మాటల తూటాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: శిరీష వూటూరి
మాటలు చాలా
పదునైనవి
గునపంలా మదిని
గుచ్చుతాయి
మాట అనేసి
పొరపాటని గ్రహిస్తాం
కానీ క్షమించమని
అడగాడినికి సంకోచిస్తాం
పెదవి దాటిన మాటలు
వెనక్కి రావని తెలిసి
కూడా మళ్లీ మళ్లీ
తప్పు చేస్తుంటాం
మాటలు తూటాల్లా
తగలకుండా
ఎల్లరి మదిని దోచేలా
మృదువుగా ఉంటే ఇక
మన వెంటే అందరూ.