీ జరగదు. మీరేమి చెయ్యగలరు అమ్మా, నా బాధ చూసి బాధపడటం తప్పా,! అది కాదు మేఘ, అమ్మా దయచేసి అర్ధం చేసుకో నాన్నతో మాట్లాడు. సరే నే నేను చెప్పి చూస్తా, ఆయన  వినకపోతే నేను ఏమిచెయ్యలేము అనుకుంటూ. వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి, ఏవండి మీతో మాట్లాడాలి ఒకసారి ఇలా వస్తారా! ఇప్పుడు ఏమిటి మాటలు, అవతల పెళ్ళి వాళ్ళు వచ్చే టైం అయ్యింది. పిల్ల ను రెడి చేసావా! ముందు ఆ ఏర్పాట్లు చూడు వెళ్ళి, అది కాదు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడా ఏమిటి, ఏవండి అది, నసక్కు చెప్పు ఏమిటో? మీ కూతురు  ఈ పెళ్ళి చేసుకొనని ఏడుస్తుంది అండి. ఏమి వాగుతున్నావ్ నువ్వు అని చెంప మీద ఒక్కటి ఇవ్వగానే మేఘ కి అర్ధం అయ్యిపోయింది. వీళ్ళు ఇక వినరు అని. ఎలా ఇప్పుడు ఈ పెళ్లి చేసుకొని జీవితాతం సర్దుకుపోయి బ్రతకడం నా వల్ల కాదు, సో ముందు ఇక్కడి నుండి  వెళ్ళిపోవాలి. ఆ ఆలోచన రావడం రావడం తోనే అక్కడి నుండి తప్పించుకొని బయటకు వచ్చేసిందే కానీ, ఒంటరిగా ఎలా ఎడికి వెళ్ళాలో అర్ధం కాక దిక్కులు చూస్తున్న మేఘకు, తనకోసం వెతుకుతున్న, నాన్న పంపిన మనుషులు ను చూసి, వామ్మో అప్పుడే వెతకడం మొదలు పెట్టసారూ, ఇప్పుడు వీళ్ళకి  దొరికితే ఈ పెళ్ళి తో పాటు, మా నాన్న బడిత పూజ కూడా చేస్తారు అని, ఓహ్ గాడ్ అనుకోని ఎక్కడ దాక్కోవాలో అర్ధంకాక పరిగెడుతూ, పరిగెడుతూ రోడ్డు పక్క ఆగివున్న కార్ ను చూసి దానిలో ఎక్కి వెనుక సీట్ లో చీరకొంగు కప్పుకొని పడుకుంది. కొంత సేపటికి ఏవో శబ్దాలు అవ్వడం ఓయ్.. పిల్ల లే…! ఎవరు నువ్వు దినిలోకి ఎలా వచ్చావ్ అని మాటలు వినిపించి చూసే సరికి అర్ధం అయ్యింది రాత్రి ఏమి జరిగిందో అని, ఓహ్ గాడ్ అయ్యో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను.
అరకులో ఉన్నావ్  అంటూ, ఒక బామ్మ గారు నవ్వుతూ వచ్చారు. బామ్మ వెనుకనే తాత గారు రావడం చూసి. అయ్యో ఎంత పని జరిగింది. అయ్యినా నేను ఒక మాలోకం ను, ఎదవ కంగారు తప్ప ఆలోచన ఉండదు, అమ్మ గుర్తుకు వచ్చి ఏడుపు మొదలు పెడుతుంది. అయ్యో ఎందుకు ఏడుస్తున్నావ్  బంగారం అంటూ… మేఘ ను ఊరడించి, లోపలికి  తీసుకువెళ్లి, మేఘ ఫ్రెష్ అయ్యి, కొంచెం కుదిటి పడి రూమ్ లోంచి బయట  బాల్క ని లోకి వచ్చి చూస్తూ వాఁవ్ బ్యూటీఫుల్ ప్లేస్  అని చూస్తున్న మేఘ కు అంతకన్నా బ్యూటీఫుల్ అయినా ఓ సీన్ చూసి తనలో తను నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి కూర్చున్న మేఘ, బయట తను చూసిన  దృశ్యం గుర్తుకు వచ్చి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆది దంపతుల్లా నడిచి వస్తున్న, బామ్మ ను, తాతను చూసి నిలబడుతుంది. అరే తల్లి ఎందుకు లేస్తున్నావ్ కూర్చో, మేము ఏమైనా ఓల్డ్ పీపుల్స్ అనుకుంటున్నావా, మేము చాలా ఎంగ్ కౌఫుల్.  కదా డార్లింగ్ అంటూ బామ్మ గారి బుగ్గ మీద ఒక ముద్దు ఇవ్వగానే, బామ్మ గారు నువ్వు  ఊరుకో డార్లింగ్ అంటూ  తాత గారి బుగ్గ మీద గిచ్చుతూ,  నువ్వు అల్లరి పిల్లోడివి డార్లింగ్ అంటూ మురిసిపోతున్న  బామ్మ, తాత ల్లో వయస్సు ఎక్కడ కనిపించడం లేదు మేఘ కు, వారిలో ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ తప్ప.! ఆ జంట ను చూసి ముసి ముసి నవ్వులు నవుతున్న మేఘ ను చూసి,  తల్లి ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావ్, నిన్ను చూస్తూ ఉంటే పెళ్లి కూతురు లా ఉన్నావ్, మరి నువ్వు నా కార్ లోకి ఎలా వచ్చావ్ అని అడుగగానే మేఘ కంగారు పట్టడం చూసి, దేనికి తల్లి కంగారు, భయపడకు నీ సమస్య ఏదైనా మేము అర్ధం చెసుకుంటాం. చెప్పు ఏమి జరిగింది, నువ్వు ఎందుకు మా కార్ లో దాక్కున్నావ్… వాళ్ళు అడిగిన ప్రశ్న కు తన పెళ్లి విషయం లో తను భయపడుతుంది అనే విషయం గుర్తించిన ఆ జంట, మేఘ కి ఎలా అయినా పెళ్లిలోని  విశిష్టత గురించి తెలియచెప్పాలి, ముందుగా తనకి ప్రేమ తో కూడిన దాంపత్యo గురించి తెలియజెప్పాలి. అనుకోని  భోజనాలు చేసి, మేఘ ను  తన రూమ్ కి తీసుకొని వెళ్ళి, నీకు పెళ్ళి అంటే ఎందుకు ఇష్టం లేదో నాకు తెలియదు గాని. పెళ్ళి అంటే  నూరేళ్లు జీవితం, నీకు ఒకటి చెప్పనా బంగారం నేను కూడా  మీ తాత ను చూసి మొదట్లో భయపడి పెళ్ళి వద్దన్నా. మీ తాత పెద్ద మాయగాడు, ఏ మాయ చేసాడో గాని నా జీవితాన్ని మొత్తాన్ని తన వశం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తనే నా జీవితాన్ని అందమైన హరివిల్లులా రోజు కో కొత్త రంగు ని చూపిస్తూ ఆనందాల వెల్లువ కురిపిస్తూన్నాడు. అవునా బామ్మ ! మీ లవ్ స్టొరీ చెప్పవా!  హా చెబుతా విను మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు , మా పిన్ని, బాబాయి నన్ను చూసుకునే వారు, మా పిన్ని కూడా నాకు ఊహ తెలుస్తోంది అనే అప్పటికి చనిపోయింది. మా బాబాయి నాకు  చిన్నవయస్సు లోనే పెళ్లి చేసేశారు. కానీ అతను అంత మంచి వాడు కాదు, నన్ను ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ, మానసికంగా హింసించేవాడు. ఒక రోజు ఆయన  బా తాగి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అప్పటికి నాకు ఒక బాబు. ఆస్తులు కూడా ఏమి లేవు. నేనే ఒక స్కూల్ లో టీచర్ గా పని చేసి పిల్లోడిని పెంచుకునే దాన్ని, ఎన్ని కష్టాలు వచ్చిన పిల్లొడికి  ఏ కష్టం రాకుండా చూసుకుండేదాన్ని, ఆ స్కూల్ స్థాపించిన వారే మీ తాత, నన్ను రోజు గమనిస్తూ వుండేవారంట.
నేను అంటే ఇష్టపడి ఆ విషయం నాకు ఎలా చెప్పాలో తెలియక రోజు తెగ తిప్పలు పడేవారు పాపం, ఆ విషయం నాకు అర్ధం అయ్యింది కానీ, చిన్నప్పటి నుంచి నేను పడిన కష్టాలు వల్ల నా మనస్సు బండ రాయి లా మారిపోయింది. అదే చెప్పా మీ తాత కు నాకు ఇటువంటివి ఇష్టం ఉండవు అని, నా చుట్టూ తిరగొద్దు, ఏదైనా మంచి సంబంధం చూసుకొని పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండండి అని, నేను ఎంతకీ ఒప్పుకోకపోయిసరికి ఒక రోజు నా ఎదురుగా వచ్చి నా చెయ్యిపట్టుకొని నీకు ఎలా చెబితే నా ప్రేమ అర్ధం అవుతుంది అంటూ, నా పెదవులకు తన పెదవులు జత చేసి గట్టిగా ముద్దుపెట్టేశారు నాకు ఏమిజరిగిందో అర్ధం అయ్యేలోపే  నా మెడలో తాళి కట్టేశారు. అప్పుడు గాని అర్ధం కాలేదు అక్కడ ఏమిజరిగిందో,  అని బామ్మ చెప్పగానే  మేఘ ఓ మై గాడ్ ముద్దే పెట్టేసారా డైరెక్టగా, అప్పుడు మీరు ఏమి అనలేదా తాత గారిని, దేనికి అనాలి నాకు ముద్దు పెట్టినందుకా,  ఆ ముద్దు లో నాకు కోరిక కనిపించలేదు, ఆ ముద్దులోనే అర్ధం అయ్యింది తనకి నేను అంటే ఎంత ఇష్టమో,
తన ప్రాణాలే నేనని
తన మనస్సఅంతా నేనేని
తన వలపు అంతా నాకే అని
ధర్మేచా, అర్ధేచా, కామే చా, మోక్షే చా, అంటూ అవధులు లేని తన ప్రేమను తన ముద్దు ద్వారా తెలియ జెప్పారు. ఆ క్షణం తన కళ్లలో చూస్తూ తన అడుగులో అడుగు వేస్తూ సప్తపది తోడుగా ఏడూ అడుగులు వేస్తూ, నాలుగు దిక్కులలో ఎటు వైపు చూసినా తన ప్రేమే కనిపించేలా  తన ప్రేమ మాయలో ఇద్దరం ఒకరికిఒకరు ప్రాణమై,
ఒకరిలో ఒకరు ఒదిగిపోతూ మా జీవితాలు రెండు మనస్సులు ఏకమైన కళ్యాణమే   కమనియమైన పచ్చతోరణం గా ఇది గో ఈనాటికీ ఇలా కొనసాగుతుంది. పెళ్ళికి ముందు రొమాన్స్ తప్పు కదా! తాత గారు అలా చేస్తే ఎవరు ఏమి అనలేదా మిమ్మల్ని. హ్మ్  అనే వాళ్ళు వంద అంటారు.
అసలు  రొమాన్స్ అంటే తప్పు ఏమిటి, అసలు అదే తప్పు అయితే ఈ సృష్టే ఉండదు.
నీకో ఒక  విషయం చెప్పనా మేఘ. అందరూ అంటారు పెళ్ళి కి కావలిసిన అర్హత “సర్దుకుపోవడం అని కానీ, పెళ్లికి కావలిసిన అసలైన అర్హత గ్రేట్ రొమాన్స్ తెలుసా! “రొమాన్స్ అంటే సెక్స్ మాత్రమే కాదు, ఒక పది నిముషాలు గదిలో తలుపులు వేసుకొని చేసిది కాదు. అది ఒక ప్రేమ చూపించే మార్గం, మన ప్రతి కదిలిక, ప్రతి తలుపు, ప్రతి మాటలో కనిపించే  ప్రేమే రొమాన్స్ అంటే. ప్రేమలో అల్లరి రొమాన్స్, ప్రేమ తో చేసే ప్రతి  అల్లరిలో ఇష్టాన్ని ఒక స్పర్శ ద్వారా చూపించటం. అధి మాట, ఒక కౌగిలి, ఒక చిన్న ముద్దు కావొచ్చు, అంత ఎందుకు, ఇద్దరు  కలిసి కూర్చుని మౌనం గా  ఒకరి కళ్ళల్లో చూసుకుంటున్నపుడు కలిగే ఫీలింగ్ కూడా ఒక రొమాన్స్ నే తెలుసా! ఎదైన సరే ప్రేమతో చేసే ప్రతి చర్య ప్రతి మాట ఒక రొమాన్స్ అవుతుంది. అది మనసులో ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే సాధ్యం అవుతుంది, అంతటి స్వేచ్ఛగా ఉండటం, మధురమైన  ఫీలింగ్ కూడా వస్తుంది. రొమాన్స్ అంటే ప్రేమను చూపించడం.  అస్సలు ప్రేమ అంటే తనతో ఉన్న ఒక్కోక్క నిముషం మరల మరల పుట్టాలి అనిపించాలి, మన చుట్టూ ఎంత మంది ఉన్న మన ప్రపంచం మొత్తం తనే కావాలి. మన చుట్టూ ఎంత మంది ఉన్న మన ఫీలింగ్స్ ని షేర్ చేసుకొనే వాడు ఒక్కడు ఉండాలి, మన జీవితానికి ఒక ఆశ కల్పించేలా ఉండాలి, తన ప్రేమ, మనం పడిపోతున్నాం అని అనిపించే మరుక్షణం తన ప్రేమ మనల్ని నిలబెట్టేలా ఉండాలి. తన తలుపు మనస్సున మేధలగానే పెదవులపై మనకే  తెలియకుండా వచ్చి చేరే చిరున్నవ్వు చెబుతుంది తన ప్రేమ అల్లరి. తన కనబడకుంటే మనస్సు పడే వేధన చెప్పాలి తన ప్రేమ ఎంత విలువైనదో అని, తన పేరు వినపడగానే మన గుండె చప్పుడు చెప్పాలి తన ప్రేమ ఎంత బలమైనదో, తను ఏమి చేసినా మనకు బాగుండాలి, తను ఏ పని చేసిన మన పై పిచ్చి కనిపించాలి. తన ప్రేమ ప్రతి నిమిషం మనకు ఆయువు పోయాలి. తన ప్రతి మాట, ప్రతి పని మనకి ధైర్యం ఇచ్చేది గా ఉండాలి. ప్రేమ అంటే  కానుకలు ఇవ్వడం కాదు, మనల్ని మనకు కొత్తగా చూపిస్తూ మనల్నే మనకు కానుకగా ఇవ్వాలి. ముఖ్యం గా ప్రేమ లో  స్వేచ్ఛ ఉండాలి. మన లైఫ్ లో సగం కెరీర్, సగం పెళ్ళి తో గడుస్తుంది. ఇన్ని ఫీలింగ్స్ దాగి ఉన్న ప్రేమని, పెళ్ళిని మన వాళ్ళు ఏమిటో మన ఫీలింగ్స్ విలువ ఇవ్వకుండా ఓ డబ్బుకి, స్టేటస్ కి విలువ ఇచ్చి పెళ్ళి చేసేస్తారు, అక్కడి నుంచి ఒకరిని ఒకరు బాధ పెట్టుకుంటూ, ఆనందం అనే మాటే మరచి ఏదో బ్రతుకుతున్నాం , బ్రతకాలి అన్నట్టు బ్రతికేస్తాం. అలాంటి బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా ఎలాగోలా బ్రతికి చావు అన్నట్టు, ప్రతి నిముషం నరకము అనుభవిస్తూ అన్నట్టు ఉంటుంది. మన జీవితం అలా ఉండకూడదు అంటే మన ప్రేమ లో ప్రతి రోజు కొత్తగా పూడుతూ ఉండాలి, మన కాపురం పాతపడకుండా ఉండాలి అంటే గ్రేట్ రొమాన్స్, జరగాలి. ప్రతి సూర్యోదయానికి మనం చిరునవ్వవుల స్వాగతం పలకాలి చిరు ముద్దులు ఇస్తూ, వెన్నెల రెయి కై ఎదురు చూడాలి చలి చలి చిరు గాలులు  ఆశల అల్లరి గిలిగింతలు రేపుతుంటే, తనువు అంతా యవ్వనగిరులు తడుముతూ, వేల ఊహలందు  ఒకరి ఒకరిలో ఒదిగిపోయే క్షణంలో ఆ ఊసులు దుప్పటిలో ఆ మన్మధ సామ్రాజ్యానికి మనమే యువరాజు, రాణీలమై పాలిస్తుంటే, మన జీవితం కాదా పూలపాన్పు. జీవితంలో ప్రతి క్షణం చాలా విలువైనది రా, ప్రతిక్షణం మనది గా అనుభూతి చెందాలి, ఆనందంగా ఉండాలి. అప్పుడే మన జీవితానికి అర్థం, మనం చేసే పనిలో కూడా మనం విజయం సాధిస్తాం. నువ్వు ఫస్ట్ ని గురించి నువ్వు తెలుసుకో, నిన్ను నిజంగా ప్రేమించే వారు ఎవరో  నీ మనస్సును అడుగు చెబుతుంది. మేఘ కి బామ్మ చెబుతుంటే తను ప్రేమించిన వర్షిత్ గుర్తుకు వచ్చాడు, తను కూడా అంతే బామ్మ లానే మాట్లాడతాడు, నన్ను చిన్న పిల్ల లా బుజ్జగించే వాడు, అల్లరి చేసే వాడు, తన ప్రేమ గుర్తుకు వచ్చి బామ్మను పట్టుకొని ఏడుస్తూ నిజమే బామ్మ! నువ్వు చెబుతుంటే నాకు తెలుస్తుంది. నా వర్షిత్ ప్రేమ, కేవలం జాబ్ లేదు అనే కారణం తో తనని వదులుకొని, వేరే పెళ్ళి చేసుకుందాం అనుకున్న, కానీ నా మనస్సు ఆ పెళ్లి కి అంగీకరించలేకపోయింది. బహుశ అందుకునేమో, ఇలా జరిగింది  నేను వర్షిత్ ని అర్జెంట్ గా కలిసి  క్షమించమని అడగాలి, వెళ్తాను బామ్మ,! ఆగు తల్లి అదే నీలో ఉన్న లోపం కంగారు పడకు, నీకు నువ్వు ఒకసారి బా ఆలోచించుకో ! అప్పుడు వెళ్ళు నీ ప్రేమను అతని హృదయానికి తాకేలా విన్నవించుకో, నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకో.
అప్పుడు అతన్ని తీసుకొని వెళ్లి మీ అమ్మా, నాన్నలతో మీ ప్రేమ విషయం చెప్పి, మన్నించమని కోరు. అప్పుడు వాళ్లే నిన్ను దగ్గరకి తీసుకొని నీకు పెళ్ళి  చేస్తారు. నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, అందు వల్ల వాళ్ళు రెండు మాటలు అన్నా మౌనంగా ఉండు అర్ధం అయ్యిందా అని బామ్మ, మేఘ కి  హితబోధ చేసి దగ్గర ఉండి కారులో పంపించింది. బామ్మ చెప్పినట్టు నడుచుకొని వర్షిత్ స్వచ్ఛమైన ప్రేమను, తల్లిదండ్రులు ఆశీస్సులును పొంది మేఘ సంతోషంగా  ఉంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!