తారక మంత్రం!

(అంశం:: “చాదస్తపు మొగుడు”)

 తారక మంత్రం!

రచయిత :: వాడపర్తి వెంకటరమణ

తుడిచిందే తుడవమంటాడు/
కడిగిందే కడగమంటాడు/
మీకేమన్నా పిచ్చా అంటే/
పరిశుభ్రత పాటించాలంటాడు/

మసాలాల జోలికి వెళ్ళొందంటాడు/
బయట పదార్థాలు తినొద్దంటాడు/
బుర్రతినకు మహాప్రభో అంటే/
రుచిగా శుచిగా ఉండాలంటాడు/

సినిమాకెళ్దామంటే టి.వి. ఉందంటాడు/
షాపింగుకెళ్దామంటే ఖర్చెందుకంటాడు/
చచ్చేటప్పుడు డబ్బు తీసుకెళ్తామా అంటే/
బతికున్నప్పుడు కావాలిగా అంటాడు/

నా మొగుడి చాదస్తంతో…/

పరిశుభ్రత తూ.చ. తప్పక పాటించి/
క్రిమి కాటునుండి తప్పించుకున్నాం/

వ్యర్థ పదార్థాల బారిన పడకుండా/
ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకున్నాం/

బయట తిరుగుళ్ళు తగ్గించుకుని/
ఆదాయాన్ని సులువుగా పెంచుకున్నాం/

ఇప్పుడు చాదస్తమే తారక మంత్రంలా కనిపిస్తోంది!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!