ప్రేమ

(అంశం:”ప్రేమ/సరసం)

ప్రేమ

రచన: సావిత్రి తోట “జాహ్నవి”

నింగి, నేల ఏకం చేసేటట్లు కుండపోతగా కురుస్తుంది వర్షం.
ఆ వర్షంలో తడుస్తూ… బస్టాండ్ కి చేరుకున్నారు వాళ్లిద్దరూ…

తడిసిన ఒంటితో చలికి గజగజ వణుకుతూ…
“చెప్తే విన్నారు కదూ!?… ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్లేది!?… నాన్నవాళ్లకి ఏం సమాధానము చెప్పేది”
అంటూ… చిరు కోపంగా చూస్తున్న షర్మిల ను చూస్తూ… కొంటెగా నవ్వాడు నానా.

అతని నవ్వు చూస్తూనే, మరింత కోపంతో దబదబ అతని గుండెల మీద బాదేస్తూ, అంతలోనే దూరంగా జరిగిన షర్మిలని  “మై…హు…నా” అంటూ దగ్గరకు తీసుకున్నాడు.
దట్టంగా కమ్మిన  మబ్బులలో, కుండపోతగా కురుస్తున్న వర్షం… చల్లటి ఆ వాతావరణం…బస్టాండులో ఒంటరిగా నిలబడిన  వారికి దొరికిన ఆ ఏకాంతం వారిలో ఏవో చిలిపి ఊహలు రేక్కేత్తిస్తున్నాయి.

                #####

    నిశ్శబ్ద నిశిదీలో, ఆ చల్లని వాతావారణంలో, సందర్భానికి తగినట్లు దూరంగా ఎక్కడి నుంచో అన్ని వాన పాటలు  ఒకదాని తర్వాత ఒకటి  మంద్రంగా వచ్చి    చెవిలో వచ్చి చేరుతూంటే, మైమరచి అలా వింటూండిపోయింది.

“ఆకుచాటు పిందె తడిసే…
కోకచాటు పిల్ల  తడిసే…
ఆకాశ గంగొచ్చింది…
అందాలు ముంచెత్తింది…
గోదావరి పొంగొచ్చింది…
కొంగుల్ని ముడి పెట్టింది…
గుండె చాటు గువ్వ తడిసె…
గుండె మాటు గుట్టు తడిసె…”

“వాన వాన వెల్లవాయే…
కొండకోన తుళ్లిపోయే!…
చెలియ చూపులే చిలిపి జల్లులై…
నేను తాకగానే ఏదో ఏదో ఏదో హాయి…”

                ఇంతలో, పెళ్లుమని వినిపించిన పిడుగు శబ్దానికి, వీపు మీద ఎవరో గట్టిగా చరిచినట్లు తుళ్లిపడింది షర్మిళ.

   ఊరికి దూరంగా  నింగి నేల ఏకం చేస్తూ… కుండపోతగా కురుస్తున్న వర్షంలో దట్టమైన ఆ చీకటి రాత్రి  రోడ్ మీద జనసంచారం అస్సలు లేదు.

         అమావాస్య రోజులు కావడం, అప్పటికే రాత్రి పదిగంటలు దాటడం వలన కాబోలు, ఊరంతా నిద్ర పోతుంది… అన్నట్లు రోడ్ల మీద కనీసం ఒక్క వాహనం కూడా రావడం లేదు.

         ఆ దట్టమైన చీకటిని, ఏకాంతాన్ని అవకాశం గా తీసుకున్న నానా చేతులు, ఎప్పుడూ తన నడుం మీదకు జారాయో?… రెండు చేతులను  నడుం కిందకు వేసి, అంతవరకు అందనిది ఏదో కావాలన్నట్లు ముఖం మీదకు  ముఖం చేర్చి,  మెల్లగా నేలమీదకు జారుస్తూ… దొండపండులాంటి ఎర్రని తన పెదవులను అందుకోబోతున్నాడు. అది చూస్తూనే నానా ని గట్టిగా ఒక తోపు తోసి, ముందుకు పరిగెత్తి పోయింది షర్మిళ.

     కిందకి పడిపోతున్న వాడల్లా  మెల్లిగా నిలదోక్కుకుని, “ఏయ్ షర్మి…!? ఆగు…!” అంటూ, వెనకే పరిగెత్తాడు అతడు.
#####
షర్మిళ  అలా పరిగెత్తుతుంది. కాని తన ఆలోచనలు అన్ని ఉదయం నుండి జరుగుతున్న సంఘటనల మీద నిలిచిపోయాయి.

    “మావయ్యగారు! మా అమ్మమ్మకి ఆరోగ్యం బాలేదు. తన  కాబోయే మనవరాలిని ఒకసారి చూడాలని ఒక్కటే తాపత్రయ పడుతుంది. తనని ఒకసారి మా అమ్మమ్మ వాళ్లింటికి పంపిస్తే, మళ్లీ సాయంత్రం జాగ్రత్తగా మీ ఇంట్లో దింపేస్తాను. అస్సలు మా అమ్మ, నాన్నే రావాల్సింది. కాని…” అని నసుగుతూ…

“ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో, వాళ్లు అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడటం లేదు”

   “అయ్యో!… అలాగా బాబు. దానిదేముంది. అలాగే తీసుకెళ్లు. నేనే వచ్చేవాడిని. నాకు అర్జంట్ మీటింగ్ ఉంది. పోని మీ అత్తయ్యని కూడా  మీతోపాటు తీసుకెళ్లు”

  “ఇప్పుడెందుకు అత్తయ్యగారిని శ్రమ పెట్టడం మావయ్యగారు. తర్వాత వీలు చూసుకుని, మీ ఇద్దరు రండి. ఇపుడు బైక్ మీద తనని తీసుకెళ్తాను”

   షర్మిళకి, నానా కి ఆరునెలల క్రితం వివాహం నిశ్చయించారు. షర్మిళకి డిగ్రీ చివరి ఏడాదిచదువు  మూలంగా పెళ్లి ఏడాది వాయిదా వేసారు పెద్దలు అంతా నిర్ణయించుకుని. ఈ కాలంలో కనీసం డిగ్రీ అయిన చదువు లేకపోతే ఎలా…!? అంటూ…
#####
తనకు,షర్మలకు నిశ్చితార్థం జరిగిన దగ్గర్నుంచి, ఎలాగైనా తనని బయటకు తీసుకెళ్లి, ఒంటరిగా మాట్లాడటానికి చూస్తున్న నానా కి మాత్రమే తెలుసు. అది సాకు మాత్రమేనని…

       అలా మావయ్యగారి పర్మిషన్ తో షర్మిళని తన అమ్మమ్మగారింటికి తీసుకెళ్లిన నానా, ఆవిడ దగ్గర  ఒక గంట మాత్రం ఉండి,  బయటకు అలా  బీచ్ లో తిరిగి, ఇంటికి వెళ్దామంటూ, తీసుకెళ్లి పోయాడు.

    అలా బీచ్ కి వెళ్లిన వాళ్లిద్దరూ, కాస్సేపు  కెరటాలతో ఆడుకుంటూ, ఒకరి మీద ఒకరూ నీళ్లు జల్లుకుని, కేరింతలు కొడుతూ, పోటోలు తీసుకుంటూ సరదాగా గడిపేసరికి, సాయంత్రమయిపోయింది.

   ఇంతలో  సరదాగా బీచ్ కి వచ్చిన నానా స్నేహితులు, వాళ్లిద్దరిని చుట్టుముట్టేసి, పార్టీ కావాలని గోల చేయడంతో, ఇక చేసేది ఏమి లేకా, హోటల్ కి వెళ్లి టిఫిన్ తినేసి, వాళ్ల బలవంతం మీదే ఫస్ట్ సినిమా చూసి, ఇంటికి బయలుదేరారు.

    అప్పటికే బాగా చీకటిపడి, దట్టంగా మబ్బులు కమ్మేసాయి.

    “తొందరగా పద…! అమ్మ నాన్న నా కోసం కంగారుపడుతుంటారు” అంటూ గోలపెడుతున్న షర్మిళ మాటలలో నిజం గ్రహించిన నానా బైకును స్పీడ్ గా నడిపిస్తూ… ఇంచుమించు షర్మిళ వాళ్ల ఏరియా కి వచ్చేసారు.

    ఇంతలో,  ఉరుములు,మెరుపులతో, నింగి,నేల ఏకం చేసేస్తూ…  పెద్దగా వర్షం మెుదలవ్వడం, అదే సమయంలో బైక్ ట్రబుల్ ఇవ్వడంతో  బస్టాండ్ లో కాస్సేపు ఆగారు ఇద్దరూ.

    స్వతహాగా మంచివాడైన నానా, ఆ చల్లని వాతావరణం,  పక్కన తామిద్దరికి నిశ్చితార్థం జరిగి సగం అర్థాంగి అయిన అందాలబోమ్మ. తడిసిన బట్ట ల్లో గజగజ వణుకుతూంటే, భుజం చుట్టు మెల్లిగా చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు.

   అదే సమయంలో వాతావరణానికి తగినట్లు, పాటలు వినబడుతూ, శరీరం ఏదో కావాలని గోల చేయడం తో తనకు తెలియకుండానే ఒక అడుగు ముందుకు వేసాడు నానా.

     ఇంతలో పెళ్లున శబ్దం చేస్తూ… పడిన పిడుగు వారిలో విచక్షణ ను మేల్కోల్పి, దూరం చేసింది.
#####
అంతా రాత్రి వేల అలా తడిసిన బట్డల్లో ఇంటికి వచ్చిన వారిద్దరిని చూసిన షర్మిళ తల్లిదండ్రులు,

    నానా తుడుచుకోవడానికి టవల్ , పడుకోవడానికి గది చూపించారు.

   ఆ తర్వాత మరీ అలస్యమైతే, వాళ్లిద్దరి పరిస్థితి ఎంత వరకు వెళ్తుందోనని భయపడిన పెద్దలు, పరీక్షలు కూడా దగ్గరకు రావడం వలన, పరీక్షలు అయిన వెంటనే వాళ్లిద్దరి వివాహానికి ముహుర్తం పెట్టించి, పెళ్లి జరిపించేసారు.
#####
అది వాళ్లిద్దరికి తొలిరాత్రి. పల్చటి  షిఫాన్  తెల్లచీర కట్టుకుని , తలలో మల్లెపూలు తురుముకుని, చేతిలో పాలగ్లాస్ తో వచ్చిన షర్మిళ…

   అప్పటికే దట్టంగా మబ్బులు కమ్మేసి, ఉరుములు, మెరుపులతో వాన మెుదలుపెట్టేసాడా కావడంతోపాటు, ఆ గాలికి కరెంట్ కూడా పోవడంతో, ఒక్కసారిగా తృళ్లిపడి, గట్టిగా అరిచేసి, అతని ఒడిలో చేరిపోయింది.

    ఆ తర్వాత వాళ్లిద్దరూ,  వానలో తడిసిన ఆనాటి రాత్రి గుర్తు తెచ్చుకుంటూ… మెల్లిగా ఒకరి చెంత ఒకరు చేరి ఆ రాత్రిని మరువలేని మధుర రాత్రి గా మలచుకున్నారు.

    తగిన సమయం కానప్పుడు ఏ ప్రకృతి అయితే వారిద్దరిని వీడదీసిందో!?… తగిన సమయం లో అదే ప్రకృతి వారికి అనుకూలిస్తూ… సహకరించింది.
లేకపోతే, ఏ అమ్మలక్కలు కిటికీల మధ్య నుండి చూస్తారోనన్న భయంతో అంత తొందరగా చేరువకాగలిగేవారు కాదు కదా!
స్వస్తి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!