గుసగుసలాడే ఊహలు

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

గుసగుసలాడే ఊహలు

రచన: హసీన ఇల్లూరి

గుసగుసలాడే ఊహాలకేం తెలుసు
నీ తలపులలో నేనెంతగా వేగుతున్నానో
కానీ నీ చిలిపి ఊసులు చేప్పాయి
నా ఊహాలలో ఊయలలూగమని

తలలోని మరు మల్లెలు గుసగుసలాడాయి
నీవు చేసే కొంటె చేష్టలకు సాక్ష్యంగా నిలవాలని
నాతో చెప్పే ఊసులు వినాలని కోరాయి
నీవు నేనుగా మారే క్షణాన్ని ఆస్వాదించాలని

నీ ఊహలు మోసుకొచ్చే గుసగుసలు
నను నిలువెల్లా తడిపేస్తూ ఉంటే
ఏ తీరానో ఉన్న నీవు నా దరి
చేరేదెపుడో ఆ ఊహలు ఊసులుగా మరేదెపుడో అని

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!