యువత మేల్కొంటే!

అంశం: నిశి రాతిరి

యువత మేల్కొంటే!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బాలపద్మం

నైతిక విలువలు పాతరేసి
తన ప్రగతి చెట్టును తానే
మత్తు గొడ్డలి తో నరికి
పబ్బుల్లో డబ్బులు పోసి
అకృత్యాలకు అఘాయిత్యాలకు
జీవితం వృధా చేసే యువతకు
సాక్షిగా నిలిచేది నిశి రాతిరి
అరాచకాలూ అన్యాయాలూ
నిర్లజ్జగ సాగించే
స్వార్థ పరులు రాజ్యమేలితె
పగలు కూడా నిశి రాతిరే
యువత మేల్కొని బాధ్యత వహిస్తే
వెన్నెల కురిసి అలిసి
జాబిలి సేద తీరే నిశి రాతిరిలో
భానుడుదయించే వెలుగు నింపవచ్చు
నిశీధి నీడలు వీడి, లే
మేల్కొని రాతిరిని తరిమి కొట్టు!

You May Also Like

10 thoughts on “యువత మేల్కొంటే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!