కల్పతరువు

కల్పతరువు

రచన :: బండారు పుష్పలత

తరువును రా నేను మీ కల్ప తరువునురా…
రూపము అమ్మిస్తే ఊపిరి నేనిచ్చి పుట్టిన నాటి నుండి మీకు ప్రాణం నిలిపేటి ప్రాణదాతనురా…
నీగృహానికి నేను చౌకోటునయ్యాను దులమై,వాసమై వున్నాను తలుపుగా నిలిచి మిమ్ము కాపాడుతున్నాను..
నీవు నిదురించు శయ్యనై నిదురపుచ్చుతున్నాను
మీయింటిలో నేను మీరు కూర్చున్న కుర్చినై నిన్ను బరువనకుండా మోస్తున్నాను
నువు విద్యార్ధి గాచదువు బల్లనే నయ్యాను..
గురువు చేతులో బెత్తమై నిలిచి నిను క్రమశిక్షణ పెట్టుపనిలోన వున్నాను..
ఒకప్పుడు వంటచెరుకుగా మారి మీ కడుపు నింపాను..
పువ్వులు పూచి కాయలు కాచి పండ్లలను ఇచ్చి పౌష్టికాహారమయ్యాను..
నువ్వు సేదతీరు చల్లని నీడనయ్యాను..
మీకు వయసు మీదపడితే
ఉత కర్రనై నిలిపాను…
నీ జీవితమంతా తోడు గా నిలిచాను నీతోడై నడిచాను మీరు ఊపిరి వదిలితే నువు కాలు కట్టెగామారి చితి నేను అయ్యాను..
ఓ మనిషి నా ప్రాణము తియ్యొద్దు..
నన్ను నరికి నువ్వు నా నీడలోనే సేదతీరు తున్నావు
నాప్రాణము పోయాక నీకు నీడనిచ్చే దెవరు..
భావితరాలకు పచ్చని చెట్లను అందించి ఆరోగ్య ప్రపంచాన్ని నిలుపు అదే నీ గెలుపు…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!