నాన్న కదా

నాన్న కదా

రచన :: వాడపర్తి వెంకటరమణ

రక్తం పంచాడతను…
తన చిటికెన వేలు అందించి
నడక నేర్పాడతను!

తన కలల ప్రతిరూపాలకు
పూలబాట వేయాలని
నెర్రలిచ్చిన పాదాలు కమిలిపోతున్నా
భుజాలపై బాధ్యతల బరువెత్తుకుని
కష్టాల కంటకాల దారుల్లో నడిచాడతను!

తన కంటిపాపలు చల్లగుండాలని
ఇసుమంతైనా కళ్ళకు విశ్రాంతినివ్వక
భగ భగ మండే నిప్పుకణికల్ని
ఆనందంగా తొక్కాడతను!

కాలమిప్పుడు
విష సంస్కృతి వైపు
విరగబడి చూస్తోంది

నడక నేర్పిన ఆ కాళ్ళకు
వృద్ధాశ్రమం వైపు నడిపించినవారెందరో…
అయినా ఆ కళ్ళల్లో కోపం లేదు
గుండె గూటిలో పదిలపరుచుకున్న
ప్రేమమూర్తులపై ప్రేమ తప్ప
ఎందుకంటే… అతను నాన్న కదా!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!