చదువు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: పి. వి. యన్. కృష్ణవేణి
ఒకప్పుడు ఏం చదువుతున్నాము? ఎందుకు చదువుతున్నాము? ఈ చదువు వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? నేను ఏం సాధించటానికి ఇది ఎన్నుకున్నాను? అనే ఒక వివరం ఉండేది. విద్య నేర్చుకుంటున్నాము అనే ఒక వాక్యము కంటే విద్యని కొంటున్నాము. అని చెపితే బాగుంటుంది అనిపిస్తోంది. అర్దవంతంగా ఉండాల్సిన భవితవ్యం ప్రశ్నార్థకంగా మారబోతోంది. ఇది నిజం. ఇదిలా ఉంటే, ఏమి చదువుకున్నామో తెలియదు. ఏమి పని చేస్తున్నాము అనేది తెలియదు. అంతా అగమ్యగోచరంగా తయారైంది భవిష్యత్. విద్య తక్కువ, విషయం ఎక్కువ అన్నట్టు తక్కువ విద్య ఉన్నవాడు అందలం ఎక్కుతాడు. ఎక్కువ చదువు ఉండి, ఙ్ఞానాన్ని పొందిన వాడు చేతులు కట్టుకుని వినయంగా నడచుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. తల్లిదండ్రులు ఒకటి గమనించాలి.
పిల్లల ఇష్టాయిష్టాలను గమనించంచండి. చదువు పేరుతో వారిని శిక్షించ వద్దు. చదువు లేక పోయినా సమాజంలో హుందాగా ఎలా బతుక వచ్చు అని వారికి తెలియచెప్పాలి. సదుపాయాలకు విలువ ఇవ్వటం కాదు, సంతృప్తి విలువ తెలియ చేయండి.
అధికార దర్పం కాదు, నువ్వే ఆదర్శంగా అందరికీ నిలువాలని చెప్పి ఉత్సాహ పరచాలి. విద్యనే ప్రాణంగా భావించు, విద్య కోసం ప్రాణాన్ని తీసుకోకు.