నీ నీ మాటే వేదం

నీ నీ మాటే వేదం

రచన: సావిత్రి కోవూరు 

ఆమె :- చిట్టి చిట్టి వంకాయలు, ఒడియాలకు సగ్గుబియ్యం ఇంతే నండి శ్రీవారు, మరువకుండ పట్రండి  శ్రీవారు

అతను :- వంకాయలు పుచ్చులుంటయే రాణమ్మా  ఏరే ఓపికసలు లేదురాణమ్మా ఒడియాలు పెట్టి పెట్టి వళ్ళంతా నొప్పులంటవ్, రాణమ్మా నా ముద్దుల రాణమ్మా

ఆమె :- సంక్రాంతి పండుగొచ్చే శ్రీవారు, ఏమి చేయమంటారు శ్రీవారు

అతను :- సంక్రాంతి వచ్చేది చలికాలంలోనా రాణమ్మా ఒంటికి వేడి నిచ్చు నువ్వులు తినమంటారు రాణమ్మా

నువ్వుల పొంగలి చేసి, నువ్వుల కజ్జికాయలు చేయవే రాణమ్మా, నా ముద్దుల రాణమ్మ

ఆమె :- అబ్బా! నువ్వులంటే నాకు చెప్పలేని అలెర్జీ మామయ్యా, కొబ్బరి పొంగలి చేస్తా, కొబ్బెర స్వీటు నేను చిటికలోన చేసేస్తా,
కొసరి కొసరి వడ్డిస్తా మురిసి మురిసి తినవయ్యా ముద్దుల మామ
నీ మాటే నాకు వేదమయ్య ముద్దుల మామ

అతను :-పాలకాయలు, పప్పు భక్ష్యాలు పసందుగా చేయవమ్మా రాణమ్మ నా ముద్దుల రాణెమ్మ

ఆమె :- పాలకాయలు, పప్పుభక్షాలు పాత పాత వంటలయ్య మామయ్య, గులాబ్ జామూనులెన్నో
చకచక చేసేసి నేను కొసరికొసరి వడ్డిస్తా మామయ్యా, మురిసిమురిసి తినవయ్యా ముద్దుల మామ నీ ఇష్టమె నా ఇష్టం మామయ్య నీ మాటే నాకు వేదం మామయ్య.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!