రావు గారు చెప్పిన ఫుడ్ కథ

రావు గారు చెప్పిన ఫుడ్ కథ

రచన ::ఎన్.ధన లక్ష్మి

రావుగారిది అందమైన కుటుంబo భార్య పేరు పార్వతి ,పిల్లలు సూర్య మరియు కార్తీక్ .. బి.టెక్ ,ఇంటర్ చదువుతున్నారు..రావు గారు ప్రొఫెసర్ గ వర్క్ చేస్తూ ఉంటారు ..వాళ్ళది చాల సరాదాగ ఉండే కుటుంబం ..రావు గారు మరియు పార్వతి గారు ఫ్రెండ్లీగా ఉంటారు పిల్లలతో
ఓ ఆదివారం రోజు సూర్య వచ్చి వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి ఈ రోజు ఎం చేస్తున్నావు లంచ్ కి అని అడుగుతారు .. సాంబార్,రసం,పాయసం ఇంకా మజ్జిగ కన్నా అంటారు .
కార్తీక్ వచ్చి పో అమ్మ ఎప్పుడు అవే వంటలు ఇంకా ఏమి లేవా అని అలిగినట్టు పేస్ పెడతాడు ..
హలో వచ్చి పేస్ మాడ్చుకుని కూర్చొని ఉంటాడు . అప్పుడు రావు గారు వచ్చి ఏంట్రా చిన్నోడా నీ బాధ అని అడుగుతాడు ..
సూర్య వచ్చి చూడు నాన్న వాడు అమ్మ చేసే వంటలు బోర్ గ ఉన్నాయి అని అంటాడు.
రావు గారు నవ్వి అమ్మ చేసే వంటలు మన లైఫ్ ని మోటివేట్ చేస్తాయి తెలుసా అంటారు ..
అబ్బా చా పో నాన్న నువ్వు ఎప్పుడు అంతే
నీ డార్లింగ్ ఏమి చేస్తే అది సూపర్ అని అంటావు …
మనం తినే ఆహారం మన లైఫ్ ని మోటివేట్ ఎలా చేస్తుందో చెప్పు నాన్న…
రావు  గారు చెప్పడం స్టార్ట్ చేస్తాడు రేయ్ చిన్నోడా సాంబార్ కి రసము కి తేడాఏంట్రా అని అడుగుతాడు హా ఏముంది రెండు పప్పు దినుసులు చింతపండు,ఉప్పు ,ఇంగువ ,స్పైసెస్ అంతే కదా …అపుడు సూర్య వచ్చి నాన్న  ఫస్ట్ మనము సాంబార్ తింటాము తరవాత రసం అదే తేడా అంటాడు …రావు గారి గట్టిగ నవ్వి సాంబార్ లో వెజిటేబుల్పై వేస్తాము రసంలో లేదు కదా అని అంటాడు …
కార్తీక్ అయితే  ఏంటి నాన్న తేడా అంటాడు .
రావు గారు ఆహం మన మైండ్లో ఆక్రమించునప్పుడు గందరగోళం గ ఉంటుంది సాంబార్ లాగా .
అహం అంతే ఏంటి నాన్న అంటాడు ..???
సూర్య కార్తీక్ తల పైన మెట్టి ,అహం అంతే ఇగో కదా నాన్న అంటాడు రావు గారు నవ్వి హా అంటాడు ..
మన మైండ్ ఇగో లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది రసం లాగా అని అంటాడు ..
కార్తీక్ నిజం నాన్నాయో అంటాడు.
అందుకేగా మనం ఎపుడు సాంబార్ తరవాత రసం తింటాము అని చెప్పుతారు
ఇగో లేనప్పుడు మనము హ్యాపీ గ ఉంటాము అప్పుడు స్వీట్ తింటాము అంతే పాయసం లాగా కదా అని అంటాడు కార్తీక్ ..అవును చిన్నోడా అంటారు
మన పండగలప్పుడు ,పెళ్లిలప్పుడు సాంబార్ ,రసం,పాయసం ,మజ్జిగ వడ్డిస్తారు..ఈ పద్ధతి మన దేశం లో మాత్రమే ఉంటుంది అని చెప్పుతారు రావు గారు …మరి మజ్జిగ ఏమి చెప్పుతుంది నాన్న అంటాడు కార్తీక్ …

మన లైఫ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు ,మనకు ఏమి వద్దు అనిపిస్తుంది మజ్జిగ లాగా అని అంటాడు .అందుకే మన ఫుడ్ తిన్నప్పుడు మజ్జిగ లేంది ఎవరు ఫుడ్ ని తినడం పూర్తి చేయరు …
మనము తినే ఫుడ్ మన మైండ్ ని కంట్రోల్ చేస్తుంది అందుకే సాత్వికమైన ఆహరం తినడం అలవాటు చేసుకోవాలి అని అంటాడు …
కార్తీక్ థాంక్స్ నాన్న అంటారు .అయితే ఇంకా నేను ఎపుడు అమ్మ చేసి వంటను తప్పు పట్టను అని అంటాడు.
అమ్మ వంట రెడీ అయిందా అని కిచెన్ లోపాలకి వెళ్లి వాళ్ళ అమ్మ ను కాకా పడుతున్నాడు కార్తిక్..
రావుగారు ,సూర్య ఈ చిన్నోడు ఏమి చెప్పినా చక్కగా  అర్థం చేసుకుంటారు అని నవ్వుతారు  …

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!