పనిలో నిబద్దత

ఆంశం: మనస్సాక్షి

పనిలో నిబద్దత
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సావిత్రి తోట “జాహ్నవి”

ఒక పనిని ఆరంభించే ముందు
ఇష్టాయిష్టాలతో పనిలేకున్న మనస్సాక్షి అంగీకారం తప్పనిసరి.
మన శక్తి సామర్థ్యాలు మనకి కాకా వేరోకరికి తెలియునా!
ఎంతవరకు చేయగలమో!
ఓరులకు ఏ విధమైన మేలు, కీడు వొనగురుతుందో!
చేసే పనికి ఎవరు ఏం అంటున్నారోనని కాకా,
మనసు అంగీకారం తెలుసుకున్న రోజు
ఆ పనిలో విజయం తథ్యం.
మనస్సున మనిషేప్పుడు తనకు తానే మహారాజు,
మనస్సాక్షి దృష్టిలో.
ఎవరు కాదన్న, ఎందరు విడిపోయినా!
చెడుతలపులతో నిండిన మనసుకీ
మనస్సాక్షి రూపంలో ఏదోనాడు దండన ఎదుర్కోక తప్పదు.
ఎన్ని సన్మానాలు, సత్కారాలు పొందినా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!