అసూయను మించిన శాపం లేదు

అసూయను మించిన శాపం లేదు

రచన:పిల్లి.హజరత్తయ్య

అసూయ అనే నలక
మనసులో పడితే
పగ పొగ పెడుతుంది
ప్రతీకారం దారులు వెతుకుతుంది..!

అసూయనే అగ్నిజ్వాలలు రగిలితే
ద్వేషానికి ఆజ్యం పోస్తూ
క్షణాలలో వైషమ్యాలను సృష్టిస్తుంది
అనుబంధాలను విచ్ఛిన్నం చేస్తుంది..!

అసూయ కట్టెకు అంటుకున్న నిప్పులా
మనిషిని దహించి వేస్తుంది
చెద పురుగులా తొలుస్తూ
అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తుంది..!

అసూయ అంటు వ్యాధిలా
అసంతృప్తినే ప్రాణాంతకమైన
వైరస్ ను ప్రబలేలా జేస్తూ
మానవ సంబంధాలను దిగజారుస్తుంది..!

అసూయ శ్రీకృష్ణుని సత్యభామ
వీధిలో విక్రయించేలా చేసింది..!
దుర్యోధనుడిని సైతం ఆడించి
అథఃపాతాళానికి తొక్కేసింది..!

అసూయను వదిలించుకోవాలంటే
చెడు ప్రభావాలను అర్థం చేసుకొని
ఆధ్యాత్మిక సాధన చేయాలి..!

దీనిని పూర్తిగా త్యజించగలిగితే
ప్రేమ మధురిమలను ఆస్వాదిస్తూ
ఆప్యాయతనే అనుభూతిని పొందవచ్చు..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!