తెలుగోళ్లం

తెలుగోళ్లం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: లోడె రాములు

తెలుగు వాళ్ల చిహ్నలం
పౌరుషానికి పోతరాజులం
దోస్తు చేస్తే బతుకమ్మ పూలం
ఆడబిడ్డకు బోనమెత్తే ఆచారం
పంచాయితీ కొస్తే కాలు దువ్వే కాటమరాజులం
నమ్మితే ప్రాణమిచ్చే కర్ణులం
నట్టేట ముంచినా ప్రతీకారం తీర్చుకోవడం
మా రక్తంలో లేనోళ్లం
హక్కులు సాదించుకోవడం తెలిసిన యుద్ధ వీరులం
తన్నినోళ్లను తల కెక్కించుకోవడం
మా రాజకీయ దౌర్భాగ్యం
ప్రపంచానికి సైతం స్నేహం అందిస్తాం
పచ్చని ఆకే మాకు బంగారం
ఆత్మీయంగా అలాయ్ బలాయ్ ప్రేమతో మాఇళ్లకు ఎవరు వచ్చినా ఆ రోజంతా ధూమ్ ధామే
ధాన్య రాశులు, హరిదాసులు
కోళ్లపందాలు, సంక్రాంతి రంగవల్లులు
షడ్రురుచుల ఉగాదే మా జీవితం
తెలుగోడి కల హస్తినకు నిచ్చన లేయడం
స్వతంత్రంగా సత్తా చాటేదెవరో

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!