ఓరిని.. నీ.. ప్రేమ బంగారం గాను

ఓరిని.. నీ.. ప్రేమ బంగారం గాను

రచన: జయకుమారి

ఏమి చెప్పాలి?
ఎలా చెప్పాలి?
తీరం తెలియని ప్రేమ
మనస్సు తలుపు దాటి తీరం చేరేది ఎప్పటికో.. అని.
ఏమిటో ఈ రెండు అక్షరాల ప్రేమ మనిషి జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పుతుందా.
ఏముంది ఈ ప్రేమ అనే పధంలో ఈ సృష్టి లోని సమస్త ప్రకృతి అంత తనలో నింపుకొని.
ఒక జీవితాన్ని శాసిస్తుందా.
అయిన శివయ్యా నిన్ను ఏమి అడిగాను.
చెప్పు ,మణులే అడిగాన
మాణిక్యాలు అడిగాన.
ఈ గుప్పెడు అంత గుండెను పాలించే  చిటేకెడు అంత ప్రేమను అడిగాను .
అంతేనా ఏమైనా కోరరాని కోరిక ఆడిగాన.
పోనీలే నాది తప్పే.
నిన్ను పూజించాలి కానీ వరాలు అడగకూడదు అని నేనే అన్న, కాదు అని నేనే  అన్నాను.
అయిన నా మనస్సు నా మాట వినటం లేదు.
ప్రేమ, ప్రేమ అని మారం చేస్తుంది.
పదే పదే అడుగుతుంది.
కనీసం ఒక్క రోజు అయినా జీవితానికి సరిపడే అంత ప్రేమను ప్రసాధించమని అడుగుతుంది శివ.
ఇది అత్యాశే కాదు అనను,కానీ నువ్వు ఇచ్చిన జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరించాలి. అనుకుంటున్నా.
ఈ ప్రేమ లేని బ్రతుకు భారం గా మారి.ఇన్నాళ్లు
నా గుండెల్లో దాచిన  బాధ అగ్ని పర్వతం లా పేలి, లావా లా ఉబికి వచ్చి నన్ను నిలువెల్లా దహించకుండా నీ పాదాల చెంత తల దాచుకున్న ,
నన్ను తరుముకొచ్చే సునామీ నుంచి కాపాడుకుంటావో, లేక నను ముంచేసి నీలో ఐక్యం చేసుకొంటావో నీదే భారం శివ..
అని శివుని పాదాల దగ్గర తన గుండెల్లో ఉన్న బాధను అంతా వినిపిస్తూ,రోదిస్తూ ఉన్న  ,
ఆమె భుజంపై ఒక చేతి స్పర్శ  , ఆమెను స్పృహ లోనికి తెచ్చింది.

అది ఎప్పుడూ తను కోరుకునేదిే ,తను ఎప్పుడు పొందలేని ప్రేమతో కూడిన మధురానుభూతిని
కలిగించింది.
ఆ స్పర్శ కు పులకాంకితం అయిన తను, కళ్లలో నుండి ఉబికివస్తున్న గంగపొంగులను ఆపగల పరమశివుడి ప్రతిరూపం గా అనిపించాడు ఆ క్షణం అతను తన కళ్ళకు.

తన చేతిలోకి ఆమె మోమును తీసుకొని తన కన్నీటిని తుడిచి. తన ప్రేమ ను అంతా నుదిటి ముద్దు గా మలిచి ఆమెకి అందించిన క్షణం ఆమెలో అనుఅణువు
పరవశించి ఇన్నాళ్ల నుంచి తనకి భారం గా మారిన తన గుండె ఒక ముద్దుతో తెలికపడినట్టు అయ్యింది..
ఇంక చాలు పిల్ల ఈ లోకంలోకి రా..
నీవు కోరుకునే నీ ప్రేమను నీకు కానుకగా ఇస్తా..
అతని మాటలు, ఆమెను
మంచుకొండ ల అంచుల మీద నుంచి మబ్బుల సందేశంలా అనిపించింది.

నీ నేను నిను చేరిన తర్వాత కూడా ఇలా మూడీగా ఉంటే నాకు అస్సలు నచ్చదు.
లే.. లే..ముందు మనం ఒక చోటుకి వెళ్ళాలి.

ఆమె కి కనీసం అస్సలు ఏమి జరుగుతుందో కూడా ఆలోచించే టైం ఇవ్వకుండా..
ఇది వరకు మగాడి చెయ్యి తగిలితే చిరాకు పడి, ఆ చేతుల నుండి దూరంగా పారిపోవాలి లేకపోతే ,తనని తాకిన ఆచేతులను ఏమి చెయ్యలేక నిశ్శబ్దంగా, ఏమిచెయ్యలేని  నిస్సహాయత కి ,తనని  తనే అసహ్యించుకో నే ఆమె. ఇప్పుడు ఎవరో కూడా తెలియని వ్యక్తి తన శరీరాన్ని అంతా అతని చేతులతో
ఎత్తుకొని కార్ లో కూర్చో బెట్టి కళ్ళకి గంతలు కట్టి తీసుకువెళుతున్నా  , అతనికి అడ్డు చెప్పలని లేదు,తన శారీరం మొత్తం ఆమె అధీనం నుంచి అతని చేతిలోకి వెళ్లిపోయిన్నట్టు అనిపించింది. ఆ క్షణంలో ఆమె మౌనం కూడా తనకు దగ్గరగా అతనికి దూరంగా ఉండిపోయింది. ఆమె తేరుకొని అది కాదు మీరు,
నువ్వు ఏమి మాట్లాడకు ఒక 10 నిముషాలు ఓపిక పట్టు .
నువ్వు  కోరుకున్న  తీరాలని నీ పాదాల ముందు ఉంచుతా..
ఆమె మనస్సులో ఒకే ఆలోచన అతను పరిచయం లేని పేరు, కానీ తను అనుభూత పొందుతున్న పేరు.
ఆమె ఆలోచనలు, ఒక పదిహేను నిమిషాల ముందు తను ఉన్న పరిస్థితి. ఇప్పుడు తను ఉన్న పరిస్థితి అంతా కొత్తగా, వింతగా ఉన్న ఆమె కోరుకున్న స్పర్శ ఊహల్లో తను అనుభూతిని పొందుతున్న స్పర్శ  అది.
తన ఆలోచనలకు అడ్డు కట్ట వేస్తూ,కళ్ళకి ఉన్న గంతలు విప్పకుండా మళ్ళీ తనని ఎత్తుకొని నడుస్తున్నాడు ,  ఈ సారి ఇరువురి గుండె చప్పుళ్ళు ఎకతాళమై , ఆ పరిసరాల్లోని గాలి కూడా వారికి సహాయం చేసినట్లు ఒక చల్లని చిరుగాలి మేనుని తాకుతూ ఉంటే,అతని కి ఇంకా దగ్గరగా ఉండాలని  ఆమె మనస్సు కోరుకుంటుం ది. ఆమెని క్రిందకు ధింపుతూఉంటే ఆ క్షణం లో ఆమె మనస్సు కోరుకునేది  ఆ చేతుల లోనే  కలకాలం ఉండి పోవాలని. ఆ  ప్రదేశం అంతా పరిమళ భరితంగా అనిపించింది.
అతను ఆమె ను కూర్చోబెట్టి  ఆమె పాదాలను తన చేతిలోకి తీసుకొని తనకు ఇష్టమైన పట్టీలను ఆమె పాదాలకు అలంకరించి ,
నీ కాళి మువ్వ లు చేసే చిరుసవ్వడి కూడా నా శ్వాస కు ఆయువు పోస్తుంది. అని
మురిసిపోతూ తన పెదవులతో ఒక చిరూముద్దు ఇవ్వగానే ఆమె శరీరంలో అనుఅణువు పులకించిపోయింది.
అతనుఆమెను వెనుక నుంచి కౌగిలించుకొని
ఆమె మెడ పై తన పంటితో తీయ్యనైన గాయం చేస్తూ తన కళ్లకు ఉన్న గంతలను విప్పి.
తన కళ్ళలోకి చూస్తూ…

I Love you  పిల్ల..

ఎందుకో తెలియదు,ఏమిటో తెలియదు కాని నిజం అని తెలుసు.
నువ్వు నా ప్రాణం అని చెప్పగలను .
నా చివరి శ్వాస వరకు నిను నాలో దాచుకుంటాను.నీ ఊహల జగతిలొ నను నేను చూసుకొనే ప్రతిసారి నా హృదయ లయలు శృతి తప్పి ప్రణయ గీతం ఆలపిస్తున్నాయి.
ఇది నా మనస్సు నీకు చేస్తున్నా ప్రోమిస్.

అని ఆమె పెదవులపై, తన పెదవులతో మధురసంతకం చేస్తూ ఈ క్షణం వారి ప్రేమకు అంకితం, ప్రకృతి కూడా వీరి పరవశానికి పరవశించి పోతుంది అని పించేలా మౌనం కూడా ఆ క్షణం  ఆమని సంగీతం ఆలపిస్తుందా అనిపించింది.
ఇరువురు ఒక్కరా ,ఇద్దరా అనేది కూడా మర్చిపోయేంత దగ్గరగా అయ్యిపోయారు .

ఓ నిముషం ఈలోకానికి రాగానే ఆమె అతనిఆ నుంచి దూరంగా జరిగి.
నువ్వూ…నువ్వూ..
ఆహా.. నేను ఎవ్వరో నీకు తెలియదా..
ఆమె మనస్సు అతను తనకు ,తన మనస్సుకు దగ్గరైనా మనిషి అని చెబుతుంది.
కానీ ఆమె కళ్ళు ఎప్పుడు ఎక్కడ చూడలేదు.
అని చెబుతున్నాయి.
కానీ అవే కళ్ళు ,తనని వెంటాడే ఆ రూపం ఆమె కి తన మనిషే అని చెబుతున్నాయి.
సరే వదిలేయి పిల్ల ..
నేను నీ వాడిని ఈ క్షణం నుంచి..
సరే ఇలా రా ఒక సారి అని ఆమె చేతిని పట్టుకొని ఒక  గదిలోకి తీసుకువెళ్లి .
ఇలా పైకి చూడు పిల్ల,  అని పైకి  చూపించగానే
ఆమె కళ్ళలోకి కార్తీక పౌర్ణమి రోజున కురిపించివెన్న ల అంతా ఆ రోజు  అతని వల్ల తన కళ్లలో.
ఆ గది చిన్నప్పటి నుండి తన ఊహ ప్రపంచం.
పందిరి మంచం ,
పైన ఆకాశం అంతా తన ప్రేమకు సాక్ష్యం గా..
తారలన్నిటిని తన దోసిట నింపి , తన మంచం చుట్టూ పూల పందిరిగా అ లంకరించుకోవాలని.

అల్లంతా దూరాన ఆ చందమామ..
ఆమె చెంత తన మనస్సున కొలువైన పున్నమి చంద్రుడు అతను
తన కల ,తన కళ్ళ ఎదురుగా ఆమె మోమును సంతోషం ,ఆమె పెదవులపై చిరు దరహాసం…
ఆమె కళ్లలో కోటి దీపాలకాంతి…

అలా నిలబడి తను అనుభూతి చెందుతున్న ఆ క్షణం,
అతను ఆమెని ఈ లోకానికి తీసుకొని రావడానికి ,చిలిపిగా ఆమె నడుముపై  ఒక ముద్దుఇచ్చి చిలిపిగా గిచ్చాగానే ..
అబ్బబా …పిల్లొడా
హా.. ఏంటి పిల్ల ఇలా రా అని పందిరి మంచంపై కూర్చోమని ఒక్క నిముషం కళ్ళు ముసుకో వచ్చేస్తున్న అని.
చేతిలో కంచం తో ఆమె ఎదురుగా కూర్చుని.
ఇప్పుడు కళ్ళు,నోరు కూడా తెరువు అనగానే తనకు ఇష్టమైన అవకాయ్ నెయ్యి వేడి అన్నం.
ముద్దలుగా చేసి పెడుతూ ..
ముద్ద తో పాటు ఒక్కో ముద్దు తో ఆమె తనువునంత ముద్దులతో ముంచేస్తూ ఆమె ని ప్రేమ పరవశం లో ముంచేశాడు.
ఆమె అలా అతనిని చూస్తూ ఉండి పోయింది.అతని కళ్లలో ఆమె కోరుకున్న అమ్మ ప్రేమ, నాన్న బాధ్యత.
స్నేహుతుడి ఆదరణ..
ప్రేమికుడి కొంటె ప్రేమ ఆ క్షణం ఆమె అనుభవిస్తుంది.
పిల్లొడా
మైమరిపిస్తోంది నీ ప్రేమ..
నాలోకాన్ని మొత్తాన్ని మార్చేసి..
నను నీ ప్రేమ మాయలో పడేసి..
నా లోకాన్ని కొత్త రంగులతో నా ఎదుట నిలిపింది.
ఈ హాయి నిజమో, మాయో అర్ధం కావడం లేదు.
నా కలల విరుల వనంలో ..
కాలమంతా మన ప్రేమ కు పాన్పుగా మార్చి.
నిను నాలోదాచేసుకోమంది.
మునుపటి జన్మలలో ముడిపడు పుణ్యములే. నీ నీడ గా నన్ను చేరి ..
నా బ్రతుకునే  నిండు పున్నమిలా మురిపిస్తుంది.
ఇది
జతపడు హృదయమై జగమునే మరిపిస్తుంది.
ఓయ్..పిల్లో డా

హా..చెప్పు
ఏమి చెప్పాలి ..
ఇలా ఎలా నువ్వు ఎవరో, నేను ఎవరో ఈరోజు ఈ క్షణం ఒక్కరమై ఒదిగిపోయాం..
కనురెప్ప మూసి కలగన్న అంతే పెను ఉప్పెన ల్లె
ఎద ఉప్పొంగిపోతుంది నీ ప్రేమలో..
గోరంత గుండెల్లో ఇన్నాళ్లు రవ్వంత సవ్వడి కూడా నేను చూడలేదు.
కోత్తగా ఈ హాయి రాగల పులకింతలు ఏమిటో..
చూడూ ఎంతబాగుందో ఈ వాతావరణం, ఈ గది,ఈ పందిరి మంచం,  నువ్వు నీ పక్కన నేను.
మనతో ఆనెలరాజు.
ఆహా.. ఇంకా
నీతో ఈ హాయి..
ఏ హాయి పిల్ల
అది..అది..
పోనీ నన్ను చెప్పమంటవా పిల్ల..
హ్మ్మ్…
నీ అనుఅణువు న నా అధరాల తో ముగ్గులు వేస్తూ అంటూ ,
ఆ మన్మధుడే ఆ క్షణం అతనిలో అలా చిలిపి పనులకు చిరునామా గా మారి.
ఆమెను మధన సామ్రాజ్యానికి యువరాణి గా,అతను యువరాజు గా మార్చి ఆడుతున్న రాసలీలలు..
ఆమె తనువు అతని స్పర్శ కై పరితపిస్తూ..
ఉంది అనే చెప్పే ఆ సోయగాల కళ్ళు.
ప్రతి ది ఆమెకు అతనిపై ఉన్న ప్రేమ ను చూపిస్తూ..
ఆరోజు ఆ నిషి రేయిను జన్మ జన్మల గుర్తుండిపోయే జ్ఞాపకాలు గా మలుచుకొని.మిగిలిపోవాలని ఉంది.
నా చివరి శ్వాస లో  నీ ఒడిలో ,నీ కళ్ళలోకి చూస్తూ కనుముయ్యాలని ఉంది.
అన్న మాట పూర్తి కాకముందే..అమ్మయి …లే … టైం అవుతుంది.
కాలేజ్ కి వెల్లవా లేచి త్వరగా రెడి అవ్వు..
దేవి ఫోన్ చేసింది.
ఓహ్..
సరే అమ్మ,నేను చేస్తానులే..
అమ్మ అటు వెళ్ళగానే దేవి కి ఫోన్ చేసి.
నిన్న నైట్ మళ్ళీ కల వచ్చిందే  అదే వ్యక్తి నా కలల రాకుమారుడు వచ్చేడే.
దేవి:- వచ్చాడా ,వస్తాడు
నైట్ ఏమిచేసి నిద్రపోయావే.
2 నిముషాల్లో నువ్వు గోడ దగ్గరకు రా,
ఇక్కడ అమ్మ ఉంది. నీ పని చెబుదాం అంటే.

సరే వస్తున్న .
దేవి రాగానే  దా ..తల్లీ… రా,
నిన్ను ఏమి చెయ్యాలి.
కార్తిక్ గారు రాసిన కధ చదివి నిద్రపోయావా..
హా..నీకు ఎలా తెలుసు.
అబ్బో.. ఇదో పెద్ద దేవరహాస్యం మరి.
ఆయన ఎక్కడ తగిలాడే  నీకు..
ఓహ్ మర్చిపోయా.
ఆ ఉత్తమ రాలుని నేనే కదా!
ఏదో పాపం ఏమి తోచడం లేదు అంటున్నవి అని కార్తిక్ గారు రాసిన బుక్  ఇచ్చా!
ఆ రోజు నుంచి ఎన్ని సార్లు చదివావే, చదవడం ప్రేమ ప్రేమ నన్ను చంపటం ?
ప్రతిరోజు నా… ఇలా?
నీకు పిచ్చా ఏమైనా!
ఆయన ఏదో ఆయన మటికి ఊహించుకొని ప్రేమ ఇలా ఉంటుంది అని ఆయన కథల్లో రాయడం.
ఆ కథలో నువ్వు లీనం అయ్యి.
ఆ హీరో లా ప్రేమించే  అబ్బాయి ని ఊహించుకోవడం ఇది ఎక్కడి కర్మ నే నాకు.
కలలు కనడం,
నిజంగా అలా ప్రేమించే అబ్బాయి లు ఉండరు.నా మాట విని ఇంకా ఆ పుస్తకం చదవకే ,నిన్ను చూస్తే నాకు భయం వేస్తోంది.
రేపు పెళ్లి అయ్యిన తర్వాత ఇలాగే పిచ్చిగా మాట్లాడవు అంటే,గొడవలు జరిగిపోతాయి.

అయిన నేను ఏమైనతప్పుగా కోరుకుంటునాన్న
ప్రేమ నే కదా కోరుకునేది.

ఈ లోకంలో ప్రేమ కు మించిన ఆస్తి ఉంటుందా.
చెప్పు దేవి.

నేను ఆ ప్రేమ నే కోరుకుంటున తప్పెమిటి దేవి.

చూడు పిల్ల… తప్పు లేదు .

అది సినిమాల్లో చూడడానికి ,పుస్తకాల్లో చడగవడానికి మాత్రమే బాగుంటుంది.

నిజంగా కార్తిక్ గారు ఆ అమ్మయిని ఆ అబ్బాయి ఎంత ఇష్టపడ్డాడో, ఎంతలా ప్రేమించాడో రాసారు కదా, అంటే నిజంగా ప్రేమ ఉన్నటే కదా దేవి.

అయ్యో నన్ను చంపమాకే ,
వదిలేయి ఆ సంగతి ,చదువుకో,పో ముందు.

దేవి నీకు తెలుసా ఈ సృష్టిలో ప్రేమ ఇచ్చినంత మానసిక  ఆనందం మారేది ఇవ్వలేదు.
ప్రేమించిన వ్యక్తి పక్కన ఉండి, తన ప్రేమ ను మనకు పంచుతుంటే…
అమ్మ లా, నాన్నలా, స్నేహితుడు లా, భర్తలా
అన్ని ప్రేమలు,అందరి ప్రేమలు తానై ఉంటే.
ఇంకేమి కావాలి జీవితానికి ఏదైనా సాధించి చూపించొచ్చు తెలుసా…

హా.. అవును

కానీ అలా ఎవరు ఉండరు, వేళ్ళు పని చూసుకో అత్త పిలుస్తుంది పో…

ఓయ్.. పిల్ల ఆ కార్తిక్ గారి బుక్ ఇలా ఇవ్వు,
నువ్వు చెబుతుంటే నాకు చదవాలి అనిపిస్తుంది.

బుక్ చదివి నేను కూడా కలలు కంటాను.
హా..హా… ఇప్పుడు దాకా నేను చదువుతున్న అని తిట్టవు.

హ్మ్మ్ అవును నేను కొన్న కానీ చదవలేదు.
నువ్వు చెబుతున్న ప్రేమ గొప్పతనం ఏముందో చదువుతా..
అది కాదు రాత్రి కలలో ఆ పిల్లోడు నాకు ఇష్టమైన ప్లేస్ కి తీసుకువెళ్లి, నా కాలికి పట్టీలు పెట్టాడే..
అబా… మొదలు పెట్టకే తల్లి…
పో… పో…. అని తిట్టి…
తాను చదవడాం మొదలు పెట్టింది దేవి…

ఓరిని… నీ… ప్రేమ బంగారం గాను.

ఎందుకా ఈ పిచ్చిది.
కార్తీక్ ,కార్తీక్ అని చచ్చిపోతోంది అనుకున్నా..
ఇంత ప్రేమ ఒలకబోస్తూ రాస్తూ ఉంటే ఆమాత్రం ఉండాలిలే అనుకుంటూ…
*********
ప్రస్తుతం
భర్త ఉన్నంత కాలం అతని ప్రేమ కై ఎదురు చూసి,అతను పెట్టె కష్టాలు తట్టుకొని .
చివరికి జీవితాన్ని కోల్పోయిన దీనిని చూస్తుంటే ఏమైపొతుందో అని భయం గా ఉంది.
ప్రేమ అనుకుంటూ ఎన్ని ఎన్ని కలలు కన్నదో..
ఇప్పుడు ఈ పిల్లను ఎలా ఓదార్చాలి దేవుడా! అనుకుంటూ గతంలో వాళ్ళు కలిసి మాట్లాడుకున్న మాటలు గుర్తు చేసుకుంటూ లోపలికి వెళ్ళింది దేవి.
పిల్ల.. ఎలా ఉన్నావ్ అంటూ దేవి పిలిచినా పిలుపు కు ఈలోకానికి వచ్చిన  ఆమె,

దేవి నువ్వా ఎలా ఉన్నావే?

హ్మ్మ్ బానే ఉన్న!

నువ్వు ఇలా ఎలా అయ్యేవే..

నేనా ఎలా ఉన్ననే బ్రతికే ఉన్నా కదా?
అది కాదు ఇన్ని కష్టాలు ఎలా భరించావే ,
హ్మ్మ్ ఆదా హా.. హా…

జీవితంలో దేని గురించి ఆశ పడకూడదే..
దేని కోసం అయితే ఆరటపడతామో అదే మనకు దక్కదు.
బదులు లేని ప్రశ్నకు

అయినా నేను కోరుకున్నది.
ప్రేమ

అని ఇద్దరూ ఒకరిని ఒకరు పట్టుకొని ఎదుస్తున్న ఇద్దరిని చూస్తూ అందరి కళ్లలో నీళ్లు..

దేవి తన బ్యాగ్ లో నుంచి ఒక  బుక్ తీసి ఇచ్చి ఇది చదువే రిలీఫ్ గా ఉంటుంది. అని చెబుతూ తను ఇచ్చిన బుక్ అది.
అది చూసి జయ వద్దు లే నేను ఏమి చదివే పరిస్థితిలో లేను..
ఇటు చూసి మాట్లాడు ఈ బుక్ కార్తిక్ గారు రాసారు.
కలల తీరం ,చాలా బావుంది చదువు .
అని ఆ బుక్ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది దేవి.
*******
ప్రతి మనిషికి జీవితంలో కొన్ని ఆశలు,కోరికలు ఉంటాయి.
అవి నెరవేరితే జీవితం ఆనందంగా ఉంటుంది.
కానీ జయ లా ప్రేమను కోరుకునే మనిషి కి.
ప్రేమ లేకపోగా అడుగు అడుగున కష్టాలు పాలుఅయితే ఆమె లా మౌనం గా శిల లా మిగిలిపోతారు.
అలాంటి వారికి వీలు అయితే కొంచెం ప్రేమను ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యండి.
వారి నుంచి ఆకాశమంత ప్రేమను పొందండి…
******
ప్రతి వారు తాను కోరుకునే ప్రేమ కలల తీరాలు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.
****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!