అక్షరం పుట్టుక

అక్షరం పుట్టుక

రచన :: పావని చిలువేరు

నిండుచూలాలు అయిన కలం పురుడు పోసుకుంది .
అక్షరమై అవతరించి లోకసంక్షేమాన్ని
తన పొత్తిల్లలో పొదిగి చైతన్యానికి ఆయుషు పోస్తూనే ఉంది .
అక్షరమే నిండు ముత్తైదువగా,  పూర్తి అమ్మతనంతో
మానవజాతిని మేల్కొలుపుతూనే ఉంది .

కలం చెక్కిన అక్షరం,
బ్రహ్మ చెక్కిన బొమ్మలకి,
జీవితాన్ని చెక్కుకునే
పదునైన ఆయుధంగా మారి
ఇంకా నొప్పులు పడుతూనే ఉంది .

బలపం పట్టిన వేళ్లు పులకరించి తప్పటడు వెయ్యకుండా
పరవల్లు తొక్కుతూ పరిగిడినవేల
ఉద్భవించిన అక్షరం …
తన మునివేల్లతో
అంధకారాన్ని తరిమి కొట్టే  విశ్వప్రయత్నం చేస్తూనే ఉంది.

లక్షల కన్నా కోటిరెట్టు విలువైన అక్షరం
సంస్కారం అనే చిమ్నీలో
జ్ఞానం అనే తైలాన్ని ఉపయోగించి
ఆలోచనలను వత్తిగా మలచి
అక్షరాలని వెలిగిస్తూ
అక్షరాస్యతను తరిమికొట్టడం
అక్షరానికి వెన్నతో  పెట్టిన విద్య .

అక్షరమాల వర్ణమాలగా మారి
ఉజ్వలమైన భవిష్యత్తుకి
పూలమాల అయ్యి
కారుచీకటిని పారాద్రోలడం పెద్ధగా కష్టమేమీ కాదు.

నవరసాల వింత పోకడకి
చరమ గీతం పాడి
అక్షరమై భావితరాల  భవిష్యత్తును ముందు వరుసలో పెట్టడానికి  పదప్రయోగం చేస్తూ
అద్భుతాలు సృష్టింస్తుoదనడం అక్షరసత్యం.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!