ఇదో ప్రేమ కథ

(అంశం:”ప్రేమ/సరసం)

ఇదో ప్రేమ కథ

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

వైజాగ్ ఉడాపార్కులో ఓమూలకు చేరుకున్నారు
శ్రీకాంత్ చంద్రికలు.రోజూ ఒక గంటపాటు కలుసుకొని
పార్కులో కాలక్షేపంచేయడం వారికి గత రెండుసంవత్సరాలుగా జరుగుతూనేవుంది.ప్రేమించి పెళ్ళిచేసుకోవాలని వారి లక్ష్యం.కాకపోతే సమయమే
చాలా ఎక్కువతీసుకుంటున్నట్టులేదు మీకు.
అది అంతేనండి.అదేమిటో కాస్త వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా మీరు.దానిదేముందిలెండి పదండి కధలోకి వెళ్దాం.
—————-
శ్రీకాంత్ ది వైజాగ్ కి దగ్గరలో వున్న ఒక పల్లెటూరు.
పల్లెటూరు అంటే మరీ పాతసినిమాలలో చూపేట్టుకాదండి.కొంచెం పట్నానికి దగ్గరగా వుంది
కాబట్టి పట్టణప్రభావం పల్లెటూరుపై ఉంటుందికదా.
ఆ వూరిలో చదువుకోవడానికి పదవతరగతివరకే
ఉందండి.ఇక పై చదువులకు దగ్గరగావున్న వైజాగ్
పట్టణమే దిక్కుకదండి.అలా వైజాగ్లో ఇంటరునుండి
డిగ్రీవరకు అక్కడే తిష్టవేసేశాడండి మన హీరో శ్రీకాంత్.మరి పెద్దమోతుబరి కుటుంబం కాదండి
వాళ్ళది.కూడుకి గుడ్డకి ఎప్పుడూ లోటులేకుండా
గడచిపొతుంది.ఇంటికొక్కడే కొడుకు కావడం తో
శ్రీకాంత్ ని కాస్త ముద్దుగానే పెంచారు.ఉన్నంతలో
ఏలోటులేకుండా చూసుకునేవారు.తండ్రి వ్యవసాయంతోపాటు ఒ చిన్న కాంట్రక్టు పనులు
కూడాచేసేవాడు.పట్నంరాకముందు శ్రీకాంత్
రాముడు మంచిబాలుడేనండోయ్.చదువుమీదశ్రద్ద
అది ఎక్కువే.పదవతరగతి మంచిమార్కులు
తెచ్చుకున్నాడు.వాళ్ళ అమ్మానాన్నలకైతే
కొడుకుని డాక్టర్ని చేయాలనే పట్నంలో చేర్చారు.
ఇంటరు వరకు శ్రీకాంత్ బాగానే చదువుకున్నాడు.
కాకపోతే వాళ్ళ అమ్మానాన్నలనుకున్నట్టు డాక్టరు
కోర్సు చదువుకు తగిన అర్హత సాధించలేకపోయాడు.
ఇక గత్యంతరంలేక బి.టెక్ లో చేరాడు.ఉద్యోగం
రాకపోయినా స్వంతంగా కాంట్రక్టులు చేసుకోవచ్చని
సివిల్ కోర్సులో చేరాడు.ఇక్కడ కధ కి మొదటి
ట్విస్టు ఇవ్వాల్సిందేనండి.
మొదటిసంవత్సరం కొత్తగా చేరినవారికి సీనీయర్సు
ఆటపట్టించాలంటూ వుంటాయికదండి.ఇంటరులో
ఎదో చిన్నా చితక పనులు చేయించి వదిలేసేవారు.
మరి పెద్దచదువులుకదండి.కాస్త పెద్దగానే ఆటపట్టించాడాలుండాలికదా.అది కో -ఎడ్యూకేషన్
కాలేజి.ఇక ఆడమగాకూడ కలిసే ఆటపట్టిస్తారు.
అలా ఒక గేంగు ఉందండి ఆ గేంగుకి నాయకురాలు
చంద్రికండి.చంద్రిక కాస్త డబ్డున్న ఇంటినుండి వచ్చిన
అమ్మాయేనండి.అందుకే బెల్లంచుట్టూ ఈగలు చేరుతాయికదండి.అలా ఎర్పడినదే ఆ గేంగు.
మొదటిరోజు కాలేజీ లోకి అడుగుపెట్టాడు శ్రీకాంత్.శ్రీకాంత్ పల్లెటూరినుంచివచ్చాడేగాని
చూడడానికి తెలుగుహీరోలకున్నంత గ్లామర్ వుంది.ఒక్కసారి చూస్తేచాలు కళ్ళుతిప్పుకోలేరు.
తిన్నగా వెళ్ళిపోతున్న అతడిని చంద్రిక గేంగు చూడనేచూసింది.అందులో ఒక చిన్నారి శ్రీకాంత్ ని
రమ్మని పిలిచింది.అమ్మాయిలను దగ్గరగా చూడడం
పట్నం వచ్చాకే తెలిసింది శ్రీకాంత్ కి.ఆగాడు.
“హాలో!పస్టియరా!మా లీడరు రమ్మంటొందిరా.”అంటు
అటకాయించింది.ఇంటరులో కాస్త ఈ ఆటపట్టించడం
తెలుసు శ్రీకాంత్ మారుమాటాడుకుండా వెళ్ళాడు.చంద్రిక శ్రీకాంత్ ని చూసింది.ఒక్కనిమిషం
అలా చూస్తూ ఉండిపోయింది.అదే పరిస్థితి శ్రీకాంత్ ది.
అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడం మిగతా గేంగు
చూసి చంద్రికను తట్టారు.చంద్రిక తేరుకొని వివరాలు
అడిగింది.ఆకారంబట్టి అతను పల్లెనుండి వచ్చినట్టనిపించలేదు.వెంటనే తన హేండ్బేగునుండి
ఒక కాగితం తీసి అది వందకాఫిలు రాసి తెమ్మని
చెప్పింది.సరేనంటూ ఆ కాగితం పట్టుకొని వెళ్ళబోతూ
మరోసారి చంద్రికవైపుచూశాడు.ఆమె అందం అతనిని
ఆకర్షించింది.తొలిచూపులు కలిశాయి.ఇక మరుచటినుండి మెలమెల్లగా ఆమెను ఎదో వంకతో
కలిసి మాటలు కలిపేవాడు.అలా అలా రోజురోజుకు
వారి పరిచయం పెరిగి ఇలా పార్కులో కలుసుకునే
స్థాయికి వచ్చింది.ఇద్దరికి చదువు పూర్తిచేయాలనే
సంకల్పం వుండడంతోప్రేమాయణం సాగుతోంది.
——————-
ఆరోజు ఆఖరిపరీక్షలు రాసేసి బయటికి వచ్చాడు
శ్రీకాంత్.చంద్రిక తనకంటే సీనియర్ కావడంతో
పిజీలోచేరింది.ఇంటికి వెళ్ళెముందు సాయంత్రం
పార్కులో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.ఈ రోజు ఎలాగైనా పెళ్ళివిషయం ఖరారు చేసేసుకోవాలనే
నిశ్చయానికి వచ్చేశాడు శ్రీకాంత్.సాయంత్రం ఎప్పడవుతుందా అని ఎదురుచూడసాగాడు.
సాయంత్రం కావడంతో గదికి తాళంవేసి బయలుదేరాడు పార్కుకి.పావుగంటలో చేరుకున్నాడు.ఎప్పుడు ఇద్దరూ కూర్చోనె చోటుకి చేరుకున్నాడు.తనకంటేముందుగానే వచ్చేసింది చంద్రిక.ముందు చంద్రికనే పలరించింది శ్రీకాంత్ ని
“పరీక్షలెలా రాశావు డియర్.బాగానే రాసుంటావులే.తదుపరి ఆలోచన ఎమిటో”
“బాగానే రాశాను చంద్రి.ఇక తదుపరి కార్యక్రమమంటే
ఈ చందమామతో ఆటలాడుకోవడమే”అన్నాడు శ్రీకాంత్.
“అబ్బో!అంత ఆశలేమి పెట్టుకోకు.నా పిజీ కంప్లీట్ కావాలి.అంతవరకు ఆగాల్సిందే”చంద్రిక చెప్పేసింది.
“అంతవరకు ఆగడం నా వల్లకాదు.కాదుకూడదంటే
ఇంకొకరిని చూసుకుంటా”ఆటపట్టించాడు శ్రీకాంత్.
“అవునా!అలాగే కాని.చూద్దాం.”బుంగమూతి పెట్టింది
చంద్రిక.
“నువ్వు ఈ ఫోజులో ఇంకా ముద్దోస్తున్నావమ్మా ముద్దులగుమ్మా.”అంటూ దగ్గరగా జరిగాడు.
“ఆగాగు.అక్కడితో .ఇవేమి సాగేది లేదు.ఇలా అయితే
నే వెళ్ళిపోతా.”చంద్రిక దూరంగాజరుగుతూ.
“సీరియస్ గా అడుగుతున్నా చంద్రి.ఇకనేను చదివే
ప్రసక్తిలేదు.ఊరికెళ్ళి సొంత వ్యవహారాలు చూసుకోవడమే.నాన్నగారొక్కరూ చూసుకోలేకపోతున్నారు.మా ఇంటివాళ్ళనుండి ఎలాంటి అభ్యంతరాలు లేవు.ఇక గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందినువ్వు మీ వాళ్ళు”.శ్రీకాంత్ చంద్రికకు
చెప్పాడు.
“నాకు మరికాస్తసమయం ఇవ్వు శ్రీ.నేనింతవరకు
మన విషయం ఇంట్లో చెప్పలేదు.పీజీ ఆయినాక
అప్పుడు చెబుదామనుకుంటున్నాను.నువ్వు తొందరపడుతున్నావు”చంద్రిక తన పరిస్థితి చెప్పింది.
“నువ్వడగలేకపోతే చెప్పు నేను మా వాళ్ళచేత అడిగిస్తా మంచిరోజు చూసి.”శ్రీకాంత్ అన్నాడు.
“వద్దు వద్దు.నేనే చెబుతా.నా మాట కాదనరనే అనుకుంటున్నాను.మరొక్క వారంరోజులు ఆగు”చంద్రిక చెప్పింది.
“సరే!నువ్వింతగా చెబుతున్నావు గనుక వారంరోజులాగుతాను.ఇన్నాళ్ళు ఆగినవాడిని
ఆ మాత్రం ఆగలేనా!”శ్రీకాంత్ బదులు చెప్పాడు.
అలా ఒకగంటసేపుండి ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు.
——————-
వారంరోజులు గడిచిపోయాయి.ఎప్పటిలానే చంద్రికను
కలవడానికి పార్కుకి వెళ్ళాడు హుషారుగా.అరగంట…గంట…గంటలు గడిచాయి కాని చంద్రిక రాలేదు.నిరాశగా వెనుతిరిగాడు.మర్నాడు చంద్రిక వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.అక్కడొకాయన వున్నాడు.చంద్రిక గురించి
అడిగాడు.తనకి తెలియదన్నాడు.ఇరుగుపొరుగువారిని అడిగాడు.ఎవరూ ఏమి చెప్పలేదు.నిరాశగా వళ్ళిపోయాడు.అలా రోజులు….వారాలు…నెలలు… సంవత్సరాలు గడిచిపోయాయి…కాని చంద్రిక రాలేదు…ఇక రాదు.
రాలేదని రాదని తెలుసుకున్న శ్రీకాంత్ దేవదాసు కాలేదు.తాను ప్రేమించాడు.ప్రేమలో విఫలం కాలేదు.మరి చంద్రికేమయ్యింది..ఇక ఆ విషయం వదిలేద్దాం.శ్రీకాంత్ చంద్రికను తన మనోఫలకంనుండి తీయలేకపోయాడు .మరో అమ్మాయిని పెళ్ళిచేసుకోలేదు.ఊరెళ్ళి తన తలిదండ్రులకు చేదోడువాదోడుగాఉన్నాడు. పెళ్ళిచేసుకోమన్నారు. చేసుకోనన్నాడు.తలిదండ్రులు గతించారు.శ్రీకాంత్ మాత్రం తన ఊరిలోనే ఉండిపోయాడు. తండ్రి ఇచ్చిన ఆస్తిని పెంచాడు.నలుగురికి సహాయంచేస్తు జీవితం సాగిస్తున్నాడు.ఇప్పటికి వైజాగ్ ఉడా పార్కుకి వెళ్తాడు చంద్రికకోసం. రాదనితెలుసు.అయినా వెళ్తాడు. కొంతసమయం అక్కడ గడిపి వస్తాడు.అదోక సంతృప్తి తనకి.ప్రేమజంటలను కలుపుతుంటాడు.
ప్రేమపెళ్ళిళ్ళు చేస్తుంటాడు.అదోక కార్యక్రమంగా చేసుకున్నాడు.తనుమాత్రం ఒంటరిగానే మిగిలిపోయాడు.
************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!