చీకటి బ్రతుకులు

అంశం: నిశి రాతిరి

చీకటి బ్రతుకులు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

నిశిరాతిరిలో నిశాచరులై వెల్లదీస్తున్న చీకటిబ్రతుకులెన్నో
ఆ నీరవనిశిధిలో నిర్ధాక్షిణ్యంగా చేస్తున్న
అకృత్యాలెన్నెన్నో
ఆ నింగి నింగిపైన తారకలే సాక్ష్యాలుగా జరుగుతున్న
అత్యాచారాలెన్నో
అర్ధరాత్రిస్వాతంత్య్రం ఆడదానికి ఆశనిపాతంలా మారిందే
దేశభావిపౌరులు మత్తులో జోగుతూ తూలుతూ
గడిపే చీకటిరాతిరి
ఆకలిదప్పులతో అలమటిస్తు గూడుకూడుగుడ్డలేక
ఆరుబయట చలిలో వెళ్ళదీస్తున్న చీకటిబ్రతుకులెన్నో
కుట్రలకు కుహనా రాజకీయతంత్రాలకు
ఆ నిశిరాతిరియే అనువైన సమయం
చోరులకు చొరబాటుదారులకు కలసొచ్చేది
ఆ నిశిరాతిరియే కదా
కాముకులకు కామపిశాచాలకు ఎదురుచూసేది
ఈ నిశి రాతిరియే
నిశిరాతిరి నిర్దయలేని రాతిరి
నీచనికృష్టులకు నెలవైన రాతిరి
చేదునిజాలను వెలీకితీసే రాతిరి
చేదు అనుభవాలను మిగిల్ఛే రాతిరి
అదే అదే నిశిరాతిరి
నిదురపోనివ్వని రాతిరి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!